ముంబై: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి చట్ట సవరణ ఎందుకు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ముంబై హైకోర్టు ప్రశ్నించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో బాధితులకు పరిహారం పెంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సమర్ధించిన హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జస్టిస్ అభయ్ ఓకా మరియ జస్టిస్ ఏఎఎస్ చందుర్ కార్ లతో కూడిన ముంబై హైకోర్టు నాలుగు వారాల్లో ప్రభుత్వం వివరణతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
2002 లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హిట్ రన్ కేసులో బాధితులకు పరిహారం కోరుతూ జర్నలిస్టు నిఖిల్ వాగ్లే ప్రజాప్రయోజన వాజ్యం(పిల్) దాఖలు చేశారు.