ముంబై : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తిరిగి రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు. సెప్టెంబర్ 25న సంజయ్ దత్ రాష్ర్టీయ సమాజ్ పక్ష్ (ఆర్‌ఎస్‌పీ)లో చేరతారని ఆ పార్టీ వ్యవస్ధాపకులు, మహారాష్ట్ట్ట మంత్రి మహదేవ్ జంకర్ వెల్లడించారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వంలో ఆర్‌ఎస్‌పీ భాగస్వామ్య పక్షంగా వ్యవహరిస్తోంది. తమ పార్టీని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సినీ పరిశ్రమ ప్రముఖులను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశామని ఆయన వెల్లడించారు.కాగా 2009లో లక్నో లోక్‌సభ స్ధానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సంజయ్ దత్ ఆయుధ కేసులో దోషిగా తేలడంతో తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఎస్పీ ప్రధాన కార్యదర్శిగానూ కొంతకాలం పనిచేసిన సంజయ్ దత్ అనంతరం ఆ పదవి నుంచి వైదొలగడంతో పాటు పార్టీకీ రాజీనామా చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ పోటీ చేస్తారని వార్తలరాగా అవన్నీ వదంతులేనని సంజయ్ దత్ తోసిపుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment