‘‘నగరంలో మూతపడిన మిల్లు స్థలాల్లో పుట్టగొడుగుల్లా నూతన కట్టడాలు వెలుస్తున్నాయి. అందుకు అవసరమైన స్థలం కావల్సినంత లభిస్తుంది. కానీ ప్రతీ రోజు పోగవుతున్న వేలాది టన్నుల చెత్తను వేసేందుకు అవసరమైన డంపింగ్ గ్రౌండ్‌లకు మాత్రం స్థలం లభించడం లేదు. పోగైన చెత్తను ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. అందుకు నగరంలో డంపింగ్ ఏర్పాటు చేసేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కు త్వరగా సాధ్యమైనంత స్థలం సమకూర్చి ఇవ్వాలి’’
- ముంబై హైకోర్టు
సాక్షి, ముంబై : వాణిజ్య, వ్యాపార సంస్థలు నెలకొల్పేందుకు స్థలం లభిస్తుంది.. కానీ డంపింగ్ గ్రౌండ్‌లకు స్థలం ఎందుకు లభించడం లేద ని ముంబై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నగరం, ఉప న గరంలోని దేవ్‌నార్, కాంజూర్‌మార్గ్, ములుండ్ ప్రాంతాల్లోని డంపింగ్ గ్రౌండ్‌లో పోగైన చెత్తను నిర్వీర్యం చేయడంలో నియమాలు అమలు చేయడం లేదని గతంలో జరిగిన అనేక విచారణల్లో కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై దాఖలుచేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై న్యాయమూర్తులు అభయ్ ఓక్, అచలియాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
10 రోజుల్లో నిర్ణయం తీసుకోండి
కాంజూర్‌మార్గ్‌లోని డంపింగ్ గ్రౌండ్ సామర ్థ్యం పెంచివ్వాలని బీఎంసీ డిమాండ్ చేసింది. డంపింగ్‌కు అదనంగా స్థలం సమకూర్చి ఇచ్చే అంశం కూడా ప్రభుత్వం వద్ద పెండింగులో ఉందని, అందుకు సంబంధించిన ప్రతిపాదన సీంఎ దేవేంద్ర ఫడ్నవీస్‌కు పంపించామని ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. దీంతో 10 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. కాగా, ప్రస్తుతం నగరం, పట్టణాల్లోని అన్ని డంపింగ్ గ్రౌండ్‌ల పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే నూతన కట్టడాలకు మంజూరునిచ్చే అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుందని బెంచి స్పష్టం చేసింది.
అయినప్పటికి డంపింగ్ గ్రౌండ్‌కు స్థలం సేకరించలేకపోయాయి. ములుండ్, దేవ్‌నార్ డంపింగ్ గ్రౌండ్‌లో చెత్త వేసేందుకు గడువు ఈ ఏడాది నవంబరు వరకు ఉంది. ఆ తరువాత పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాంజూర్‌మార్గ్ డంపింగ్ గ్రౌండ్‌లో రోజూ 3,000 మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతుంది. మిగతా డంపింగ్ గ్రౌండ్‌లో సుమారు 7,000 మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతోంది. సామర్థ్యానికి మించి చెత్త పోగవుతున్నప్పటికీ ఏ డంపింగ్ గ్రౌండ్‌లో కూడా నియమాలను పాటించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.
డంపింగ్‌కు స్థలం ఎందుకు లభించట్లేదు?
Published Thu, Sep 3 2015 3:33 AM | Last Updated on Sat, Sep 29 2018 5:47 PM
Advertisement
Advertisement