పుణే : ముంబై వరుస పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న సినీ నటుడు సంజ య్‌దత్ పెరోల్‌ను జిల్లా అధికారులు మరో నెల రోజులు పొడిగించారు. తన భార్య మాన్యత అనారోగ్యం కారణంగా తన పెరోల్‌ను మరో నెల రోజులు పొడిగించాలన్న దత్ విజ్ఞప్తిని అధికారులు అంగీకరించారు. అక్రమ ఆయుధాలు కలిగియున్నాడన్న నేరంపై శిక్ష అనుభవిస్తున్న దత్ ఈ నెల 21న యెరవాడ జైలుకు తిరిగి రావాల్సి ఉంది. అయితే ఆయన పెరోల్‌ను మార్చి 21వ తేదీ వరకు డివిజినల్ కమిషనర్ కార్యాలయం పొడిగించింది.
ఐదేళ్ల జైలు శిక్ష పడిన దత్‌కు తన భార్య అనారోగ్యంపై ముంబై పోలీసుల నుంచి అందిన నివేదిక మేరకు పెరోల్ మంజూరు చేశారు. నిబంధనల ప్రకారం ఈ ఏడాది సంజ య్‌దత్‌కు ఇది చివరి పెరోల్ సెలవు అని అధికారులు తెలిపారు. గత డిసెంబర్ 6న మొదటిసారి సంజయ్‌దత్‌కు పెరోల్ మంజూరైనప్పుడు భారీ ఎత్తున నిరసనలు ఎదురు కావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆ తరువాత మహారాష్ట్ర ప్రభుత్వం జనవరిలో దత్ పెరోల్‌ను మరోనెల పొడిగించింది. ఐదేళ్ల జైలు శిక్షలో ఇప్పటికే దత్ 18 నెలలు జైలు ఉన్నాడు. మిగిలిన 42 నెలలు అతడు శిక్షను అనుభవించాల్సి ఉంది.
సంజయ్‌దత్ పెరోల్ మరో నెల పొడిగింపు
Published Tue, Feb 18 2014 11:09 PM | Last Updated on Mon, Oct 8 2018 6:22 PM
Advertisement
Advertisement