ముంబై: 1993 ముంబై పేలుళ్ల కేసు సూత్రధారి, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కుటుంబసభ్యులకు చెందిన రెండు స్థిరాస్తులు వేలంలో రూ.2 కోట్లకు పైగా ధర పలికినట్లు అధికారులు తెలిపారు. స్మగ్లర్లు, ఫారిన్ ఎక్సే్ఛంజి మానిప్యులేటర్స్ చట్టం కింద శుక్రవారం ముంబైలోని ఆయకార్ భవనంలో వేలం చేపట్టామన్నారు.
మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఖేడ్ తహశీల్ ముంబాకే గ్రామంలోని నాలుగు చోట్ల ఉన్న భూములను వేలానికి ఉంచినట్లు చెప్పారు. వీటిలో సుమారు 171 చదరపు మీటర్ల భూమి ధర వేలంలో అత్యధికంగా రూ.2.01 కోట్లు, మరో 1,730 చదరపు మీటర్ల స్థలం రూ.3.28 కోట్లు పలికిందని చెప్పారు. ఈ రెండింటిని ఢిల్లీకి చెందిన లాయర్ కొనుగోలు చేశారని వివరించారు. మిగతా రెండు ప్లాట్లకు ఎవరూ టెండర్లు వేయలేదని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment