ముంబై: లైంగిక ఆరోపణలు నేపథ్యంలో నటి రిచా చద్ధాపై వివాస్పద వ్యాఖ్యలు చేసినందుకు నటి పాయల్ ఘోష్ బహిరంగంగా క్షమాపణలు కోరారు. ముంబై హైకోర్టు పాయల్ క్షమాపణ అంగీకరించి ఇకపై రిచాకు వ్యతిరేకంగా ఏ వ్యక్తి కూడా నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వును జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉత్తర్వులు ఏబీఎన్‌కు, వివాదాస్పద నటుడు కమల్ రషిద్ ఖాన్ అలియాస్ కేఆర్‌కేను ఉద్దేశిస్తూ జారీ చేసింది. అంతేగాక దీనిపై ఏబీఎన్, కమల్ రషీద్‌లు వివరణ ఇవ్వాలని నాలుగు వారాల గుడువు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం కమల్ తరపు న్యాయవాది బుధవారం స్పందించారు. ‘రిచాపై పరువు నష్టం కలిగించేలా బహిరంగంగా ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయరని స్పష్టం చేశారు. త్వరలోనే ఆయన దీనిపై బహిరంగ ప్రకటన కూడా చేయనున్నట్లు వెల్లండించారు. (చదవండి: రిచాను క్షమాపణలు కోరిన పాయల్)
దర్శకుడు అనురాగ్ కశ్యప్ లైంగికంగా ఇబ్బందులకు గురి చేశాడంటూ నటి పాయల్ ఘోష్ గత నెలలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఆరోపణల నేపథ్యంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రిచా చద్ధాతో పాటు మరో ఇద్దరూ నటీనటులపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. దీంతో చద్ధా, పాయల్‌పై పరువు నష్టం దావా వేస్తూ నోటీసుల జారీ చేశారు. దీంతో గత వారం పాయల్ ముంబై కోర్టులో బహిరంగంగా తను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని, బేషరతుగా రిచాను క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు. పాయల్ క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసిందంటూ చద్ధా బుధవారం ట్వీట్ చేశారు. (చదవండి: నా పేరెందుకు వాడారు?: నటి)
Comments
Please login to add a commentAdd a comment