ముంబై: రాష్ట్రంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికీ బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌కు వర్తింపజేసిన నిబంధనలనే అమలు చేశారా అని ముంబై హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 1993 ముంబై పేలుళ్ల కేసు నిందితుడు, ప్రముఖ నటుడు సంజయ్ దత్‌కు పలుమార్లు పెరోల్ ఇచ్చి బయటకు పంపటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన ప్రజోపయోగ పిటిషన్‌పై శుక్రవారం ముంబై హైకోర్టు విచారణ చేపట్టింది. దత్‌కు ఇచ్చిన ప్రతి పెరోల్ విషయంలోనూ ప్రభుత్వం న్యాయబద్ధంగా వ్యవహరించిందని అడ్వొకేట్ జనరల్ తెలపగా.. ప్రత్యేక కారణాలుంటేనే పెరోల్ మంజూరవుతుందని, కానీ, కొందరు దానిని హక్కుగా భావిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment