Sanjay Dutt parole
-
అందరినీ అలాగే చూశారా?
ముంబై: రాష్ట్రంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికీ బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌కు వర్తింపజేసిన నిబంధనలనే అమలు చేశారా అని ముంబై హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 1993 ముంబై పేలుళ్ల కేసు నిందితుడు, ప్రముఖ నటుడు సంజయ్ దత్‌కు పలుమార్లు పెరోల్ ఇచ్చి బయటకు పంపటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన ప్రజోపయోగ పిటిషన్‌పై శుక్రవారం ముంబై హైకోర్టు విచారణ చేపట్టింది. దత్‌కు ఇచ్చిన ప్రతి పెరోల్ విషయంలోనూ ప్రభుత్వం న్యాయబద్ధంగా వ్యవహరించిందని అడ్వొకేట్ జనరల్ తెలపగా.. ప్రత్యేక కారణాలుంటేనే పెరోల్ మంజూరవుతుందని, కానీ, కొందరు దానిని హక్కుగా భావిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. -
సంజయ్‌దత్ పెరోల్ మరో నెల పొడిగింపు
పుణే : ముంబై వరుస పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న సినీ నటుడు సంజ య్‌దత్ పెరోల్‌ను జిల్లా అధికారులు మరో నెల రోజులు పొడిగించారు. తన భార్య మాన్యత అనారోగ్యం కారణంగా తన పెరోల్‌ను మరో నెల రోజులు పొడిగించాలన్న దత్ విజ్ఞప్తిని అధికారులు అంగీకరించారు. అక్రమ ఆయుధాలు కలిగియున్నాడన్న నేరంపై శిక్ష అనుభవిస్తున్న దత్ ఈ నెల 21న యెరవాడ జైలుకు తిరిగి రావాల్సి ఉంది. అయితే ఆయన పెరోల్‌ను మార్చి 21వ తేదీ వరకు డివిజినల్ కమిషనర్ కార్యాలయం పొడిగించింది. ఐదేళ్ల జైలు శిక్ష పడిన దత్‌కు తన భార్య అనారోగ్యంపై ముంబై పోలీసుల నుంచి అందిన నివేదిక మేరకు పెరోల్ మంజూరు చేశారు. నిబంధనల ప్రకారం ఈ ఏడాది సంజ య్దత్కు ఇది చివరి పెరోల్ సెలవు అని అధికారులు తెలిపారు. గత డిసెంబర్ 6న మొదటిసారి సంజయ్‌దత్‌కు పెరోల్ మంజూరైనప్పుడు భారీ ఎత్తున నిరసనలు ఎదురు కావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆ తరువాత మహారాష్ట్ర ప్రభుత్వం జనవరిలో దత్ పెరోల్‌ను మరోనెల పొడిగించింది. ఐదేళ్ల జైలు శిక్షలో ఇప్పటికే దత్ 18 నెలలు జైలు ఉన్నాడు. మిగిలిన 42 నెలలు అతడు శిక్షను అనుభవించాల్సి ఉంది.