
దబోల్కర్ హత్య కేసులో తొలి అరెస్టు
ముంబై: హేతువాది నరేంద్ర దబోల్కర్ హత్య కేసులో సీబీఐ తొలి అరెస్టు చేసింది. హిందూ జనజాగృతి సమితి సభ్యుడు వీరేంద్రసింగ్ తావ్‌డేను శుక్రవార ముంబై సమీపంలోని పన్వెల్‌లో అదుపులోకి తీసుకుంది. శనివారం మధ్యాహ్నం పుణేలోని ప్రత్యేక కోర్టులో హాజరుపర్చామని సీబీఐ ప్రతినిధి దేవ్‌ప్రీత్ సింగ్ తెలిపారు.
ఆగస్టు 20, 2013న పుణేలో పట్టపగలు దబోల్కర్‌ను దారుణంగా హత్య చేశారు. మే, 2014లో ఈ కేసును ముంబై హైకోర్టు సీబీఐకి అప్పగించింది. గోవాకు చెందిన ‘సనాతన్ సంస్థ’తో జనజాగృతి సమితికి సంబంధాలున్నాయని విచారణలో తేలింది.