
ముంబై పేలుళ్ల నిందితుడు లక్వీకి బెయిల్ మంజూరు
పాకిస్తాన్: ముంబైలో నవంబరు 26 పేలుళ్ల నిందితుడు లష్కరే తోయిబా ఉగ్రవాది జకీ ఉర్ రెహ్మాన్ లక్వీకి పాకిస్తాన్లోని ఉగ్రవాద నిరోధక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లక్వీకి బెయిల్ మంజూరుపై పాక్ ప్రభుత్వంతో భారత విదేశాంగ శాఖ మాట్లాడుతోంది. పాక్లోని భారత రాయభార కార్యాలయంతో భారత విదేశాంగ శాఖ సంప్రదింపులు జరుపుతోంది.
భారత్పై మరిన్ని దాడులు చేస్తామన్న సయూద్ను భారత్కు అప్పటించాలని కోరిన రోజునే లక్వీకి బెయిలు మంజూరైంది. ముంబై దాడి కేసులో న్యాయం జరుగుతుందన్న ఆశ సన్నగిల్లిందని భారత విదేశాంగ శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
లక్వీకి బెయిల్ రావడం దురదృష్టకరమని భారత కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. లక్వీకి బెయిల్ ఇవ్వడం దిగ్భ్రాంతి కలిగించిందని బీజేజీ అగ్రనేత అద్వాని అన్నారు.