కృష్ణవేణి రెడ్డికి ‘సాక్షి’ అభినందనలు | Krishnaveni Reddy won in Mumbai Municipal Corporation | Sakshi
Sakshi News home page

కృష్ణవేణి రెడ్డికి ‘సాక్షి’ అభినందనలు

Published Fri, Mar 3 2017 12:37 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

కృష్ణవేణి రెడ్డికి ‘సాక్షి’ అభినందనలు - Sakshi

కృష్ణవేణి రెడ్డికి ‘సాక్షి’ అభినందనలు

సాక్షి, ముంబై: ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విజయం సాధించి తెలుగు వారి కీర్తి పతాకాన్ని ఎగురవేసిన కందిగ కృష్ణవేణిరెడ్డిని సాక్షి ఫైనాన్స్‌ అండ్‌ అడ్మిన్‌ డైరెక్టర్‌ వైఈపీ రెడ్డి అభినందించారు. గత వారం జరిగిన బీఎంసీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాకు చెందిన కృష్ణవేణి రెడ్డి వార్డు నంబర్‌ 174  నుంచి గెలుపొందిన సంగతి తెలిసిందే. సాక్షి ముంబై కార్యాలయంలో రెండేళ్ల కిందటి వరకు కృష్ణవేణి ఆపరేటర్‌గా విధులు నిర్వహించారు. కార్పొరేటర్‌గా గెలుపొందిన అనంతరం ‘సాక్షి’ టీమ్‌కు కృతజ్ఞత తెలిపేందుకు ఆమె గురువారం ముంబై దాదర్‌లోని సాక్షి కార్యాలయానికి వచ్చారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌ నుంచి ఓ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన వైఈపీ రెడ్డితోపాటు సాక్షి ముంబై యూనిట్‌ ఆమెకు పుష్పగుచ్చం అందించి అభినందిం చారు. ఆమె రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాలని ఆశీర్వదించారు. ఒక సాధారణ గృహిణి అయిన కృష్ణవేణి రెడ్డి సాక్షి ఆపరేటర్‌ నుంచి కార్పొరేటర్‌గా ఎదగడం తెలుగు వారు గర్వించదగ్గ విషయమని వైఈపీ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కృష్ణవేణి రెడ్డి కూడా సాక్షిలో ఆపరేటర్‌గా విధులు నిర్వహించిన సమయంలోని అనుభూతులను నెమరవేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement