Mumbai Municipal Corporation
-
కరోనా పోరు: మరోసారి అక్షయ్ భారీ విరాళం
ముంబై : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనుసును చాటుకున్నారు. కరోనాపై పోరాటంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.3 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం కోసం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్కు(పీపీఈ) ఈ డబ్బును అందజేశారు. ఈ విషయాన్ని భారత సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్మ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. ఇక కరోనా సంక్షభంలోనూ విరామం లేకుండా పనిచేస్తున్న వారికి అక్షయ్ ధన్యవాదాలు తెలిపారు. ‘మమ్మల్ని, మా కుటుంబాలను సురక్షితంగా ఉంచడానికి.. పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేస్తన్న వైద్యులు పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆర్మీ అధికారులు, వాలంటీర్లు.. తదితరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ గురువారం ట్వీట్ చేశారు. (24 గంటల్లో 650 కేసులు, 30 మరణాలు ) #Update: After contributing ₹ 25 cr to #PMCares, #AkshayKumar contributes ₹ 3 cr to #BMC to assist in the making of PPEs, masks and rapid testing kits... #COVID19Pandemic #CoronaVirus #Covid_19 #COVID19 — taran adarsh (@taran_adarsh) April 10, 2020 దేశంలో విస్తరిస్తున్న కరోనా నుంచి దేశాన్ని రక్షించేందుకు నిధుల సేకరణ చాలా అవసరమని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మోదీ పిలుపుపై స్పందించిన అనేకమంది విపత్కర సమయంలో చేయూతనిస్తూ దేశానికి అండగా నిలుస్తున్నారు. అయితే ఇప్పటికే కిలాడీ అక్షయ్ ప్రధానమంత్రి సహాయ నిధికి రూ. 25 కోట్లు విరాళం అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా మూడు కోట్ల విరాళం అందజేసి మరోసారి సూపర్ స్టార్ అనిపించుకున్నారు. దీంతో కరోనా మహమ్మారిపై అక్షయ్ చేస్తున్న సహాయానికి అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు దేశంలో శుక్రవారం ఉదయం నాటికి కోవిడ్ -19 పాజిటివ్ కేసులు 6,412 కు చేరుకోగా..199 మంది ప్రాణాలు కోల్పోయారు. (కరోనాపై పోరాటం: అక్షయ్ రూ.25 కోట్ల విరాళం Name : Akshay Kumar City : Mumbai Mere aur mere parivaar ki taraf se... Police, Nagar Nigam ke workers, doctors, nurses, NGOs, volunteers, government officials, vendors, building ke guards ko #DilSeThankYou 🙏🏻 pic.twitter.com/N8dnb4Na63 — Akshay Kumar (@akshaykumar) April 9, 2020 -
బిరబిరా కృష్ణవేణమ్మ
సాధికారత కృష్ణమ్మ మహారాష్ట్రలో పుట్టి ఏపీకి వచ్చింది. కృష్ణవేణి... ఏపీలో పుట్టి మహారాష్ట్రకు వెళ్లింది. ఏమిటి పోలిక... కృష్ణమ్మకు, కృష్ణవేణికి! చిన్న పాయగా మొదలైంది కృష్ణానది. మూమూలు గృహిణిగా మొదలైంది కృష్ణవేణి. పరవళ్లతో ప్రవహిస్తోంది కృష్ణమ్మ. ఉరకలపై ప్రజాసేవ చేస్తోంది కృష్ణవేణమ్మ. బిరబిరా కృష్ణమ్మ అంటాం కదా... అలాగే... బిరబిరా కృష్ణవేణమ్మ అనాలి!! తెలుగువారికి అందని ద్రాక్షగా మిగిలిన బృహన్ ముంబై మహానగర్ పాలిక (మున్సిపల్ కార్పొరేషన్) లో ఈ ఏడాది ప్రాతినిధ్యం లభించింది! గత ఎన్నికల్లో వరంగల్ జిల్లాకి చెందిన అనూష వల్పదాసి శివసేన టిక్కెట్‌పై విజయం సాధించి అతిపిన్న వయసు కార్పొరేటర్‌గా రికార్డు సృష్టించినప్పటికీ, అనంతరం సాంకేతిక కారణాల వల్ల ఆమె పదవి రద్దు అయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కండిగ కృష్ణవేణి రెడ్డి (48) కార్పొరేటర్‌గా విజయం సాధించడంతో.. ఐదు దశాబ్దాల తెలుగు ప్రజల నిరీక్షణ ఫలించినట్లయ్యింది. ముంబైలోని ‘సాక్షి’ దినపత్రిక కార్యాలయంలో ఇటీవలి వరకు ఆపరేటర్‌గా విధులు నిర్వహించిన కండిగ కృష్ణవేణి ఇప్పుడు ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్ అయ్యారు. కడప నుంచి ముంబైకి కృష్ణవేణి స్వస్థలం కడప జిల్లా రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేట గ్రామం. నాన్న పూత్తూరు శివరామిరెడ్డి, అమ్మ వెంకటలక్ష్మి. కృష్ణవేణి విద్యాభ్యాసం అనంతరాజుపేటతో పాటు రైల్వేకోడూరులో జరిగింది. వివాహం చిత్తూరు జిల్లాకు చెందిన కండిగ వినోద్ రెడ్డితో జరిగింది. వినోద్ ఉద్యోగ రీత్యా ఈ దంపతులు ముంబైలో స్థిరపడ్డారు. సుమారు ఇరవై ఏళ్లకుపైగా ఆమె ఒక సాధారణ గృహిణిగా కుటుంబ బాధ్యతలకే పరిమితం అయ్యారు. కృష్ణవేణికి సమాజానికి ఏదైనా చేయాలన్న తపన ఉండడంతో తమ ప్రాంతంలో తన వంతుగా సమాజసేవా కార్యక్రమాలలో పాల్గొనేవారు. ఇంటి నుంచి ఉద్యోగానికి తండ్రి దివంగత శివరామిరెడ్డి రాజకీయాల్లో ఉన్నప్పటికీ కృష్ణవేణికి అంతగా రాజకీయ అనుభవంలేదు. అయితే 2014లో ఆపరేటర్‌గా ఉద్యోగంలో చేరడంతో ఆమె ఆలోచనా పరిధి విస్తృతం అయింది. ‘‘సాక్షిలో నేను విధులు నిర్వహించింది 15 నెలలే అయినప్పటికీ, అనేక విషయాలను తెలుసుకోగలిగాను. ముఖ్యంగా సాక్షి ఉద్యోగిగా మా ఏరియాతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నాకు గౌరవం లభించే ది. దీంతో మరిన్ని సమాజసేవా కార్యక్రమాలు నిర్వహించడానికి వీలు కలిగింది. ఆ క్రమంలోనే స్థానిక నాయకుల ప్రోత్సహంతో బీజేపీలో చేరాను’’ అని చెప్పారు కృష్ణవేణి. 2015లో కృష్ణవేణి దక్షిణ మధ్య ముంబై బీజేపీ మహిళ మోర్చా ప్రధాన కార్యదర్శి అయ్యారు. అయితే మొదట ఆమె పూర్తిస్థాయిలో పార్టీకి సేవలు అందించలేకపోయారు. ఆ ఏడాదే ఆమె తల్లి మరణించారు. అనంతరం అదే ఏడాది ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయం రాజకీయాలకు కేటాయించారు. రాజకీయాల్లోకి రాక ముందు నుంచే ‘పసుపు కుంకుమ’ తదితర కార్యక్రమాల ద్వారా తమ ప్రాంతంలోని మహిళలతో కృష్ణవేణి మమేకమై ఉండేవారు. రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం ఆ అనుబంధాన్ని బరింత దృఢంగా కొనసాగించారు. ఉద్యోగం నుంచి పాలిటిక్స్‌కి గత ఏడాది ఫిబ్రవరిలో సైన్ కోలీవాడాలోని ఇంద్రనగర్ గార్డెన్లో కృష్ణవేణి ఆధ్వర్యంలో జరిగిన పార్టీ కార్యక్రమానికి ఊహించిన దానికంటే రెట్టింపు సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఆ కార్యక్రమం ఆమెకు ఒక గుర్తింపు సంపాదించి పెట్టింది. పార్టీలో ఆమె ప్రాధాన్యాన్ని మరింత పెంచేలా చేసింది. బీజేపీ దక్షిణ మధ్య ముంబై అధ్యక్షులు అనీల్ ఠాకూర్, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కెప్టెన్ తమిళ సెల్వన్‌లు బీజేపీ దక్షిణ ముంబై మహిళ విభాగానికి అధ్యక్షురాలిగా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. దాంతో ఆమె క్రియాశీలత, నిర్వహణ సామర్థ్యాలు దక్షిణ మధ్య ముంబై జిల్లాలోని బీజేపీ నాయకులతోపాటు దాదాపు ఇతర ప్రముఖులందరి దృష్టికీ వెళ్లాయి. సొంత టీమ్‌తో ఇంటింటికీ 2016 డిసెంబరులో కృష్ణవేణి తన కంటూ ఒక టీమ్‌ను నియమించుకున్నారు. ఈ టీమ్‌తో కలిసి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలకు ప్రచారకర్త అయ్యారు.‘ఘర్ ఘర్ కి అభియాన్’ ద్వారా... ముఖ్యంగా మహిళలకు సంబంధించిన పథకాలపై స్థానికుల్ని చైతన్యవంతుల్ని చేశారు. ఫలితమే కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమెకు బీజేపీ టిక్కెట్. ‘‘కార్పొరేటర్‌గా బరిలోకి దిగిన అనంతరం మహిళలే నాకు బలంగా నిలిచారు. వారిలో తెలుగువారు కూడా ఉన్నారు’’ అని కృష్ణవేణి తెలిపారు. ప్రచారానికి తక్కువగా సమయమే లభించినప్పటికీ బహిరంగ సభలు కాకుండా ఇంటింటి ప్రచారానికి ఆమె ప్రాధాన్యం ఇచ్చారు. తన వార్డులో కేవలం ఒకే ఒక్క బహిరంగ సభ జరిగింది. ఆమె వెంట ప్రచారంలో సుమారు 75 నుంచి 80 శాతం మహిళలుంటే 20 నుంచి 25 శాతం మాత్రమే పురుషులుండేవారు. ప్రచారంలో భాగంగా ఉదయం నుంచి రాత్రి వరకు బయటే ఉండడంతో చాలాసార్లు కేవలం పాలు తాగి పడుకోవాల్సి వచ్చేదని కృష్ణవేణి తెలిపారు. ఒత్తిళ్ల నుంచి విజయానికి రాజకీయాల్లోకి రావడానికి ముందు, తర్వాత కూడా తన కుటుంబ సభ్యులు ఇచ్చిన, ఇస్తున్న సహకారం మరువలేనిదని కృష్ణవేణి అన్నారు. ‘‘నా భర్తతో పాటు నా ఇద్దరు పిల్లలు కుషాల్, వినీత్‌ల సహకారం అన్ని విధాలా నా ఒత్తిడిని తగ్గించింది. ముఖ్యంగా మా చిన్నబ్బాయి వినీత్‌తోపాటు వినీత్ కాలేజీ ఫ్రెండ్స్ నా ప్రచారానికి, పనులకు కష్టపడి సహకరించారు’’ అని కృష్ణవేణి చెప్పారు. కుషాల్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేసి ఎంబిఎ చేస్తూ ఉద్యోగం చేస్తుంటే, వినీత్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి తండ్రికి వ్యాపారంలో సహాయంగా ఉన్నాడు. కృష్ణవేణి భర్త ముంబైలోని ‘కేర్ ఇట్’ ఫార్మా యునిట్‌ను నడుపుతున్నారు. పెద్దబ్బాయికి తన తల్లి రాజకీయాల్లోకి తిరగడం ఇష్టం లేకపోవడంతో ఆమె తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఆసక్తి కనబరచలేదు. నిరంతరం ఆమె పార్టీ పనుల్లో తీరిక లేకుండా ఉండడాన్ని చూసి ‘ఎందుకమ్మా ఇదంతా’ అని బాధపడేవాడు. పదవి నుంచి ప్రజాసేవకు కృష్ణవేణి పోటీ చేసిన వార్డు 1740 (యాంటాప్ హిల్స్ – విజయ్‌నగర్)లో అత్యధికంగా మురికివాడలే ఉన్నాయి. తాగునీరు, మురుగునీటి వ్యవస్థతోపాటు ఆ వార్డులో అనేక సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని కృష్ణవేణి తెలిపారు. ‘‘రాజకీయాల్లో నాకంటూ ఓ ప్రత్యేక ముద్ర కోసం ప్రయత్నిస్తా. అందరిని కలుపుకుని పెద్దల సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతా. ముఖ్యంగా బీజేపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే కెప్టెన్ తమిళ సెల్వన్‌తోపాటు నా వార్డులోని బీజేపీ నాయకుల మార్గదర్శకత్వంలో కార్యకర్తలను కలుపుకుని పని చేస్తా’’ అని చెప్పారు. ‘‘మహిళలతోపాటు యువత రాజకీయాల్లో కొస్తే కొత్త ఆలోచనలతోపాటు, సాంకేతిక పరిఙ్ఙానాన్ని ఉపయోగించుకుని సమస్యలను త్వరగా పరిష్కరించే అవకాశం ఉంది. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. అందుకే ప్రజలు నాకు అవకాశం కల్పించారు. పార్టీతోపాటు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల సమస్యలు పరిష్కరిస్తా’’ అని కృష్ణవేణి అన్నారు. ‘రాజకీయ అనుభవం లేని మీరు రాజకీయ బురదలోకి ఎందుకుకొస్తున్నారు.. వచ్చినా.. ఎలా నెగ్గుకొస్తారు?’ అని కృష్ణవేణిని చాలామందే ప్రశ్నించారు. వారందరికీ చిరునవ్వుతో ఆమె చెప్పిన సమాధానం ఒక్కటే. ‘‘రాజకీయం బురద కాదు. బురదను శుభ్రం చేసే అవకాశం?’’అని! శ్రమను గుర్తించాడు కుషాల్! ‘నేను గెలిచినట్టు ప్రకటన రాగానే వాడిని ‘నాకు కంగ్రాట్స్ చెప్పవా?’ అని అడిగితే మా పెద్దబ్బాయి ఏమన్నాడో తెలుసా... సింపుల్‌గా ‘నీ కష్టానికి ఫలితం దక్కింది’ అన్నాడు. ఆ మాట నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. అభినందనలు చెప్పినా అంత ఆనందం కలిగేది కాదేమో! నా శ్రమను గుర్తించాడు మా పెద్దబ్బాయి’ అని కృష్ణవేణి చెప్పారు. అన్నట్టు... ప్రత్యర్థులు కూడా ఆమెను ‘లోకం తెలియని’ ఇల్లాలిగానే ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని తన గెలుపుతో తిప్పికొట్టారు కృష్ణవేణి. • ‘రాజకీయాలొద్దు... బురద’ అన్నారు పెద్దవాళ్లు. •‘ఎందుకమ్మా ఇదంతా’ అన్నాడు పెద్ద కొడుకు. •‘లోకం తెలియని ఇల్లాలివి’ అన్నారు ప్రత్యర్థులు. • అయినా ఆమె నిలిచారు. నిలిచి గెలిచారు. – గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై -
బిల్డర్ల నగరం ముంబై
విశ్లేషణ ముంబై నగర నిధులు భారీగా బ్యాంకుల్లో మూలుగుతున్నా అది అప్పులు చేస్తుంది, వడ్డీలు కడుతుంది. వాటిని సముచితంగా వినియోగిస్తే పౌరులకు సత్వరమే అవసరమైన సదుపాయాలను అందించగలరు. కానీ ఆ పని చేయరు. ముంబై మునిసిపల్ కార్పొ రేషన్‌పై నియంత్రణ కోసం రాజకీయ పార్టీలన్నీ తహ తహలాడుతాయి. అందుకు కారణం సుసంపన్నమైన ఆ నగర పాలక సంస్థ ఖజానా చేతికి అందుతుందనే ఆశే అనే భావన ఉంది. అది తప్పుడు అభిప్రాయమేం కాదు. ఆ నగర భారీ బడ్జెట్ రూ. 37,000 కోట్లు. అయి నాగానీ, అందులోంచి దొంగిలించగలిగినది మాత్రం తక్కువే. అదెలాగంటారా.. మొత్తం బడ్జెట్లో అత్యధిక భాగం వేతనాలకు, రుణ చెల్లింపులకు, పురపాలక సంస్థ నిర్వహణకే పోతుంది. అది 70 శాతం నుంచి 80 శాతం వరకు ఉంటుంది. ఇక మిగిలే భాగం నుంచే పౌరులకు అన్నిటినీ సమకూర్చాలి. ఆ పనిని అది అరకొరగానో లేక అంటీ ముట్టనట్టుగానో చేస్తుంది. 2015–16 వరకు గడచిన దశాబ్దకాలంలో ముంబై పుర పాలక సంస్థ సగటున ఏడాదికి 19.33 శాతం మౌలిక సదుపాయాల కల్పన, వాటి నిర్వహణల కోసం ఖర్చు చేసింది. జనాభా, అవసరాలు తప్ప మిగతా అన్నీ కొరతగానే ఉండే ఈ నగరానికి అది శోచనీయ మైనంత తక్కువ మొత్తం. అయినాగానీ, ప్రజలను మెప్పించడానికి భారీ కేటాయింపులను మాత్రం చేస్తుం టారు. చేసే ఖర్చు మాత్రం ఆ దరిదాపులలో ఎక్కడా ఉండదు. అంటే, అంకెల రీత్యా చూస్తే, కొల్లగొట్టడానికి మిగిలేది చాలా చిన్న మొత్తమే, అది ఎందుకూ చాలేది కాదు. కాకపోతే బొత్తిగా నాణ్యతలేని రోడ్లను నిర్మించే వారు, ఏటా వాటికి మరమ్మతులు చేయాల్సిన వారు అయిన కాంట్రాక్టర్ల నుంచి నేతలకు, అధికారులకు ముడుపులు అందుతాయి. అయితే, నియమ నిబంధన లను విరుద్ధంగా భవన నిర్మాణాలను అనుమతించడం ద్వారా, అలాంటి ఇతర కట్టడాలకు నిర్మాణ అనుమతు లను జారీ చేయడం, మొదలైనవాటి ద్వారానే వారికి అధికంగా డబ్బు రాలుతుంది. అందు వల్లనే ముంబైకి ‘‘ప్రజల నగరం’’గా గాక, ‘‘బిల్డర్ల నగరం’’గా పేరు. ఇలా అధికారంలో ఉన్న అన్ని స్థాయిల వారికి అక్రమ పద్ధతుల్లో డబ్బు అందడాన్ని ఎంత ఉదారంగా చూసినా, మాఫియా అనడం తప్పు కాదు. ఇక్కడ అక్రమ ధనం చేతులు మారేది నగర పాలక సంస్థ నిధుల నుంచి కాదు, మరెవరో ఇచ్చేది. కాబట్టి ఈ అక్ర మాలను మాఫియా అనడం సమంజసమే. అయితే, ఇది రియల్ ఎస్టేట్ వ్యయాలను పెంచి, ఫ్లాట్ ధరను పెంచుతుందనే వాస్తవం మాత్రం మిగులుతుంది. ముంబైవాసులకు అవి దాదాపుగా అందుబా టులో ఉండవు. ఎవరు అధికారంలో ఉన్నా చిన్న వీధుల్లో బహుళ అంతస్తుల టవర్ల నిర్మాణాన్ని అనుమతిస్తారు. మౌలిక సదుపాయాలు మాత్రం అలాగే ఉంటాయి. ఇక్కడ కాకపోతే అక్కడ, ఎక్కడో ఒక చోట పౌరులు ఎవరి ధన పిపాసకో మూల్యాన్ని చెల్లించక తప్పదు. కాకపోతే ఈ రంగంలో ధన పిపాస మరీ అసాధారణమైన భారీ స్థాయిలో ఉంటుంది. ఫలానా ఫలానా జేబుల్లోకి ఇంతింత అంటూ పుచ్చుకోడానికి బదులుగా అక్రమార్జనాపరులు బిల్డర్లతో భాగస్వామ్యా ల్లోకి ప్రవేశిస్తున్నారు. నిర్మాణ నిబంధనలు అనుమ తించే దానికంటే కొన్ని అంతస్తులను అధికంగా నిర్మించి, సదరు అధికారినో లేక రాజకీయవేత్తనో బిల్డర్లు భాగస్వామిగా చేసుకుంటున్నారు. అంతేతప్ప బేరసారాలు ఉండవు. అయితే ఇక్కడో చిక్కుముడీ ఉంది. కాంట్రాక్టర్లకు నిధుల మంజూరు నుంచి, చెత్త తరలింపు, రోడ్ల నిర్మాణం వగైరా ప్రతి చోటా జిత్తుల మారితనం ప్రయోగించినా ఇష్టానుసారం ఖర్చు చేయ డానికి లభించేవి చిన్న మొత్తాలే. అయినాగానీ ఆ నగరానికి భారీ చరాస్తులు ఉండటమే విడ్డూరం. అవి వాణిజ్య బ్యాంకుల్లో ఉన్న ఫిక్సెడ్ డిపాజిట్లు. డిపాజిట్ చేసే మొత్తాలు భారీవి కాబట్టి బ్యాంకర్లు వడ్డీరేట్లపై బేరసారాలు సాగిస్తారు. తాజా సమాచారం ప్రకారం నగర పాలక సంస్థకు రూ. 61,510 కోట్ల ఫిక్సెడ్ డిపా జిట్లు ఉన్నాయి. వీటిని సముచితమైన రీతిలో మదుపు చేస్తే నగర అవసరాలను సత్వరంగా తీర్చడానికి సరి పోయేవే. ఈ డిపాజిట్లలో ప్రావిడెంట్ ఫండ్, మిగులు ని«ధులు ఒక భాగం. అయినా మిగతా మొత్తం నమ్మ శక్యం కానంతటి పెద్దది. నగర ప్రభుత్వం అంత పెద్ద భారీ నిధులను నిరు పయోగంగా ఉంచడమేమిటనేది మాత్రం బహిరంగ చర్చకు నోచుకోలేదు. ఈ ఆస్తులపై ఏడాదికి 7 శాతం లేదా అంతకంటే ఎక్కువ రాబడి వచ్చినా, అది పెద్ద మొత్తంలో నగదు ప్రవాహాన్ని అందుబాటులోకి తెస్తుంది. అయినా నగర ప్రభుత్వం అప్పులకు వడ్డీలు కడుతుంది. నగదు మిగులు అందుబాటులో ఉన్నా అప్పులు చేయాల్సిన అవసరం ఏమిటో వివరించరు. చూడబోతే ముంబై నగరం బ్యాంకుల ద్రవ్యత్వాన్ని కాపాడటం కోసం నిర్మించాల్సిన పౌర సదుపాయాలను లేదా పౌర సేవలను మెరుగుపరచడాన్ని పరిత్యజించిందని అనిపి స్తుంది. నగర ప్రభుత్వానికి చెందిన ఇంతటి భారీ మొత్తాలు బ్యాంకులకు ఎలా చేరాయనే విషయమై ప్రజ లకు జవాబుదారీ వహించేవారు లేరు. దాన్ని పట్టించు కునే వారు ఎవరూ లేరు. బడ్జెట్లో కేటాయించిన డబ్బును ఖర్చు చేయకపోవడం వల్లనే ఆ నిధులు బ్యాంకుల్లో మూలుగుతున్నాయనేది స్పష్టమే. కేటా యించిన నిధులను ఖర్చు చేయలేకపోవడం ఏటా జరిగేదే. ప్రణాళికాబద్ధంగా కార్యకలాపాలను సాగిం చడం మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహణాపరమైన శక్తిసామర్థ్యాలకు మించిన పని అనే దీనర్థం. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
కృష్ణవేణి రెడ్డికి ‘సాక్షి’ అభినందనలు
సాక్షి, ముంబై: ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో విజయం సాధించి తెలుగు వారి కీర్తి పతాకాన్ని ఎగురవేసిన కందిగ కృష్ణవేణిరెడ్డిని సాక్షి ఫైనాన్స్ అండ్ అడ్మిన్ డైరెక్టర్ వైఈపీ రెడ్డి అభినందించారు. గత వారం జరిగిన బీఎంసీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాకు చెందిన కృష్ణవేణి రెడ్డి వార్డు నంబర్ 174 నుంచి గెలుపొందిన సంగతి తెలిసిందే. సాక్షి ముంబై కార్యాలయంలో రెండేళ్ల కిందటి వరకు కృష్ణవేణి ఆపరేటర్‌గా విధులు నిర్వహించారు. కార్పొరేటర్‌గా గెలుపొందిన అనంతరం ‘సాక్షి’ టీమ్‌కు కృతజ్ఞత తెలిపేందుకు ఆమె గురువారం ముంబై దాదర్‌లోని సాక్షి కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఓ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన వైఈపీ రెడ్డితోపాటు సాక్షి ముంబై యూనిట్ ఆమెకు పుష్పగుచ్చం అందించి అభినందిం చారు. ఆమె రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాలని ఆశీర్వదించారు. ఒక సాధారణ గృహిణి అయిన కృష్ణవేణి రెడ్డి సాక్షి ఆపరేటర్ నుంచి కార్పొరేటర్‌గా ఎదగడం తెలుగు వారు గర్వించదగ్గ విషయమని వైఈపీ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కృష్ణవేణి రెడ్డి కూడా సాక్షిలో ఆపరేటర్‌గా విధులు నిర్వహించిన సమయంలోని అనుభూతులను నెమరవేసుకున్నారు. -
సీనియర్ నటుడికి నోటీసులు!
ముంబై: అక్రమ నిర్మాణం విషయంలో బాలీవుడ్ సీనియర్ నటుడు ఇర్ఫాన్ ఖాన్‌కు ముంబై మున్సిపాలిటీ కార్పొరేషన్ నోటీసులు జారీచేసింది. ఒకే అపార్ట్మెంట్లో నివసిస్తున్న ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మతోపాటు, ఇర్ఫాన్ ఖాన్‌కు ఒకే సమయంలో నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఇద్దరు నటులు ముంబైలోని గోరేగావ్ బిల్డింగ్‌లోని డీఎల్హెచ్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్నారు. ఈ ఇద్దరు కూడా తమ ఫ్లాట్లలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు 2014లో బొంబాయి మున్సిపాల్ కార్పొరేషన్ (బీఎంసీ)కు ఫిర్యాదులు అందాయి. అదే సంవత్సరం నవంబర్‌లో ఈ విషయమై బీఎంసీ నోటీసులు జారీచేసింది. 2014 డిసెంబర్లో సంబంధిత అపార్ట్మెంట్ బిల్డర్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర ఊరటనిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, అపార్ట్మెంటులోని తొమ్మిదో అంతస్తులో కపిల్ శర్మ, ఐదో అంతస్తులో ఇర్ఫాన్ ఖాన్ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించిన బీఎంసీ న్యాయనిపుణుల సలహా తీసుకొని తాజాగా మరోసారి వారికి నోటీసులు జారీచేసింది. ఈ అపార్ట్మెంట్లో అక్రమ నిర్మాణాల గురించి సెప్టెంబర్ 9న తాజాగా మున్సిపల్ కమిషనర్ అజయ్ మెహతాకు నివేదిక అందిందని, గణేష్ ఉత్సవాలు ముగిసిన తర్వాత ఈ ఇద్దరు నటుల అక్రమ నిర్మాణాల విషయంలో చర్యలు తీసుకునే అవకాశముందని బీఎంసీ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. -
డంపింగ్‌కు స్థలం ఎందుకు లభించట్లేదు?
‘‘నగరంలో మూతపడిన మిల్లు స్థలాల్లో పుట్టగొడుగుల్లా నూతన కట్టడాలు వెలుస్తున్నాయి. అందుకు అవసరమైన స్థలం కావల్సినంత లభిస్తుంది. కానీ ప్రతీ రోజు పోగవుతున్న వేలాది టన్నుల చెత్తను వేసేందుకు అవసరమైన డంపింగ్ గ్రౌండ్లకు మాత్రం స్థలం లభించడం లేదు. పోగైన చెత్తను ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. అందుకు నగరంలో డంపింగ్ ఏర్పాటు చేసేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కు త్వరగా సాధ్యమైనంత స్థలం సమకూర్చి ఇవ్వాలి’’ - ముంబై హైకోర్టు సాక్షి, ముంబై : వాణిజ్య, వ్యాపార సంస్థలు నెలకొల్పేందుకు స్థలం లభిస్తుంది.. కానీ డంపింగ్ గ్రౌండ్లకు స్థలం ఎందుకు లభించడం లేద ని ముంబై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నగరం, ఉప న గరంలోని దేవ్నార్, కాంజూర్‌మార్గ్, ములుండ్ ప్రాంతాల్లోని డంపింగ్ గ్రౌండ్లో పోగైన చెత్తను నిర్వీర్యం చేయడంలో నియమాలు అమలు చేయడం లేదని గతంలో జరిగిన అనేక విచారణల్లో కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై దాఖలుచేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై న్యాయమూర్తులు అభయ్ ఓక్, అచలియాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. 10 రోజుల్లో నిర్ణయం తీసుకోండి కాంజూర్మార్గ్లోని డంపింగ్ గ్రౌండ్ సామర ్థ్యం పెంచివ్వాలని బీఎంసీ డిమాండ్ చేసింది. డంపింగ్‌కు అదనంగా స్థలం సమకూర్చి ఇచ్చే అంశం కూడా ప్రభుత్వం వద్ద పెండింగులో ఉందని, అందుకు సంబంధించిన ప్రతిపాదన సీంఎ దేవేంద్ర ఫడ్నవీస్‌కు పంపించామని ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. దీంతో 10 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. కాగా, ప్రస్తుతం నగరం, పట్టణాల్లోని అన్ని డంపింగ్ గ్రౌండ్ల పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే నూతన కట్టడాలకు మంజూరునిచ్చే అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుందని బెంచి స్పష్టం చేసింది. అయినప్పటికి డంపింగ్ గ్రౌండ్‌కు స్థలం సేకరించలేకపోయాయి. ములుండ్, దేవ్నార్ డంపింగ్ గ్రౌండ్లో చెత్త వేసేందుకు గడువు ఈ ఏడాది నవంబరు వరకు ఉంది. ఆ తరువాత పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాంజూర్‌మార్గ్ డంపింగ్ గ్రౌండ్లో రోజూ 3,000 మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతుంది. మిగతా డంపింగ్ గ్రౌండ్లో సుమారు 7,000 మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతోంది. సామర్థ్యానికి మించి చెత్త పోగవుతున్నప్పటికీ ఏ డంపింగ్ గ్రౌండ్లో కూడా నియమాలను పాటించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. -
నిద్రలో ‘నిఘా’ నేత్రం!
సాక్షి, ముంబై: నవీముంబైలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తున్న వారికి ఈ- చలాన్‌ను జారీ చేసేం దుకు నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎంఎంసీ) రోడ్లపై ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల సేవలు నిలిచిపోయాయి. కార్పొరేషన్ దీనికి సం బంధించిన బిల్లులను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐపీఎస్)కు చెల్లించడంలో విఫలమైంది. దీంతో నవీముంబై నగర రోడ్లపై పర్యవేక్షణ కొరవడింది. నవీముంబైలోని ముఖ్య కూడళ్లలో 262 హై డెఫినేషన్ కెమరాలను రిలయన్స్ కమ్యూనికేషన్ వారు అమర్చారు. అన్ని కెమరాలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు. అయితే కార్పొరేషన్ ఈ సేవలకు గాను కంపెనీకి డబ్బులు చెల్లించకపోవడంతో సదరు కంపెనీ ఈ సేవలను నిలిపివేసింది. సీసీ టీవీ కంట్రోల్ రూం అధికారులు అందజేసిన వివరాల మేరకు.. ఈ సేవలను అందించిన రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు.. కార్పొరేషన్ దాదాపు రూ.45 లక్షలను బకాయి పడింది. వీటి చెల్లింపుల జాప్యంతో రిలయన్స్ ఎనర్జీ ఈ సేవలను నిలిపివేసింది. దీంతో ఒక్క కెమె రా కూడా పని చేయడం లేదు. ఈ నేపథ్యంలో నవీ ముంబై నగర రోడ్లపై ఎలాంటి నిఘా లేకుండా పోయిందని అధికారి విచారం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు ఈ ఏడా ది ఆగస్టు ఒకటో తేదీ నుంచి సీసీటీవీ కెమెరాలను అందుబాటులోకి తెచ్చారు. వీటివల్ల ట్రాఫిక్ నియమోల్లంఘన చేస్తున్నవారిపై సత్వరమే చర్యలు తీసుకునేందుకు అధికారులకు వీలు కలిగింది. కాగా, ఇప్పటివరకు 200 మంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ కెమెరాలకు చిక్కారు. వీరిపై పోలీ సులు కేసులు నమోదు కూడాచేశారు. ఇందు లో 70 మంది వాహనదారులు జరిమానాలు చెల్లించారు. అయితే నియమాలు ఉల్లంఘించిన వాహన దారు లు జరిమానాలను నగరంలోని ఆయా ట్రాఫిక్ కార్యాల యాలలో చెల్లించవచ్చు లేదా నవీముంబై ట్రాఫిక్ పోలీస్ వెబ్‌సైట్‌ను ఆశ్రయిం చి కూడా వీరు జరిమానాలు చెల్లించవచ్చు. ప్రస్తుతం కెమెరాలు పనిచేయక పోవడంతో ఈ-చలాన్ జారీ చేసే వ్యవస్థ కూడా నిలిచిపోయిందని, అత్యవసర సమయంలో స్పందించడం కూడా కష్టంగా మారిందని ట్రాఫిక్ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిఘా నేత్రాల సేవలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి సంఖ్య 50 శాతం పెరిగిపోయిందని అధికారి పేర్కొన్నారు. -
నవీముంబైకి వైఫై సేవలు
సాక్షి, ముంబై : నగరంలో మొట్ట మొదటిసారిగా శివాజీ పార్క్‌లో ఉచిత వైఫై సేవలను పూర్తి చేసిన తర్వాత నవీ ముంబైలో కూడా ఉచితంగా ఈ సేవలను ప్రారంభించడానికి కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది. రెసిడెన్షియల్ కాలనీలు, ఉద్యాన వనాలు, బస్టాపులు, కాలేజీలలో వైఫై సేవలను ఏర్పాటు చేయడానికి నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది. ప్రస్తుతం నవీ ముంబై పలు మల్టీ నేషనల్ ఐటీ కంపెనీలకు నిలయంగా మారింది. అంతేకాకుండా ఇండస్ట్రియల్ కారిడార్‌గా పేరు సంపాదించింది. ఈ క్రమంలో రెసిడెన్షియల్ కాలనీల కోసం మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీ సదుపాయం అందించేందుకు కార్పొరేషన్ మరింత కృషి చేస్తోంది. 2012లోనే నిర్ణయం.. సాంకేతికారణాలతో జాప్యం నవీ ముంబైలో ఉచిత వైఫై సేవలను అందించడం ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు. 2012-13లోనే కార్పొరేషన్.. నవీ ముంబై వాసులకు ఉచిత వైఫై సేవలను అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ సేవల నిమిత్తం బడ్జెట్లో రూ.2 కోట్లను కేటాయించారు. నవీ ముంబైలో ఈ ఉచిత సేవలు ప్రారంభమైతే రాష్ర్ట మొట్ట మొదటి నగరంగా పేరు గడించనుంది. కానీ, కొన్ని సాంకేతిక పరమైన అడ్డంకులు ఎదురు కావడంతో అమలులో జాప్యం జరుగుతోందని సంబంధిత అధికారి జి.వి.రావ్ తెలిపారు. ఈ సేవలకు సంబంధించిన ప్రతిపాదన కేవలం రెసిడెన్షియల్ కాలనీల వరకే పరిమితం చేయాలనీ, ఈ సేవలను కార్యాలయాలు, వాణిజ్య సంస్థల స్థలాలకు విస్తరించ వద్దని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సేవలను అందించే ప్రక్రియలతో కార్పొరేషన్ బిజీగా ఉందనీ, వచ్చే ఏడాది వరకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన హామీ ఇచ్చారు. ఏఏ స్థలాలలో వీటిని ఏర్పాటు చేయాలన్న అంశంపై కార్పోరేషన్ నిర్ణయించనున్నదన్నారు. వైఫై సేవలను అందించేందుకు తాము పబ్లిక్ స్థలాలైన ఉద్యాన వనాలు, బస్‌స్టాపులు, కాలేజీలు, వినోద కార్యక్రమాలు జరిగే ప్రదేశాలను పరిగణలోకి తీసుకుంటున్నామని ఎన్‌ఎంఎంసీ అడిషినల్ సిటీ ఇంజినీర్ జి.వి.రావ్ తెలిపారు. ఇప్పటి వరకు ఇందుకు సంబంధించి టెండర్లను ప్రారంభించలేదన్నారు. ఈ ప్రక్రియ కోసం మరో మూడు నెలల సమయం పట్టనుందని అధికారి తెలిపారు. -
క్యాంపాకోలాలో కొత్త చిక్కులు
- నీటిపైపుల తొలగింపులో గందరగోళం - ఏ పైపు ఏ ఫ్లాట్‌కు వెళ్లిందో తెలియని స్థితి - అప్పటి మ్యాప్ లేకపోవడమే కారణం - కూల్చివేతలకు మరికొన్ని రోజులు సాక్షి, ముంబై: క్యాంపాకోలా కాంపౌండ్‌లో అక్రమంగా నిర్మించిన ఫ్లాట్లను కూల్చివేసేందుకు ముంబై మహానగర పాలక సంస్థ(బీఎంసీ) అధికారులకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఇప్పటిదాకా స్థానికులు అడ్డుపడగా ముఖ్యమంత్రి చొరవతో వారు వెనక్కు తగ్గారు. దీంతో ఇక చకచకా కూల్చివేతల పనులు కానిచ్చేద్దామని భావించిన అధికారులకు నీటిపైపుల తొలగింపు పెద్ద సమస్యగా మారింది. ఏ పైపు ఏ ఫ్లాట్‌కు వెళ్తుందో తెలియక తికమకపడుతున్నారు. అందుకు కారణం ఈ భవనాలు నిర్మించినప్పటి మ్యాప్ ప్రస్తుతం బీఎంసీ వద్ద అందుబాటులో లేకపోవడమే. నీటి సరఫరాకు సంబంధించిన మ్యాప్ తమ వద్ద లేదని బీఎంసీ అదనపు కమిషనర్ రాజీవ్ జలోటా స్వయంగా అంగీకరించారు. విద్యుత్, గ్యాస్ కనెక్షన్లను తొలగించడంలో పెద్దగా ఇబ్బందులు ఎదురుకాకపోయినా నీటి పైపుల తొలగింపు విషయంలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏ కనెక్షన్ తొలగిస్తే ఏ ఫ్లాట్‌కు నీటి సరఫరా నిలిచిపోతుందో తెలియడం లేదని, నీటి పైపులు తొలగించకుండా కూల్చివేతల పనులు మొదలు పెట్టడం సాధ్యం కాదని, దీంతో మరికొన్ని రోజులపాటు అక్రమ ఫ్లాట్ల కూల్చివేత పనులు జరిగే పరిస్థితి లేదంటున్నారు. మిడ్‌టౌన్ అపార్ట్మెంట్లో 20 అంతస్తులు, ఆర్కిడ్ అపార్ట్మెంట్లో 17 అంతస్తులు, ఈషా ఏక్తా అపార్ట్మెంట్లో 8 అంతస్తులు, శుభ్ అపార్టుమెంట్ అపార్ట్మెంట్లో 7 అంతస్తులు, పటేల్ అపార్ట్మెంట్స్, ఏ వింగ్‌లో 6 అంతస్తులు, పటేల్ అపార్ట్మెంట్స్, బి వింగ్ లో 6 అంతస్తులు, బి.వై.అపార్ట్‌మెంట్స్‌లో 6 అంతస్తులున్నాయి.. ఇక్కడ ఐదు అంతస్తుల వరకే అనుమతి ఉంది. ఆపై నిర్మించిన అంతస్తులకు నీటి కనెక్షన్లు కూడా అక్రమంగా ఇచ్చినవే కావడంతో వీటిని ఎక్కడి నుంచి, ఎలా ఇచ్చారనేది గుర్తించాలంటే చాలా సమయం పడుతుందని రాజీవ్ జలోటా పేర్కొన్నారు. -
‘కాంపాకోలా’వాసులకు మళ్లీ చుక్కెదురు
న్యూఢిల్లీ: మే 31లోగా ఫ్లాట్లను ఖాళీ చేయాలన్న సుప్రీంకోర్టు గత తీర్పును వ్యతిరేకిస్తూ ముంబైలోని ‘కాంపాకోలా’ హౌజింగ్ సొసైటీ వేసిన పిటిషన్‌ను మంగళవారం అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీనికి సంబంధించి ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న క్యురేటివ్ పిటిషన్‌పై తీర్పు వెలువడేవరకైనా అక్కడి అక్రమ ఫ్లాట్లను కూలగొట్టకుండా ఆదేశాలు జారీ చేయాలన్న అభ్యర్థనను కూడా జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ సీ నాగప్పన్‌ల ధర్మాసనం తోసిపుచ్చింది. అంతకుముందు వాదనల్లో భాగంగా.. ‘ఇది మానవత్వానికి సంబంధించిన పెద్ద సమస్య. 140 కుటుంబాలను ఖాళీ చేయాలంటున్నారు. వేరే ఎక్కడా వారు ఉండే పరిస్థితి లేదు. ఇక్కడ నేను చట్టపరమైన అంశాలనేమీ లేవనెత్తడం లేదు. ఇది దాదాపు క్షమాభిక్ష పిటిషన్ లాంటిది’ అని ‘కాంపాకోలా’ పిటిషనర్ల తరఫు న్యాయవాది రాజు రామచంద్రన్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దానికి ‘ప్రతీ కేసులోనూ మానవత్వమనే అంశం ఉంటుంది. లేదంటే మనకు న్యాయస్థానాల అవసరమే లేదు’ అంటూ ధర్మాసనం స్పందించింది. ఆ అక్రమ ఫ్లాట్ల యజమానులు వాటిని ఖాళీ చేసేందుకు సిద్ధంగానే ఉన్నారని, అయితే, ఆ ఫ్లాట్లను పడగొట్టకుండా సంబంధిత అధికారులను ఆదేశించాలంటూ ఆ ఫ్లాట్ల నివాసితుల సంఘం సుప్రీంకోర్టును కోరింది. ముంబైలో కాంపాకోలా హౌజింగ్ సొసైటీ పేరుతో 1981-89 మధ్య ఒక్కో భవనంలో ఆరు అంతస్తుల నిర్మాణానికి మాత్రమే అనుమతి తీసుకుని, ఒక్కో భవనంలో 15 నుంచి 20 వరకు అంతస్తులు నిర్మించారు. అక్రమ ఫ్లాట్లను కూల్చేయాలంటూ గత సంవత్సరం ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ముంబై మున్సిపల్ అధికారులను ఆదేశించింది. -
తాగునీటికి ఇబ్బందులు ఉండవు: బీఎంసీ
సాక్షి, ముంబై: నగరవాసులకు తాగునీటి తంటాలు ఉండవని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పేర్కొంది. ఈసారి సగటు వర్షపాతంకంటే తక్కువ నమోదైనా పెద్ద ఇబ్బంది ఉండదని తెలిపింది. గతంతో పోలిస్తే ఈసారి 40 శాతం అధికంగా నీటి నిల్వలు ముంబైకి సరఫరా చేసే జలాశయాల్లో ఇప్పటికే ఉన్నట్టు తెలిపింది. దీంతో రాబోయే రోజుల్లో నీటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. కాగా, 2009లో వర్షాలు తక్కువపడడంతో సంవత్సరం పొడవున నీటి కోసం ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈసారి 94 శాతం వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతవరణ శాఖ పేర్కొంటోంది. దీంతో ఈ సంవత్సరం నీటి గురించి చింతించాల్సిన అవసరం లేదని కార్పొరేషన్ తెలిపింది. నగరానికి సరఫరా అయ్యే నీటిలో 50 శాతం నీటి సరఫరా అప్పర్ వైతర్ణా జలాశయం నుంచి అవుతోంది. ప్రస్తుతం అప్పర్ వైతర్ణా జలాశయంలో 99 రోజులకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి. భాత్సాలో 77 రోజులకు సరిపడా నీటి నిల్వలున్నట్టు బీఎంసీ పేర్కొంది. ఈ నీటి నిల్వలు గత సంవత్సరంతో పోలిస్తే 40 శాతం అధికంగా ఉందని పేర్కొంది. దీంతో వాతావరణ శాఖ పేర్కొన్న 94 శాతం కంటే తక్కువగా వర్షపాతం నమోదైన ముంబైవాసులకు నీటి కోసం ఇబ్బందులు రావని నీటి సరఫరా విభాగం ధీమా వ్యక్తం చేస్తోంది.