Mumbai blasts case
-
దావూద్ కుటుంబీకుల ఆస్తులకు రూ.2 కోట్లకు పైగా ధర
ముంబై: 1993 ముంబై పేలుళ్ల కేసు సూత్రధారి, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కుటుంబసభ్యులకు చెందిన రెండు స్థిరాస్తులు వేలంలో రూ.2 కోట్లకు పైగా ధర పలికినట్లు అధికారులు తెలిపారు. స్మగ్లర్లు, ఫారిన్ ఎక్సే్ఛంజి మానిప్యులేటర్స్ చట్టం కింద శుక్రవారం ముంబైలోని ఆయకార్ భవనంలో వేలం చేపట్టామన్నారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఖేడ్ తహశీల్ ముంబాకే గ్రామంలోని నాలుగు చోట్ల ఉన్న భూములను వేలానికి ఉంచినట్లు చెప్పారు. వీటిలో సుమారు 171 చదరపు మీటర్ల భూమి ధర వేలంలో అత్యధికంగా రూ.2.01 కోట్లు, మరో 1,730 చదరపు మీటర్ల స్థలం రూ.3.28 కోట్లు పలికిందని చెప్పారు. ఈ రెండింటిని ఢిల్లీకి చెందిన లాయర్ కొనుగోలు చేశారని వివరించారు. మిగతా రెండు ప్లాట్లకు ఎవరూ టెండర్లు వేయలేదని వివరించారు. -
యాకూబ్ మెమన్ సమాధి వివాదం... విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర సీఎం
ముంబై: ముంబైలోని బడా కబ్రస్తాన్‌లో 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ సమాధికి సంబంధించిన అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఒక నిందితుడి సమాధిని సుందరీకరించడంపై పెనువివాదం చెలరేగింది. ఈ విషయమై మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ముంబై పోలీసులను విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించడమే కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఈ విషయంపై సత్వరమే విచారణ చేసి నివేదికను కూడా సమర్పించాలని ముంబై పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మాట్లాడుతూ...పాక్ ఆదేశానుసారం ఉగ్రవాది యాకూబ్ మెమన్ 1993లో ముంబైలో పేలుళ్లును అమలు చేశాడు. అలాంటి వ్యక్తి సమాధిని ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనే మజార్‌గా మార్చారని ఆరోపణలు చేశారు. ఇదేనా ఆయనకు ముంబైపై ఉన్న ప్రేమ, దేశభక్తి అని ప్రశ్నించారు. దీనికి థాక్రే క్షమాపణలు చెప్పలంటూ డిమాండ్ చేశారు. అలాగే నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా క్షమాపణ చెప్పాలని కోరారు. వాస్తవానికి మార్చి12, 1993లో ముంబై వరుస బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. సుమారు 257 మంది మరణించగా దాదాపు 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో సుమారు రూ. 27 కోట్ల విలువైన ఆస్తి ధ్వంసమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి అప్పగించింది. ఈ కేసులో యాకుబ్ మెమన్‌కి ఉరిశిక్ష పడింది కూడా. (చదవండి: అమిత్ షాపై ట్రోల్స్... 'ఇండియా బిగ్గెస్ట్ పప్పు' అంటూ...) -
షాక్ : దావూద్ అనుచరుడికి వీవీఐపీ ట్రీట్మెంట్!
సాక్షి, ముంబై : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఫరూక్ కు వీఐపీ ట్రీట్మెంట్ అందిన విషయం కలకలం రేపుతోంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో అతనికి పలువురు ప్రతినిధులు, అధికారులు సహకరించారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఫరూక్ పాస్‌పోర్ట్ రెన్యువల్ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. 2011 ఫిబ్రవరి 7న ఫరూక్ తక్లా తన పాస్ పోర్ట్ రెన్యువల్‌కు దరఖాస్తున్నాడు. అయితే కేవలం 24 గంటల్లోనే దానిని అధికారులు పూర్తి చేశారంట. పైగా ఇందుకోసం ఓ కాంగ్రెస్ పార్టీ కీలక నేత ముంబై పాస్‌పోర్టు అధికారులపై ఒత్తిడి తెచ్చాడని ఆ కథనం సారాంశం. ఆ సమయంలో విదేశాంగ మంత్రిగా ఉన్న ఎస్ఎం కృష్ణను, పి చిదంబరాన్ని ఈ వ్యవహారంపై బీజేపీ వివరణ కోరిందట. అయితే యూపీఏ మాత్రం అందుకు విముఖత వ్యక్తం చేసినట్లు ఆ కథనం పేర్కొంది. కాగా, ముంబై పేలుళ్ల నిందితుడు అయిన యాసిన్ మన్సూర్ మహ్మద్ ఫరూక్ అలియాస్ ఫరూఖ్ తక్లాను సీబీఐ అధికారులు దుబాయ్‌లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు. 1993లో పేలుళ్ల తర్వాత దుబాయ్ పారిపోయిన ఫరూఖ్.. డీగ్యాంగ్‌లో క్రియాశీలక ఏజెంట్‌గా ఎదిగాడు. తీవ్రవాదం, అక్రమ మారణాయుధాల సరఫరా, నేరపూరిత కుట్రలు.. పలు అంశాలపై భారత్‌లో అతనిపై కేసులు నమోదయ్యాయి. 1995 లోనే ఇంటర్‌పోల్ అధికారులు ఫరూఖ్ తక్లాపై రెడ్ కార్నర్ నోటీస్ జారీచేశారు. -
అందరినీ అలాగే చూశారా?
ముంబై: రాష్ట్రంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికీ బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌కు వర్తింపజేసిన నిబంధనలనే అమలు చేశారా అని ముంబై హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 1993 ముంబై పేలుళ్ల కేసు నిందితుడు, ప్రముఖ నటుడు సంజయ్ దత్‌కు పలుమార్లు పెరోల్ ఇచ్చి బయటకు పంపటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన ప్రజోపయోగ పిటిషన్‌పై శుక్రవారం ముంబై హైకోర్టు విచారణ చేపట్టింది. దత్‌కు ఇచ్చిన ప్రతి పెరోల్ విషయంలోనూ ప్రభుత్వం న్యాయబద్ధంగా వ్యవహరించిందని అడ్వొకేట్ జనరల్ తెలపగా.. ప్రత్యేక కారణాలుంటేనే పెరోల్ మంజూరవుతుందని, కానీ, కొందరు దానిని హక్కుగా భావిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. -
ముంబై పేలుళ్ల కేసు: దోషులకు శిక్షలు ఖరారు
సాక్షి,న్యూఢిల్లీ: ముంబై అల్లర్ల కేసులో దోషులకు టాడా ప్రత్యేక కోర్టు గురువారం శిక్షలు ఖరారు చేసింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న అబూ సలేంకు జీవిత ఖైదు విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. సలేంతోపాటు మరో నలుగురికి కూడా కోర్టు శిక్షలు ఖరారు చేసేసింది. అండర్ వరల్డ్ డాన్, గ్యాంగ్ స్టర్ అయిన సలేంను పోర్చుగల్ నుంచి భారత్ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అక్కడి చట్టాల్లో మరణశిక్ష లేకపోవటంతో ఒప్పందం ప్రకారం ఇక్కడ కూడా సలేంకు అలాంటి శిక్ష విధించే అవకాశం లేకుండా పోయింది. మరో ఇద్దరు దోషులు తెహీర్ మర్చంట్, ఫెరోజ్ ఖాన్ లకు తీవ్ర ఆరోపణల దృష్ట్యా మరణ శిక్షలను ఖరారు చేసేసింది. కరీముల్లా ఖాన్ కు యావజ్జీవ శిక్ష, రియాజ్ సిద్ధిఖీకి 10 ఏళ్ల శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. కేసు ప్రధాన సూత్ర ధారి ముస్తఫా దోసాతోపాటు మరో ఆరుగురిని దోషిగా తేలుస్తూ కోర్టు ఈ యేడాది జూన్ 16న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వంపై యుద్ధం, కుట్రపూరిత నేరం తదితర ఆరోపణలు వీరిపై రుజువయ్యాయి. కానీ, ముస్తఫా గుండెపోటుతో జైల్లోనే మృతి చెందాడు. నిందితులో చాలా మట్టుకు మరణ శిక్ష ఖాయమని కేసు వాదిస్తున్న న్యాయవాది దీపక్ సాల్వీ తీర్పు వెలువడటానికి ముందు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తనపై ఉన్న మిగతా కేసుల దృష్ట్యా తనని ఢిల్లీ జైలుకు తరలించాలని సలేం టాడా కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. దోషులు ఎవరేం చేశారంటే... ముస్తఫా దోసా: భారత్‌కు ఆర్డీఎక్స్ను తీసుకురావటంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. దీంతోపాటుగా కొందరు యువకులను పాకిస్తాన్‌కు పంపి ఆయుధాల వినియోగంలో శిక్షణనిప్పించాడు. అబూ సలేం: ఆయుధాలను గుజరాత్‌నుంచి ముంబైకి తరలించాడు. ఈ కేసులో దోషిగా శిక్ష పూర్తిచేసుకున్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు కూడా 1993 జనవరి 16న సలేం ఏకే 56 ఆయుధాలతోపాటు 250 రౌండ్ల బుల్లెట్లు, కొన్ని గ్రనేడ్లను అందించాడు. తిరిగి జనవరి 18న సంజయ్‌దత్ ఇంటికొచ్చి వీటిని అబూసలేం తీసుకెళ్లాడు. తాహిర్ మర్చంట్: పాకిస్తాన్‌కు ఉగ్ర శిక్షణకు వెళ్లాల్సిన యువకులను గుర్తించి వారిని రెచ్చగొట్టాడు. భారత్‌లో అక్రమంగా ఆయుధ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు నిధులను సేకరించాడు. ఫిరోజ్ అబ్దుల్ ఖాన్: ఆయుధాలను తీసుకోవటంలో కస్టమ్స్ అధికారులు, ఏజెంట్లతో మాట్లాడి.. వాటిని జాగ్రత్తగా అనుకున్న లక్ష్యాలకు చేర్చాడు. దీంతోపాటుగా వ్యూహాల్లో భాగస్వామిగా ఉన్నాడు. గతేడాది మే చివర్లో విచారణ సందర్భంగా అప్రూవర్‌గా మారేందుకు సిద్ధమయ్యాడు. రియాజ్ సిద్దిఖీ: అబూసలేం ఆయుధాలు తరలించేందుకు వాహనాన్ని సమకూర్చటంతోపాటుగా పలు సందర్భాల్లో దోషులకు సహాయంగా వెళ్లాడు. కరీముల్లా ఖాన్: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో దాచిన ఆయుధాలు, డిటోనేటర్లు, గ్రనేడ్లను సరైన వ్యక్తులకు చేరవేయటంలో కీలకంగా వ్యవహరించాడు. దుబాయ్ మీదుగా పాకిస్తాన్‌కు వెళ్లి ఆయుధ శిక్షణ పొందాడు. టైమ్‌లైన్: 12 మార్చి, 1993: గంట వ్యవధిలో 13 చోట్ల బాంబులు పేలి 257 మంది మృతి, 713 మందికి గాయాలు. 19 ఏప్రిల్, 1993: ఏకే–56 రైఫిల్‌ను, 9ఎంఎం పిస్టల్‌ను, తుటాలను అక్రమంగా కలిగి ఉన్నాడనే అభియోగంపై సినీనటుడు సంజయ్‌దత్ అరెస్టు. 15 రోజులకే బెయిల్‌పై విడుదల. 4 నవంబరు 1993: ముంబై క్రైంబ్రాంచ్ ప్రాథమిక చార్జిషీట్ దాఖలు. 189 మందిపై అభియోగాలు. 117వ నిందితుడిగా సంజయ్‌దత్. 19 నవంబరు 1993: ఈ కేసు సీబీఐకి అప్పగింత. 10 ఏప్రిల్ 1994: 26 మందిని నిర్దోషులుగా తేల్చిన టాడా కోర్టు. ఏప్రిల్ 1995 – సెప్టెంబరు 2003: టాడా కోర్టులో విచారణ. అప్రూవర్లుగా మారిన నిందితులు మహ్మద్ జమీల్, ఉస్మాన్ జానకనన్. జూన్ 13 2003: అబూసలేం, ముస్తఫా దోసా సహా ఏడుగురు నిందితులను ప్రధాన కేసునుంచి వేరుచేసి.. విచారణ జరపాలని కోర్టు నిర్ణయం. సెప్టెంబరు 12, 2006: టాడా కోర్టు తీర్పు. యాకూబ్ మెమన్‌తో సహా 12 మందికి మరణశిక్ష, మరో 20 మందికి జీవిత ఖైదు 31 జులై, 2007: సంజయ్‌దత్‌కు ఆరేళ్ల జైలుశిక్ష 21 మార్చి 2013: యాకూబ్ మెమన్‌కు మరణశిక్షను ఖరారు చేసిన సుప్రీం. మరో 10 మంది మరణశిక్ష.. యావజ్జీవ కారాగారశిక్షగా మార్పు. 29 జులై, 2015: యాకూబ్ మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. 30 జులై, 2015: నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో యాకూబ్ మెమన్‌కు ఉరి అమలు 25 ఫిబ్రవరి, 2016: సత్ప్రవర్తన కారణంగా 8 నెలల శిక్ష తగ్గి జైలునుంచి సంజయ్‌దత్ విడుదల. 16 జూన్, 2017: అబూసలేంతో సహా మొత్తం ఆరుగురిని దోషులుగా తేల్చిన టాడా కోర్టు. 07, సెప్టెంబర్, 2017: ముస్తాఫా చనిపోవటంతో మిగిలిన దోషులకు శిక్షలు ఖరారు చేసేసింది. -
ముంబై కేసు: నిందితులకు శిక్షలు ఖరారు
-
వచ్చే నెల 25న సంజయ్ దత్ విడుదల
-
వచ్చే నెల 25న సంజయ్ దత్ విడుదల
ముంబై: 1993నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వచ్చే నెల 25న విడుదల కానున్నారు. మంచి ప్రవర్తన కారణంగా శిక్ష గడువుకంటే 103 రోజులు ముందుగానే ఆయనను విడుదల చేస్తున్నట్లు పుణేలోని యరవాడ జైలు అధికారి ఒకరు చెప్పారు. -
ఐదుగురికి మరణశిక్ష, ఏడుగురికి యావజ్జీవం
-
ఉరితో యాకూబ్ హోరాహోరీ
ఉరితాడుతో ముంబై బాంబు పేలుళ్ల నేరస్తుడు యాకూబ్ మెమన్ సాగించిన హోరాహోరీ పోరాటం ముగిసింది. 23 ఏళ్లుగా నాగపూర్ జైల్లో... ప్రత్యేకించి ఎనిమిదేళ్లుగా ఉరితాడు నీడలో ఉంటున్న యాకూబ్‌కు గురువారం ఉదయం మరణశిక్ష అమలు చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బుధవారం చకచకా సంభవించిన పరిణామాలన్నీ యాకూబ్కున్న దారుల్ని మూసేశాయి. క్యూరేటివ్ పిటిషన్‌పై విచారణ ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్నాయంటున్న కొన్ని సాంకేతిక లోపాలపైనా, అన్ని అవకాశాలూ ముగియక మునుపే మహారాష్ట్ర ప్రభుత్వం ‘డెత్ వారంట్’ జారీచేయడంపైనా వచ్చిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చగా... అంతకు కొన్ని గంటలముందు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు అతని క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారు. ఇక యాకూబ్ తరఫున భిన్న రంగాలకు చెందిన ప్రజాస్వామికవాదులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందు దాఖలు చేసి ఉన్న క్షమాభిక్ష పిటిషన్ ఒక్కటే మిగిలింది. దాన్ని తోసిపుచ్చాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రణబ్‌కు సలహా ఇచ్చారు. ఆ సలహాకు భిన్నంగా ఆయన వ్యవహరించకపోవడానికే ఆస్కారం ఉంది. మరోపక్క యాకూబ్ న్యాయవాదులు అర్ధరాత్రి రెండోసారి సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టారు. మార్చి 1993లో జరిగిన ముంబై బాంబు పేలుళ్ల వ్యవహారంలో యాకూబ్‌కు, మరో 10మందికి టాడా ప్రత్యేక కోర్టు 2007లో మరణశిక్ష విధించింది. వీరిలో యాకూబ్ మినహా మిగిలినవారి ఉరిశిక్షలను సుప్రీంకోర్టు రెండేళ్లక్రితం యావజ్జీవ శిక్షలుగా మార్చింది. ముంబై మహానగరంలో ఒక హిందూ స్నేహితుడితో కలిసి చార్టెర్డ్ అకౌంటెంట్‌గా గౌరవనీయమైన స్థానంలో ఉన్న యాకూబ్ ఉరిశిక్షకు అర్హమైన నేరంలో దోషిగా రుజువుకావడం...53 ఏళ్ల వయసులో తన పుట్టినరోజునే ఉరికంబం ఎక్కాల్సిరావడం ఒక వైచిత్రి. అయోధ్యలో 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత దేశవ్యాప్తంగా అలుముకున్న ఉద్రిక్త పరిస్థితులు, పరిణామాలే దీనంతటికీ కారణం. ఆ ఏడాది డిసెంబర్ నెలాఖరున, 1993 జనవరి మొదటి వారంలో ముంబైలో చోటుచేసుకున్న మతకలహాల్లో 900మంది మరణించారు. వారిలో అత్యధికులు ముస్లింలు. ఇందుకు ప్రతిగా నగరంలో జనసమ్మర్ధంగా ఉండే 12 ప్రాంతాల్లో పేలుళ్లు జరిగి 257మంది మరణించారు. దేశ చరిత్రలో ఆర్డీఎక్స్ను వినియోగించడం అదే ప్రథమం. ఈ పేలుళ్ల వ్యవహారంలో మెమన్ కుటుంబం పాత్ర వెల్లడై వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించేసరికే అందరూ దేశం దాటి వెళ్లిపోయారు. పెద్దవాడైన టైగర్ మెమన్, ఆయన కుటుంబం ఇప్పటికీ పాకిస్థాన్‌లోని కరాచీలోనే తలదాచుకుంటున్నారు. ఇప్పుడు యాకూబ్ మెమన్ కంఠానికి బిగుసుకుంటున్న ఉరిపై సాగిన వివాదం రెండు దశాబ్దాలక్రితం ఇందిరాగాంధీ హత్య కేసులో మాజీ పోలీస్ అధికారి కేహార్సింగ్కు పడిన ఉరిపైనా...పార్లమెంటుపై దాడి కేసులో రెండేళ్లక్రితం అఫ్జల్ గురుకు అమలైన ఉరి విషయంలోనూ అల్లుకున్న చర్చలు గుర్తొస్తాయి. ఆ రెండు సందర్భాల్లోనూ దోషులుగా నిర్ధారణ అయినవారికి అన్యాయం జరిగిందని ప్రజాస్వామికవాదులు భావించారు. ఇప్పుడు యాకూబ్ కేసులోనూ అలాంటి వాదనలే వినిపిస్తున్నాయి. అయితే శిక్షను వ్యతిరేకిస్తున్నవారిలో రెండు రకాల వారున్నారు. పేలుళ్ల పథకరచన యాకూబ్‌కు తెలియదని వాదిస్తున్నవారు కొందరైతే...ఆయన ఖచ్చితంగా నేరస్తుడేనని, అయినా ఉరి సరికాదని అంటున్నవారు మరికొందరు. నేరస్తుడని విశ్వసించినా ఉరి వద్దని చెప్పినవారిలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) మాజీ ఉన్నతాధికారి రామన్ ముఖ్యులు. యాకూబ్ కరాచీనుంచి భారత్ రావడానికి జరిగిన ఆపరేషన్‌లో ఆయన భాగస్వామి. ఉరి శిక్ష పడదని హామీ ఇచ్చాకే ఆయన పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కళ్లుగప్పి వచ్చాడని రామన్ వెల్లడించారు. వస్తూ ఐఎస్ఐ పాత్రను నిర్ధారించే అనేక పత్రాలనూ, సీడీలనూ, తమకు ఆశ్రయమిచ్చిన ఇంటి పరిసరాల వీడియోలనూ తీసుకొచ్చాడు. మారు పేరుతో తనకు పాక్ ప్రభుత్వం జారీచేసిన పాస్‌పోర్టును ఇచ్చాడు. అతని సహకారం లేకపోతే మన దేశంలో పాక్ సాగిస్తున్న దుశ్చర్యల గురించి బయటి ప్రపంచానికి చూపేందుకు సాక్ష్యాలే ఉండకపోయేవని రామన్ చెప్పారు. రాజ్యం తరఫున ఇచ్చిన హామీని గౌరవించకపోతే రేపన్నరోజున ఏ ఉగ్రవాదీ సహకరించడన్నది ఆయన వాదన. కేసు కోర్టు ముందుకు వెళ్లేసరికే రామన్ రిటైరయ్యారు. ఇప్పుడైతే ఆయన జీవించి లేరు. అసలు యాకూబ్‌కు అలాంటి హామీ ఏమీ ఇవ్వలేదని కొందరు అధికారులు చెబుతున్నారు. రామన్ అత్యంత విశ్వసనీయత కలిగిన అధికారి గనుక ఆయన అబద్ధమాడారని భావించలేం. యాకూబ్ తోడ్పడిన తీరుకు సంబంధించిన అంశాలను ఆ కేసుతో వ్యవ హరించిన సీబీఐ అధికారులు టాడా కోర్టు ముందు ఎందుకు ఉంచలేదో, అతనికిచ్చిన హామీ నుంచి ప్రభుత్వం ఎందుకు వెనక్కి వెళ్లిందో ఎవరికీ తెలియదు. ఈ విషయమై సుప్రీంకోర్టు సైతం తన నిస్సహాయత వ్యక్తంచేసింది. అది కార్యనిర్వాహక వ్యవస్థ చేతుల్లోనే ఉంటుందని చెప్పింది. మరణశిక్ష సరికాదన్న వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. సోమవారం కన్నుమూసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సైతం ప్రాణం పోయలేని వ్యక్తికి ప్రాణం తీసే హక్కు ఉండరాదని అభిప్రాయపడ్డారు. 139 దేశాలు తమ శిక్షాస్మృతులనుంచి మరణశిక్షలను తొలగించాయి. అందువల్ల ఆ దేశాల్లో నేరాలేమీ పెరగలేదు. ఈ శిక్ష ఉండొద్దని 2000 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. చట్టంలో ఆ శిక్ష ఉన్నంతవరకూ న్యాయమూర్తుల వ్యక్తిగత అభిప్రాయాలు ఏమైనా కోర్టులు కూడా ఏమీ చేయలేవు. యాకూబ్ విషయంలో చెలరేగిన వాదోపవాదాలు, కలాంవంటివారి అభిప్రాయలు కూడా పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం మరణశిక్ష కొనసాగింపుపై సమీక్ష జరపాల్సిన అవసరం ఉంది. -
ముంబై పేలుళ్ల నిందితుడు లక్వీకి బెయిల్ మంజూరు
పాకిస్తాన్: ముంబైలో నవంబరు 26 పేలుళ్ల నిందితుడు లష్కరే తోయిబా ఉగ్రవాది జకీ ఉర్ రెహ్మాన్ లక్వీకి పాకిస్తాన్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లక్వీకి బెయిల్ మంజూరుపై పాక్ ప్రభుత్వంతో భారత విదేశాంగ శాఖ మాట్లాడుతోంది. పాక్‌లోని భారత రాయభార కార్యాలయంతో భారత విదేశాంగ శాఖ సంప్రదింపులు జరుపుతోంది. భారత్‌పై మరిన్ని దాడులు చేస్తామన్న సయూద్‌ను భారత్‌కు అప్పటించాలని కోరిన రోజునే లక్వీకి బెయిలు మంజూరైంది. ముంబై దాడి కేసులో న్యాయం జరుగుతుందన్న ఆశ సన్నగిల్లిందని భారత విదేశాంగ శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. లక్వీకి బెయిల్ రావడం దురదృష్టకరమని భారత కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. లక్వీకి బెయిల్ ఇవ్వడం దిగ్భ్రాంతి కలిగించిందని బీజేజీ అగ్రనేత అద్వాని అన్నారు. -
ఆస్పత్రిలో కన్నీళ్లు పెట్టుకున్న సంజయ్‌దత్!
ఊహించని విధంగా సమస్యలు ఒకేసారి చుట్టుముడితే చెట్టంత మనిషైనా సరే కుప్పకూలిపోతాడు. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పరిస్థితి అలానే ఉంది. ముంబయ్ బాంబు పేలుళ్ల కేసులో పుణేలోని ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తూ, భార్యాపిల్లలకు దూరంగా ఉండాల్సి వచ్చినందుకు తెగ బాధపడుతున్నారు సంజయ్. ఆ బాధ రెట్టింపయ్యే విధంగా ఆయన భార్య మాన్యత అనారోగ్యం బారిన పడ్డారు. కాలేయంలో ఆమెకు ట్యూమర్ ఉందని డాక్టర్లు నిర్ధారించడంతో పెరోల్‌పై సంజయ్ విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం మాన్యత హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోవడంతో ఆమెను ముంబయ్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. కాలేయంలో చేరిన ఫ్లూయిడ్స్‌ని తీయడం కోసం ఆమెకు అత్యవసర శ్రస్త చికిత్స చేశారట. భార్యను ఈ స్థితిలో చూడలేక సంజయ్‌దత్ కన్నీళ్లు పెట్టుకున్నారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆస్పత్రి సిబ్బంది సంజయ్‌ని ఊరడించడానికి చాలా కష్టపడ్డారట. అంత ఎమోషనల్ అయ్యారని సమాచారం. అక్కడి సిబ్బందితో మాట్లాడుతూ... ఇప్పటికే జీవితంలో చాలా కోల్పోయానని, ఇక కోల్పోవడానికి సిద్ధంగా లేనని చెప్పి బాధపడ్డారట సంజయ్. ఆయన తల్లి నర్గిస్ దత్ కేన్సర్ వ్యాధి సోకి చనిపోయారు. ఆ తర్వాత సంజయ్ మొదటి భార్యరిచా శర్మ కూడా ఇదే వ్యాధికి బలయ్యారు. ఇప్పుడు మాన్యతకు ఆ వ్యాధి అని నిర్ధారణ కాకపోయినా, ‘ట్యూమర్’ ఉందని డాక్టర్లు చెప్పడంతో ఆయన భయపడుతున్నారు. పైగా, దీనికి సంబంధించిన చికిత్సకు ఎక్కువ రోజులు పడుతుండటంతో ఆయన ఎక్కువ టెన్షన్ పడుతున్నారట. అన్ని ట్యూమర్లూ కేన్సర్‌కి సంబంధించినవి కాకపోయినా, ఆల్రెడీ తన తల్లిని, మొదటి భార్యనూ కోల్పోయి ఉండటం వల్ల సంజయ్‌దత్ బాగా భయపడుతున్నారు -
పూణే ధియేటర్ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రదర్శన!
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేందుకు రంగం సిద్ధమవుతోంది. 1993లో ముంబై నగరంలో జరిగిన పేలుళ్ల కేసులో పూణేలోని ఎర్రవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్.. నిధుల సేకరణ కోసం సెప్టెంబర్ 26 తేదిన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొననున్నట్టు జైలు అధికారులు తెలిపారు. జైళ్ల శాఖ సిబ్బంది సంక్షేమానికి చేపట్టిన నిధుల సేకరణ కోసం బల్గంధర ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో సంజయ్ దత్ పాల్గొననున్నాడని జైలు సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయ్ తెలిపారు. రెండుగంటలపాటు జరిగే కార్యక్రమం కోసం ఎంపిక చేసిన ఖైదీల్లో సంజయ్ దత్ ఒకరని జైలు అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే కళాకారులకు భారీ భద్రతను ఏర్పాటు చేసామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్, హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ లు పాల్గొననున్నారని జైలు అధికారులు తెలిపారు.