బిల్డర్ల నగరం ముంబై | Mahesh Vijapurkar writes on Mumbai municipal corporation | Sakshi
Sakshi News home page

బిల్డర్ల నగరం ముంబై

Published Tue, Mar 21 2017 12:55 AM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM

బిల్డర్ల నగరం ముంబై

బిల్డర్ల నగరం ముంబై

విశ్లేషణ
ముంబై నగర నిధులు భారీగా బ్యాంకుల్లో మూలుగుతున్నా అది అప్పులు చేస్తుంది, వడ్డీలు కడుతుంది. వాటిని సముచితంగా వినియోగిస్తే పౌరులకు సత్వరమే అవసరమైన సదుపాయాలను అందించగలరు. కానీ ఆ పని చేయరు.

ముంబై మునిసిపల్‌ కార్పొ రేషన్‌పై నియంత్రణ కోసం రాజకీయ పార్టీలన్నీ తహ తహలాడుతాయి. అందుకు కారణం సుసంపన్నమైన ఆ నగర పాలక సంస్థ ఖజానా చేతికి అందుతుందనే ఆశే అనే భావన ఉంది. అది తప్పుడు అభిప్రాయమేం కాదు. ఆ నగర భారీ బడ్జెట్‌ రూ. 37,000 కోట్లు. అయి నాగానీ, అందులోంచి దొంగిలించగలిగినది మాత్రం తక్కువే. అదెలాగంటారా.. మొత్తం బడ్జెట్లో అత్యధిక భాగం వేతనాలకు, రుణ చెల్లింపులకు, పురపాలక సంస్థ నిర్వహణకే పోతుంది. అది 70 శాతం నుంచి 80 శాతం వరకు ఉంటుంది. ఇక మిగిలే భాగం నుంచే పౌరులకు అన్నిటినీ సమకూర్చాలి. ఆ పనిని అది అరకొరగానో లేక అంటీ ముట్టనట్టుగానో చేస్తుంది.

2015–16 వరకు గడచిన దశాబ్దకాలంలో ముంబై పుర పాలక సంస్థ సగటున ఏడాదికి 19.33 శాతం మౌలిక సదుపాయాల కల్పన, వాటి నిర్వహణల కోసం ఖర్చు చేసింది. జనాభా, అవసరాలు తప్ప మిగతా అన్నీ కొరతగానే ఉండే ఈ నగరానికి అది శోచనీయ మైనంత తక్కువ మొత్తం. అయినాగానీ, ప్రజలను మెప్పించడానికి భారీ కేటాయింపులను మాత్రం చేస్తుం టారు. చేసే ఖర్చు మాత్రం ఆ దరిదాపులలో ఎక్కడా ఉండదు. అంటే, అంకెల రీత్యా చూస్తే, కొల్లగొట్టడానికి మిగిలేది చాలా చిన్న మొత్తమే, అది ఎందుకూ చాలేది కాదు. కాకపోతే బొత్తిగా నాణ్యతలేని రోడ్లను నిర్మించే వారు, ఏటా వాటికి మరమ్మతులు చేయాల్సిన వారు అయిన కాంట్రాక్టర్ల నుంచి నేతలకు, అధికారులకు ముడుపులు అందుతాయి. అయితే, నియమ నిబంధన లను విరుద్ధంగా భవన నిర్మాణాలను అనుమతించడం ద్వారా, అలాంటి ఇతర కట్టడాలకు నిర్మాణ అనుమతు లను జారీ చేయడం, మొదలైనవాటి ద్వారానే వారికి  అధికంగా డబ్బు రాలుతుంది. అందు వల్లనే ముంబైకి ‘‘ప్రజల నగరం’’గా గాక, ‘‘బిల్డర్ల నగరం’’గా పేరు.

ఇలా అధికారంలో ఉన్న అన్ని స్థాయిల వారికి అక్రమ పద్ధతుల్లో డబ్బు అందడాన్ని ఎంత ఉదారంగా చూసినా, మాఫియా అనడం తప్పు కాదు. ఇక్కడ అక్రమ ధనం చేతులు మారేది నగర పాలక సంస్థ నిధుల నుంచి కాదు, మరెవరో ఇచ్చేది. కాబట్టి ఈ అక్ర మాలను మాఫియా అనడం సమంజసమే. అయితే, ఇది రియల్‌ ఎస్టేట్‌ వ్యయాలను పెంచి, ఫ్లాట్‌ ధరను పెంచుతుందనే వాస్తవం మాత్రం మిగులుతుంది. ముంబైవాసులకు అవి దాదాపుగా అందుబా టులో ఉండవు. ఎవరు అధికారంలో ఉన్నా చిన్న వీధుల్లో బహుళ అంతస్తుల టవర్ల నిర్మాణాన్ని అనుమతిస్తారు. మౌలిక సదుపాయాలు మాత్రం అలాగే ఉంటాయి.

ఇక్కడ కాకపోతే అక్కడ, ఎక్కడో ఒక చోట పౌరులు ఎవరి ధన పిపాసకో మూల్యాన్ని చెల్లించక తప్పదు. కాకపోతే ఈ రంగంలో ధన పిపాస మరీ అసాధారణమైన భారీ స్థాయిలో ఉంటుంది. ఫలానా ఫలానా జేబుల్లోకి ఇంతింత అంటూ పుచ్చుకోడానికి బదులుగా అక్రమార్జనాపరులు బిల్డర్లతో భాగస్వామ్యా ల్లోకి ప్రవేశిస్తున్నారు. నిర్మాణ నిబంధనలు అనుమ తించే దానికంటే కొన్ని అంతస్తులను అధికంగా నిర్మించి, సదరు అధికారినో లేక రాజకీయవేత్తనో బిల్డర్లు భాగస్వామిగా చేసుకుంటున్నారు. అంతేతప్ప బేరసారాలు ఉండవు. అయితే ఇక్కడో చిక్కుముడీ ఉంది. కాంట్రాక్టర్లకు నిధుల మంజూరు నుంచి, చెత్త తరలింపు, రోడ్ల నిర్మాణం వగైరా ప్రతి చోటా జిత్తుల మారితనం ప్రయోగించినా ఇష్టానుసారం ఖర్చు చేయ డానికి లభించేవి చిన్న మొత్తాలే. అయినాగానీ ఆ నగరానికి భారీ చరాస్తులు ఉండటమే విడ్డూరం. అవి వాణిజ్య బ్యాంకుల్లో ఉన్న ఫిక్సెడ్‌ డిపాజిట్లు. డిపాజిట్‌ చేసే మొత్తాలు భారీవి కాబట్టి బ్యాంకర్లు వడ్డీరేట్లపై బేరసారాలు సాగిస్తారు. తాజా సమాచారం ప్రకారం నగర పాలక సంస్థకు రూ. 61,510 కోట్ల ఫిక్సెడ్‌ డిపా జిట్లు ఉన్నాయి. వీటిని సముచితమైన రీతిలో మదుపు చేస్తే నగర అవసరాలను సత్వరంగా తీర్చడానికి సరి పోయేవే. ఈ డిపాజిట్లలో ప్రావిడెంట్‌ ఫండ్, మిగులు ని«ధులు ఒక భాగం. అయినా మిగతా మొత్తం నమ్మ శక్యం కానంతటి పెద్దది. నగర ప్రభుత్వం అంత పెద్ద భారీ నిధులను నిరు పయోగంగా ఉంచడమేమిటనేది మాత్రం బహిరంగ చర్చకు నోచుకోలేదు.

ఈ ఆస్తులపై ఏడాదికి 7 శాతం లేదా అంతకంటే ఎక్కువ రాబడి వచ్చినా, అది పెద్ద మొత్తంలో నగదు ప్రవాహాన్ని అందుబాటులోకి తెస్తుంది. అయినా నగర ప్రభుత్వం అప్పులకు వడ్డీలు కడుతుంది. నగదు మిగులు అందుబాటులో ఉన్నా అప్పులు చేయాల్సిన అవసరం ఏమిటో వివరించరు. చూడబోతే ముంబై నగరం బ్యాంకుల ద్రవ్యత్వాన్ని కాపాడటం కోసం నిర్మించాల్సిన పౌర సదుపాయాలను లేదా పౌర సేవలను మెరుగుపరచడాన్ని పరిత్యజించిందని అనిపి స్తుంది. నగర ప్రభుత్వానికి చెందిన ఇంతటి భారీ మొత్తాలు బ్యాంకులకు ఎలా చేరాయనే విషయమై ప్రజ లకు జవాబుదారీ వహించేవారు లేరు. దాన్ని పట్టించు కునే వారు ఎవరూ లేరు. బడ్జెట్లో కేటాయించిన డబ్బును ఖర్చు చేయకపోవడం వల్లనే ఆ నిధులు బ్యాంకుల్లో మూలుగుతున్నాయనేది స్పష్టమే. కేటా యించిన నిధులను ఖర్చు చేయలేకపోవడం ఏటా జరిగేదే. ప్రణాళికాబద్ధంగా కార్యకలాపాలను సాగిం చడం మునిసిపల్‌ కార్పొరేషన్‌ నిర్వహణాపరమైన శక్తిసామర్థ్యాలకు మించిన పని అనే దీనర్థం.


- మహేష్‌ విజాపృకర్‌

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
ఈ–మెయిల్‌ : mvijapurkar@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement