‘మా నిర్ణయం తప్పైతే దత్‌ను జైలుకు పంపండి’
ముంబై: 1993 ముంబై పేలుళ్ల కేసులో దోషి, బాలీవుడ్‌నటుడు సంజయ్‌దత్ శిక్షాకాలం తగ్గిస్తూ తాము తీసుకున్న నిర్ణయం సరైనది కాదని కోర్టు భావిస్తే..వెంటనే అయన్ను జైలుకు పంపాలని మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టును కోరింది. జైలుకు వచ్చిన రెండు నెలల్లోనే దత్‌ను పెరోల్‌పై విడుదల చేయడంపై జరుగుతున్న విచారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది. అంతకుముందు ఏయే అంశాల ప్రాతిపదికన దత్ శిక్షా కాలాన్ని తగ్గించి ముందస్తుగా విడుదల చేశారో తెలపాల్సిందిగా జస్టిస్ ఆర్.ఎం.సావంత్, జస్టిస్ సాధనా జాధవ్‌ల ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2013 జూలై 8న జైలుశిక్ష తగ్గింపు కోసం, జూలై 25న పెరోల్ కోసం దత్ చేసుకున్న దరఖాస్తును అధికారులు వెనువెంటనే ఆమోదించడాన్ని కోర్టు ప్రశ్నించింది. ఈ విషయమై జస్టిస్ సావంత్ మాట్లాడుతూ..‘తన కుమార్తె, భార్య అనారోగ్యం పాలైనప్పుడు దత్‌కు రెండుసార్లు పెరోల్ మంజూరయింది. కానీ కన్నతల్లి చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు కూడా చాలామంది ఖైదీలకు పెరోల్ మంజూరు కావడం లేద’న్నారు. ఖైదీలకు పెరోల్‌తో పాటు జైలుశిక్ష తగ్గింపు విషయమై నిర్దిష్టమైన విధివిధానాలు ఉండాలన్నారు. ఈ విషయమై రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. దత్ విషయంలో జైలు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ప్రదీప్ భాలేకర్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.