Mastermind
-
కేజ్రీవాలే అసలు కుట్రదారు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఆరు రోజులపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడీకి అప్పగిస్తూ రౌజ్‌అవెన్యూ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేజ్రీవాల్‌ను ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టాలని ఈడీని ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా ఆదేశించారు. మద్యం కుంభకోణంలో విచారణ కోసం కేజ్రీవాల్‌ను 10 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ విజ్ఞప్తి చేయగా, న్యాయస్థానం కేవలం ఆరు రోజులపాటు కస్టడీకి అనుమతించింది. కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు గురువారం రాత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పటిష్టమైన భద్రత మధ్య ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనలు వినిపించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం వెనుక ఉన్న అసలు కుట్రదారు, కీలక సూత్రధారి అరవింద్ కేజ్రీవాలేనని తేలి్చచెప్పారు. ఆయనతోపాటు పలువురు ఢిల్లీ మంత్రులు, ఆమ్ ఆద్మీ పారీ్టలు నేతలు ఈ కేసులో భాగస్వాములేనని స్పష్టం చేశారు. ఢిల్లీలో 2021–22లో నూతన లిక్కర్ పాలసీని రూపొందించి, అమలు చేసినందుకు గాను ‘సౌత్ గ్రూప్’ నుంచి కేజ్రీవాల్ కోట్లాది రూపాయలు ముడుపులుగా స్వీకరించారని ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా దృష్టికి తీసుకొచ్చారు. సౌత్ గ్రూప్‌కు చెందిన కొందరు నిందితుల నుంచి రూ.100 కోట్ల మేర వసూలు చేశారని వెల్లడించారు. నాలుగు హవాలా మార్గాల్లో అందిన రూ.45 కోట్లను గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. మిగిలిన సొమ్ము ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలకు నగదు రూపంలో అందిందని తెలిపారు. నిందితులు, సాకు‡్ష్యల కాల్ డిటైల్ రికార్డులు(సీడీఆర్), స్టేట్మెంట్లు ఇదే విషయాన్ని నిరూస్తున్నాయని తెలియజేశారు. అవినీతి కోసం కేజ్రీవాల్ తన పదవిని వాడుకున్నారని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను ప్రశ్నించి, మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని, అందుకే ఆయనను 10 రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానానికి ఎస్.వి.రాజు విజ్ఞప్తి చేశారు. అరవింద్ కేజ్రీవాల్ తరపున సీనియర్ అడ్వొకేట్ అభిõÙక్ మనూ సింఘ్వీ హాజరయ్యారు. ‘‘సిట్టింగ్ సీఎంను అరెస్టు చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయాల్సిన అవసరమే లేదు. కేజ్రీవాల్ తప్పు చేశారనేందుకు ఎలాంటి సాక్ష్యాలూ లేవు’’ అని వాదించారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరణ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఉపసంహరించుకున్నారు. దీనిపై విచారణ చేపడతామని ఉదయమే సుప్రీంకోర్టు వెల్లడించగా పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కేజ్రీవాల్ తరఫున అభిõÙక్ సింఘ్వీ మధ్యాహ్నం కోర్టుకు తెలిపారు. ఇదే కేసులో నిందితురాలైన బీఆర్ఎస్ నేత కవిత బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు నిరాకరించిన కాసేపటికే కేజ్రీవాల్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం గమనార్హం. ట్రయల్ కోర్టులో విచారణ తర్వాత మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సింఘ్వీ చెప్పారు. జైల్లో ఉన్నా సీఎంగా కొనసాగుతా తన జీవితం దేశ సేవకే అంకితమని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం కోర్టు నుంచి బయటికొచ్చాక ఆయన మీడియాతో మాట్లా డారు. జైలు బయట ఉన్నా, లోపలున్నా సీఎంగా కొనసాగుతానని స్పష్టం చేశారు. -
దావూద్ కుటుంబీకుల ఆస్తులకు రూ.2 కోట్లకు పైగా ధర
ముంబై: 1993 ముంబై పేలుళ్ల కేసు సూత్రధారి, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కుటుంబసభ్యులకు చెందిన రెండు స్థిరాస్తులు వేలంలో రూ.2 కోట్లకు పైగా ధర పలికినట్లు అధికారులు తెలిపారు. స్మగ్లర్లు, ఫారిన్ ఎక్సే్ఛంజి మానిప్యులేటర్స్ చట్టం కింద శుక్రవారం ముంబైలోని ఆయకార్ భవనంలో వేలం చేపట్టామన్నారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఖేడ్ తహశీల్ ముంబాకే గ్రామంలోని నాలుగు చోట్ల ఉన్న భూములను వేలానికి ఉంచినట్లు చెప్పారు. వీటిలో సుమారు 171 చదరపు మీటర్ల భూమి ధర వేలంలో అత్యధికంగా రూ.2.01 కోట్లు, మరో 1,730 చదరపు మీటర్ల స్థలం రూ.3.28 కోట్లు పలికిందని చెప్పారు. ఈ రెండింటిని ఢిల్లీకి చెందిన లాయర్ కొనుగోలు చేశారని వివరించారు. మిగతా రెండు ప్లాట్లకు ఎవరూ టెండర్లు వేయలేదని వివరించారు. -
Hafiz Saeed extradition: నేరగాళ్ల అప్పగింతకు ఒప్పందమేదీ?: పాక్
ఇస్లామాబాద్: నేరగాళ్ల అప్పగింతకు భారత్‌తో తమకు ద్వైపాక్షిక ఒప్పందమేమీ లేదని పాకిస్తాన్ పేర్కొంది. ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను అప్పగించాల్సిందిగా పాక్‌ను భారత్ కోరడం తెలిసిందే. ఇందుకవసరమైన అన్ని పత్రాలను కూడా పాక్‌కు ఇప్పటికే అందజేసినట్టు విదేశాంగ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి వెల్లడించారు. సయీద్‌ను అప్పగించాలంటూ భారత్ నుంచి అభ్యర్థన అందిందని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ ధ్రువీకరించారు. అయితే హఫీజ్ అప్పగింతకు వీలు కల్పించే ద్వైపాక్షిక ఒప్పందమేదీ ఇరు దేశాల మధ్య లేదన్నారు. -
హఫీజ్ సయీద్‌ను అప్పగించండి
న్యూఢిల్లీ: 26/11 ముంబై దాడుల సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు అధికారికంగా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక వినతిని పాకిస్తాన్ ప్రభుత్వానికి పంపించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సయీద్‌ను అప్పగించడానికి చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరినట్లు తెలియజేశాయి. భారత్ రూపొందించిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో హఫీజ్ సయీద్ ఉన్నాడు. అతడి తలపై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్ల బహుమానం ప్రకటించింది. 2008 నాటి ముంబై దాడులకు వ్యూహ రచన చేసిన హఫీజ్ సయీద్‌ను విచారించేందుకు భారత ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. అతడిని తమకు అప్పగించాలని భారత్ పదేపదే కోరుతున్నా పాకిస్తాన్ పట్టించుకోవడం లేదు. -
ఆస్పత్రిలో దావూద్!
మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో అతన్ని రెండు రోజుల క్రితం పాకిస్తాన్‌లోని కరాచీలో హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఒక ఫ్లోర్ మొత్తాన్నీ ఖాళీ చేయించి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ చికిత్స అందిస్తున్నట్టు చెబుతున్నారు. ఆస్పత్రి వర్గాలు, కుటుంబీకులకు తప్ప మరెవరికీ ప్రవేశం లేకుండా పోలీసులు భారీ సంఖ్యలో పహారా కాస్తున్నారట. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా సంస్థలు ఈ మేరకు వార్తా కథనాలు ప్రసారం చేశాయి. అంతేగాక 67 ఏళ్ల దావూద్‌కు విషప్రయోగం జరిగిందని, అందుకే ఉన్నపళాన ఆస్పత్రికి తరలించారని సోమవారమంతా జోరుగా పుకార్లు షికారు చేశాయి. చికిత్స పొందుతూ ఆదివారమే అతను మరణించినట్టు కూడా వార్తలొచ్చాయి! అయితే దావూద్‌పై విషప్రయోగం, అతని మృతి వార్తలు పూర్తిగా అవాస్తవమని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలవడం మాత్రం నిజమేనని నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. దావూద్ చాలా ఏళ్లుగా కుటుంబంతో పాటుగా పాకిస్తాన్‌లోనే నివసిస్తున్నట్టు ఇప్పటికే తేలింది. అతను కరాచీలోనే ఉంటున్నట్టు పక్కా ఆధారాలున్నాయని భారత్ వెల్లడించింది కూడా. భారత్‌తో పాటు ఐరాస భద్రతా మండలి కూడా 2003లోనే దావూద్‌ను మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం తెలిసిందే. అతని తలపై ఏకంగా 2.5 కోట్ల డాలర్ల రివార్డు ఉంది! రోజంతా కలకలం దావూద్‌పై విషప్రయోగం, మృతి వార్తలు సోమవారం ఉదయం నుంచే కలకలం రేపాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఓ యూట్యూబర్ వీటిని తొలుత బయట పెట్టాడు. పలు సోషల్ మీడియా వార్తలను ఉటంకిస్తూ ఈ మేరకు కథనం ప్రసారం చేసి దుమారం రేపాడు. ఆది, సోమవారాల్లో పాకిస్థాన్ అంతటా గంటల తరబడి ఇంటర్నెట్ మూగబోవడానికి, దావూద్ మృతికి లింకుందని చెప్పుకొచ్చాడు. ‘‘దేశంలో ఏదో పెద్ద ఉదంతమే జరిగింది. దాన్ని దాచేందుకే నెట్‌పై ఆంక్షలు విధించారు’’ అంటూ ప్రముఖ పాక్ జర్నలిస్టులు ఎక్స్ పోస్టుల్లో అనుమానాలు వెలిబుచ్చడంతో మరింత అలజడి రేగింది. దావూద్ విషమ పరిస్థితుల్లో కరాచీ ఆస్పత్రిలో చేరినట్టు పాక్ జర్నలిస్టు అర్జూ కాజ్మీ ఎక్స్ పోస్టులో నిర్ధారించారు. తొలిసారేమీ కాదు... దావూద్‌పై విషప్రయోగం జరిగిందని, అతను మరణించాడని వార్తలు రావడం ఇది తొలిసారేమీ కాదు. ఏటా కనీసం ఒకట్రెండుసార్లు ఇలాంటి వార్తలు రావడం, అవన్నీ పుకార్లేనని తేలడం పరిపాటిగా మారింది. కరాచీలోనే దావూద్: అల్లుడు పాక్ ఖండిస్తున్నా, దావూద్ కరాచీలో ఉండటం వాస్తవమేనని అతని అల్లుడు అలీ షా పార్కర్ గత జనవరిలో ధ్రువీకరించాడు. కరాచీలోని అబ్దుల్లా గాజీ బాబా దర్గా వెనక రహీం ఫకీ సమీపంలోని డిఫెన్స్ ఏరియాలో దుర్భేద్యమైన ఇంట్లో కొన్నేళ్లుగా దావూద్ నివాసముంటున్నట్టు తెలిపాడు. దావూద్ చెల్లెలు హసీనా పార్కర్ కొడుకైన అలీ షా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు ఇచి్చన స్టేట్మెంట్లో ఇంకా పలు విషయాలు వెల్లడించాడు. ‘‘దావూద్ ఓ పాక్ పఠాన్ స్త్రీని రెండో పెళ్లి చేసుకున్నాడు. దావూద్‌కు ముగ్గురు సోదరులు, నలుగురు అక్కచెల్లెళ్లు, ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లున్నారు. ఒక కూతురును పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ కుమారునికిచ్చి పెళ్లి చేశాడు’’ అని అలీ షా తెలిపాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్లాన్ A&B.. పార్లమెంట్‌పై దాడిలో సంచలన విషయాలు
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన సూత్రధారిగా పేరుగాంచిన లలిత్ ఝా కీలక విషయాలను పోలీసులకు తెలిపారు. ఈ వ్యవహారంలో వారు రెండు వ్యూహాలను పన్నినట్లు చెప్పాడు. ఒకవేళ ప్లాన్ ఏ విఫలమైతే ప్లాన్ బీని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పాడు. ప్లాన్ ఏ ప్రకారం నీలం, అమోల్ పార్లమెంట్‌లోకి ప్రవేశించకపోతే మరోవైపు నుంచి మహేశ్, కైలాష్ ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్లు లలిత్ చెప్పాడు. పొగ బాంబులను మండించి నినాదాలు చేయాలని సంకల్పించినట్లు పేర్కొన్నాడు. మహేష్, కైలాష్ గురుగ్రామ్‌లోని తాము నివాసం ఉన్న విశాల్ శర్మ(విక్కి) ఇంటికి చేరుకోవడంలో విఫలమైనందున అమోల్, నీలం ఎలాగైనా పని పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించాడు. పార్లమెంట్లో ఆరుగురు వ్యక్తులు బుధవారం గందరగోళం సృష్టించారు. పక్కా ప్రణాళికతో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన నిందితులు గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు నిందితులు లోక్‌సభ లోపలికి ప్రవేశించి పసుపు రంగు గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో ఎంపీలంతా భయాందోళనకు గురయ్యారు. నిందితులను ఎంపీలే పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ కేసులో నలుగురు నిందితులను ఉపా(దేశ వ్యతిరేక కార్యకాలాపాల చట్టం) చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి జరిగిన రోజే మళ్లీ ఈ ఘటన జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది. మనోరంజన్, సాగర్ శర్మ, నీలమ్, అమోల్ శిందె, విశాల్, లలిత్, మహేశ్ అనే ఏడుగురు దుండగులు ఈ ఘటనకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో మనోరంజన్, సాగర్‌శర్మ లోక్‌సభలోకి చొరబడగా.. నీలమ్, అమోల్ శిందే పార్లమెంట్ భవనం వెలుపల గందరగోళం సృష్టించారు. ఈ నలుగురితో పాటు వీరికి బస ఏర్పాటు చేసిన విశాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహేష్‌ను ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ ఐదుగురి మొబైల్ ఫోన్స్‌తో పరారైన లలిత్ ఝా ప్రస్తుతం లొంగిపోయాడు. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి ఘటన: ప్రతిపక్షాల తీరుపై అమిత్ షా ఫైర్ -
పార్లమెంట్ అలజడి కేసు సూత్రధారి లలిత్ ఝా అరెస్టు
ఢిల్లీ: పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన కేసుమాస్టర్ మైండ్ లలిత్ ఝా అరెస్ట్ అయ్యాడు. తనంతట తానుగా వచ్చి ఢిల్లీ పోలీసులకు లొంగిపోయాడు. గురువారం రాత్రి లలిత్ ఝా మరో వ్యక్తితో కలిసి కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతన్ని పోలీసు ప్రత్యేక బృందాలకు అప్పగించినట్లు పేర్కొన్నారు. మనోరంజన్, సాగర్ శర్మ, నీలమ్, అమోల్ శిందె, విశాల్, లలిత్ అనే ఆరుగురు దుండగులు ఈ ఘటనకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో మనోరంజన్, సాగర్‌శర్మ లోక్‌సభలోకి చొరబడగా.. నీలమ్, అమోల్ శిందే పార్లమెంట్ భవనం వెలుపల గందరగోళం సృష్టించారు. ఈ నలుగురితో పాటు వీరికి బస ఏర్పాటు చేసిన విశాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురి మొబైల్ ఫోన్స్‌తో పరారైన లలిత్ ఝా ప్రస్తుతం లొంగిపోయాడు. పార్లమెంట్లో నిందితులు బుధవారం గందరగోళం సృష్టించారు. పక్కా ప్రణాళికతో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన నిందితులు గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు నిందితులు లోక్‌సభ లోపలికి ప్రవేశించి పసుపు రంగు గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో ఎంపీలంతా భయాందోళనకు గురయ్యారు. నిందితులను ఎంపీలే పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ కేసులో నలుగురు నిందితులను ఉపా(దేశ వ్యతిరేక కార్యకాలాపాల చట్టం) చట్టం కింద అరెస్టు చేశారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి జరిగిన రోజే మళ్లీ ఈ ఘటన జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇదీ చదవండి: Parliament Attack: జాతికి జవాబు కావాలి! -
దంతేవాడ పేలుడు సూత్రధారి ఇతనే.. మావోయిస్టు దళంలో కీలక పాత్ర..
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత దంతేవాడ జిల్లాలోని అరన్పూర్ పేలుడు సూత్రధారి జగదీష్ చిత్రం తెరపైకి వచ్చింది. ఇతను చాలా కాలంగా బస్తర్‌లో యాక్టివ్‌గా ఉన్నాడు. నివేదికల ప్రకారం, అరన్‌పూర్‌లో జరిగిన పేలుడులో జగదీష్ మొత్తం సంఘటనకు ప్రణాళికను సిద్ధం చేశాడు. ఈ నక్సలైట్ నాయకుడి నేతృత్వంలోనే దంతేవాడలోని అరన్‌పూర్‌లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 10 మంది జవాన్లు, ఒక డ్రైవర్ బలి అయ్యారు. గతంలో జగదీష్ కాటేకల్యాణ్ ఏరియా కమిటీలో మాత్రమే యాక్టివ్‌గా ఉండేవాడు. అయితే పెద్ద పెద్ద సంఘటనలను నిరంతరం అమలు చేయడంలో విజయం సాధించడంతో జగదీష్ క్యాడర్ పెరిగింది. నక్సలైట్ల సైనిక దళంలో ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. జగదీష్ ప్రాథమికంగా జాగరగుండ తూర్పు గ్రామానికి చెందినవాడు. ఇతనిపై రూ.5 లక్షల రివార్డు ప్రకటించారు. అరన్పూర్ పేలుడు తర్వాత జగదీష్‌తో పాటు మరో 12 మంది నక్సలైట్లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దర్భా డివిజనల్ కమిటీలో చురుగ్గా ఉన్న నక్సల్స్ జగదీష్, లఖే, లింగే, సోమడు, మహేష్, హిద్మా, ఉమేష్, దేవే, నంద్ కుమార్, లఖ్మా, కోసా, ముఖేష్, చైతు, మంగ్తు, రాన్సాయి, జయలాల్, బమన్, సోమ, రాకేష్, భీమాతో పాటు మరికొందరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందరిపై యూఏపీఏ చట్టం ప్రయోగించారు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసు.. బీఎస్పీ ఎంపీకి షాక్.. గ్యాంగ్‌స్టర్‌కు పదేళ్ల జైలు.. -
దోపిడికి వచ్చి జంట హత్యలు..నిందితుడిని చూసి కంగుతిన్న పోలీసులు
దోపిడి చేసేందుకు వచ్చి ఇద్దరు వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో చోటు చేసుకుంది. బాధితులు 60 ఏళ్ల ఇబ్రహీం, అతడి భార్య హజ్రాగా గుర్తించారు. ఇబ్రహీం స్క్రాప్ డీలర్. అతడు ఇంటిలో శవమై కనిపించగా అతడి భార్య టాయిలెట్ బాత్రూంలో మెడకు గుడ్డతో ఉరి వేసి చంపినట్లు కనిపించింది. ఈ జంట హత్యలకు కీలక సూత్రధారి 12 ఏళ్ల బాలుడా! అని పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు . వాస్తవానికి ఆ బాలుడు ఆ దంపతులకు బాగా తెలిసినవాడే. అతను ఇబ్రహీం స్క్రాప్ బిజినెస్‌తో చాలా డబ్బులు కూడబెట్టాడని తెలుసుకుని వారిని దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ముగ్గురు వ్యక్తులను తనతో చేర్చుకుని వారి సాయంతో దోపిడి చేసేందుకు యత్నించాడు. ఐతే దోపిడి చేసే ప్రయత్నం కాస్త చివరికి వారి హత్యలకు దారితీసింది. ఈ మేరకు పోలీసులు ఆ బాలుడి తోపాటు ఈ ఘటనలో పాలుపంచుకున్న మంజేష్, శివరాంలను కూడా అందుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే సందీప్ అనే వ్యక్తి మాత్రం పరారీలో ఉన్నాడు. వారి నుంచి సుమారు రూ. 12 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్, బంగారు గొలుసు తదితరాలను స్వాధీనం చేసుకున్నమాని ఘజియాబాద్ సీనియర్ పోలీసు ఇరాజ్రాజా తెలిపారు. (చదవండి: అక్క కళ్లలో ఆనందం కోసం బావను హత్య చేసిన బావమరిది) -
Drugs Case: ‘హెచ్ న్యూ’ అదుపులో లక్ష్మీపతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నమోదైన తొలి డ్రగ్స్ మరణానికి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రేమ్ ఉపాధ్యాయకు హష్ ఆయిల్ సరఫరా చేసిన వీరవల్లి లక్ష్మీపతిని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు మంగళవారం పట్టుకున్నారు. గత వారం ప్రేమ్ ఉపాధ్యాయ అరెస్టుతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన లక్ష్మీపతి కోసం హెచ్–న్యూ ముమ్మరంగా గాలించింది. మంగళవారం ఏపీలోని విశాఖ ఏజెన్సీలో అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకువస్తోంది. ఇతడికి ఈ ఆయిల్ సరఫరా చేస్తున్న అరకు మండలం లోగిలి ప్రాంతానికి చెందిన నగేష్ కోసం గాలిస్తున్నారు. లక్ష్మీపతి అరెస్టును బుధవారం ప్రకటించే అవకాశం ఉంది. ఓ కేసులో 2020 నవంబర్ 27న మల్కాజ్గిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు అరెస్టు చేసిన తర్వాత లక్ష్మీపతి ఇప్పుడు మళ్లీ చిక్కాడు. చదవండి: ఇంటర్నెట్లో అండర్ వరల్డ్‌గా డార్క్ వెబ్! సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని తులసి వనం కాలనీకి చెందిన లక్ష్మీపతి తండ్రి ప్రస్తుతం నల్లగొండ పోలీసు విభాగంలో ఆర్ఎస్సైగా పని చేస్తున్నారు. ఏడేళ్ల క్రితం బీటెక్ చదువుతున్న రోజుల్లోనే గంజాయికి బానిసగా మారిన లక్ష్మీపతిపై ఒకటిరెండు కేసులు నమోదు కావడంతో ఆయన కొడుకును పూర్తిగా దూరం పెట్టారు. నగేష్ నుంచి తొలినాళ్లల్లో గంజాయి ఖరీదు చేస్తూ వచ్చిన లక్ష్మీపతి ఆ తర్వాత హష్ ఆయిల్ దందా మొదలెట్టాడు. జూబ్లీహిల్స్, మియాపూర్, మాదాపూర్, భువనగిరి, విశాఖపట్నాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని తన దందా కొనసాగించాడు. హష్ ఆయిల్‌ను ఇసోప్రోపిక్ ఆల్కహాల్‌తో కల్తీ చేసిన చరిత్ర లక్ష్మీపతికి ఉంది. -
Kidnap Case: ఆనందపడ్డారు.. కానీ పోలీసులు వదల్లేదు..
మండపేట(తూర్పుగోదావరి): నమ్మిన పాలేరే నయవంచన చేశాడు. చెడు వ్యసనాలకు బానిసై, చేసిన అప్పులు తీర్చేందుకు మరో నలుగురితో కలిసి పథకం ప్రకారం యజమానిని కిడ్నాప్ చేయించాడు. వచ్చిన రూ.10 లక్షలు పంచుకుని అంతా సద్దుమణిగిపోయిందని అందరూ ఆనందపడ్డారు. కానీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న పోలీసులు మాత్రం అంత తేలిగ్గా వదల్లేదు. చదవండి: భార్య కువైట్‌లో.. ఎంత పనిచేశావ్ బంగార్రాజు.. ఈ కిడ్నాప్ వ్యవహారంపై ఎటువంటి ఫిర్యాదూ రానప్పటికీ స్పందించారు. తమంత తామే ఫిర్యాదు తీసుకుని మరీ విచారణ చేపట్టారు. చివరకు కారు నంబరు ఆధారంగా కిడ్నాప్ మిస్టరీని ఛేదించారు. అయిదుగురు నిందితులకు అరదండాలు వేశారు. వీరిలో ఒకరు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) కానిస్టేబుల్ కూడా ఉండటం గమనార్హం. మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి ఈ కేసు వివరాలను సోమవారం విలేకర్లకు వివరించారు. ఆయన కథనం ప్రకారం.. అనపర్తి మండలం పొలమూరుకు చెందిన ద్వారంపూడి కృష్ణారెడ్డి ఈ నెల 5వ తేదీ ఉదయం మండపేట మండలం వేములపల్లిలోని పొలం వద్దకు వెళ్లారు. ఆయనను అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ ఉదంతంపై సోషల్ మీడియాలోను, మీడియాలోను విస్తృతంగా ప్రచారం జరిగింది. కిడ్నాపర్ల డిమాండ్ మేరకు బంధువులు రూ.10 లక్షలు చెల్లించి, కృష్ణారెడ్డిని విడిపించారు. అయితే ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే, విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు దీనిపై విచారణ జరపాల్సిందిగా రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎస్సై బి.శివకృష్ణ బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. రూరల్ సీఐ పి.శివగణేష్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేపట్టారు. కృష్ణారెడ్డి బంధువులను అన్ని వివరాలూ అడిగి తెలుసుకున్నారు. కృష్ణారెడ్డిని కిడ్నాప్ చేసిన దుండగులు ఆయనను కారులో ఎక్కించుకుని రాజానగరం మండలం తుంగపాడు, గోకవరం, రంపచోడవరం మీదుగా సీతపల్లి వరకూ తీసుకువెళ్లారు. ఆయనను వదలాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని పాలేరు బక్కి జయరాజు ద్వారా తమకు అందజేయాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు జయరాజుకు రూ.10 లక్షల నగదు ఇచ్చి పంపగా.. కడియం మండలం బుర్రిలంక వద్ద హైవేపై నగదు తీసుకుని, కృష్ణారెడ్డిని అప్పగించి పరారయ్యారు. ‘జయరాజుకు ఇచ్చి పంపాలి’ అని చెప్పడంతో పోలీసులు తొలుత జయరాజును అనుమానించారు. అతడి కాల్ డేటా సేకరించారు. అనంతరం సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా కారు నంబర్‌ను గుర్తించి, కేసును ఛేదించారు. రాజానగరం మండలం ముక్కినాడపాకలుకు చెందిన జయరాజు చెడు వ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యాడు. అదే గ్రామానికి చెందిన సమీప బంధువులు పాకా శ్రీను, పాకా సతీష్‌కుమార్, మండేల ప్రవీణ్, వారి స్నేహితుడు ద్వారంపూడి శ్రీనివాసరెడ్డితో కలిసి కృష్ణారెడ్డిని కిడ్నాప్ చేసేందుకు పథక రచన చేశాడు. వీరిలో సతీష్‌కుమార్ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. నిందితులు వచ్చిన సొమ్మును పంచుకుని సోమవారం వేములపల్లిలో పార్టీ చేసుకుంటుండగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.6 లక్షల నగదు, కిడ్నాప్‌కు ఉపయోగించిన కారు, మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ శివగణేష్, ఎస్సై శివకృష్ణలను డీఎస్పీ బాలచంద్రారెడ్డి అభినందించారు. -
ముంబై ఉగ్రదాడి సూత్రధారి లఖ్వీ అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ (61) ని అరెస్ట్ చేశామంటూ శనివారం పాక్ పోలీసులు సంచలన ప్రకటన చేశారు. 2008లో ముంబై ఉగ్ర దాడుల మాస్టర్ మైండ్ లఖ్వీని తమ కౌంటర్ టెర్రరిజం విభాగం (సీటీడీ) అరెస్టు చేసిందని పాక్ ప్రకటించింది. అయితే లఖ్వీని అరెస్టు చేసిన స్థలాన్ని అధికారులు ప్రస్తావించలేదు. ముంబై దాడుల మైస్టర్ మైండ్ లఖ్వీని అదుపులోకి తీసుకున్నామని పాక్ పోలీసు అధికారులు ప్రకటించారు. ఉగ్రవాద సంస్థలకు నిధులను సమకూరుస్తున్నాడన్న ప్రధాన కారణంతోఅతడిని అరెస్ట్ చేసినట్టు సీటీడీ తెలిపింది. లఖ్వీ ఒక డిస్పెన్సరీని నడుపుతూ, ఉగ్రవాద చర్యలకు, ఆ నిధులను ఉపయోగిస్తున్నాడని ఆరోపించారు. ఈనిధులను ఉగ్రవాద ఫైనాన్సింగ్‌తో పాటు వ్యక్తిగత ఖర్చులకు కూడా ఉపయోగించాడని పేర్కొంది. ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయమై లాహోర్‌లో నమోదైన కేసు ఆధారంగా స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి, ఆ సంస్థకు ఆర్థికంగా సాయం చేస్తున్న లఖ్వీని పట్టుకున్నామని పాక్ పోలీసులు వెల్లడించారు. అయితే లఖ్వీని ఎప్పుడు, ఎలా అరెస్ట్ చేశారన్న వివరాలను మాత్రం పాక్ వెల్లడించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా ముంబై దాడుల కేసుల్లో లఖ్వీయే ప్రధాన సూత్రధారి. 2008 నవంబర్ 26 నుంచి నవంబర్ 29 వరకు ముంబైలోని ఎనిమిది ప్రాంతాల్లో వరుస బాంబు దాడులు చేసిన ఘటనలో ఏకంగా 173 మంది ప్రాణాలు కోల్పోయారు. 308 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబై ఉగ్రదాడి కేసులో అరెస్టయిన లఖ్వీ 2015 నుంచి బెయిల్‌పై ఉన్నాడు. -
సయీద్‌కు 11 ఏళ్ల జైలు
లాహోర్: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా అధ్యక్షుడు హఫీజ్ సయీద్‌కు పాక్‌లో జైలు శిక్ష పడింది. ఉగ్రవాదానికి నిధులు అందించారన్న కేసులో విచారణ జరిపిన పాకిస్తాన్‌లోని ఉగ్రవ్యతిరేక (ఏటీసీ) పదకొండేళ్ల జైలుశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. సయీద్‌తోపాటు అతడి సన్నిహిత సహచరుడు జఫర్ ఇక్బాల్‌కూ 11 ఏళ్ల శిక్ష విధిస్తూ ఏటీసీ జడ్జి అర్షద్ హుస్సేన్ భుట్టా ఆదేశాలు జారీ చేశారు. సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి గతంలోనే ప్రకటించింది. అతడి తలకు అమెరికా గతంలో కోటి డాలర్ల వెలకట్టింది. గత ఏడాది జూలై 17న అరెస్ట్ అయిన సయీద్ లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైల్లో ఉన్నారు. లాహోర్, గుజ్రన్‌వాలాల్లో దాఖలైన రెండు కేసుల్లో సయీద్‌కు శిక్ష విధించారని, ఒక్కో కేసులో ఐదున్నర ఏళ్లు జైలు శిక్ష, మొత్తం 15 వేలరూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని, రెండు శిక్షలు ఒకేసారి అమలవుతాయని కోర్టు అధికారి ఒకరు తెలిపారు. ఏటీసీ కోర్టు గత ఏడాది డిసెంబర్ 11న సయీద్, అతడి సన్నిహిత సహచరులను దోషులుగా ప్రకటించగా..శిక్ష ఖరారును ఫిబ్రవరి 11వ తేదీ వరకూ వాయిదా వేయడం తెల్సిందే. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందిస్తున్న వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న పాకిస్తాన్ హామీని నెరవేర్చాలని పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఒకటి ఇచ్చిన పిలుపుతో పాక్ ప్రభుత్వం సయీద్, అతడి అనుచరులపై విచారణ ప్రారంభించింది. -
ఎన్కౌంటర్లో కమ్రాన్ హతం
శ్రీనగర్: కశ్మీర్లో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలుకోల్పోయిన ‘పుల్వామా ఆత్మాహుతి ఉగ్రదాడి’కి సూత్రధారిగా భావిస్తున్న కమ్రాన్ అలియాస్ అబ్దుల్ ఘాజీ రషీద్‌సహా ముగ్గురు జైషే మహ్మద్ ముష్కరులను ఎన్కౌంటర్లో భద్రతా దళాలు హతమార్చాయి. సోమవారం జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఓ ఆర్మీ మేజర్ సహా ఐదుగురు భద్రతా సిబ్బంది, ఓ పౌరుడు అమరులయ్యారు. పోలీస్ డీఐజీసహా 9 మంది సిబ్బంది గాయపడ్డారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన ప్రదేశానికి 12 కి.మీ.ల దూరంలోని పింగ్లాన్‌లో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు దాదాపు 16 గంటలపాటు ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎన్కౌంటర్ కొనసాగింది. చనిపోయిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరిని కమ్రాన్, హిలాల్ అహ్మద్‌గా గుర్తించారు. కమ్రాన్ పాకిస్తాన్ జాతీయుడు, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ టాప్ కమాండర్లలో ఒకరు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాద దాడికి ఇతడే సూత్రధారి అని అధికారులు భావించి ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు. హిలాల్ అహ్మద్ కశ్మీర్‌కే చెందినవాడు కాగా మూడో ఉగ్రవాది ఎవరనేది తెలియాల్సి ఉంది. అమరులైన భద్రతా దళాల సిబ్బందిలో ఆర్మీ మేజర్ విబూది ధొండ్యాల్, హవల్దార్ శివరామ్, సిపాయిలు హరిసింగ్, అజయ్, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. డీఐజీ అమిత్, ఓ బ్రిగేడ్ కమాండర్‌సహా 9 మంది గాయపడ్డారు. ఉత్తరాఖండ్ నుంచి రెండో మేజర్ ఉత్తరాఖండ్‌కు చెందిన ఇద్దరు ఆర్మీ మేజర్లు రెండు వరుస రోజుల్లో అమరులయ్యారు. ఓ వైపు హరిద్వార్‌లో మేజర్ చిత్రేశ్ బిష్ట్ అంత్యక్రియలు సోమవారం జరుగుతుండగానే, డెహ్రాడూన్‌కు చెందిన మరో మేజర్ విబూది ధొండ్యాల్ ఉగ్రవాదులతో ఎన్కౌంటర్లో నేలకొరిగారు. రాయబారిని వెనక్కు పిలిపించిన పాక్ ఇస్లామాబాద్: భారత్‌లో పాకిస్తాన్ రాయబారి మహ్మద్ ఫైజల్‌ను ఆ దేశం చర్చల కోసమంటూ వెనక్కు పిలిపించింది. పుల్వామా దాడి అనంతరం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో భారత చర్యకు ప్రతిచర్యగా పాక్ తమ రాయబారిని వెనక్కు రప్పించింది. దాడి తర్వాత గత వారమే పాక్‌లో భారత రాయబారి అజయ్‌ను భారత్ వెనక్కు రప్పించింది. బైక్ రిమోట్ కీతో ఐఈడీ పేల్చారు న్యూఢిల్లీ: పుల్వామా ఘటనలో ఐఈడీని పేల్చేందుకు బైక్ రిమోట్ తాళం చెవిని వాడినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. గత దాడుల్లో వాడిన ఐఈడీలనూ కీలతోనే ఆపరేట్ చేసినట్లు భావిస్తున్నాయి. కశ్మీర్ ఉగ్రవాద వ్యతిరేక విభాగం తాజాగా రూపొందించిన నివేదికలో ఇలాంటి కీలక విషయాలున్నాయి. ఐఈడీలను పేల్చేందుకు బైక్, ఇతర వాహనాల్లో వాడే రిమోట్ కీ, వాకీటాకీ, సెల్‌ఫోన్‌ల్లో వాడే ఎలక్ట్రానిక్ పరికరాలను వాడుతున్నారు. ఇవి మార్కెట్లో సులువుగా లభ్యం కావడంతోపాటు భద్రతా బలగాలతో ముఖాముఖి తలపడే అవసరం లేకుండానే తీవ్ర నష్టం కలగజేస్తాయి. ‘కొన్ని రాష్ట్రాల్లో మావోయిస్టులు వినియోగించుకుంటున్న సాంకేతికతనే భవిష్యత్తులో కశ్మీర్ ఉగ్రవాదులు అమలు పరిచే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో కశ్మీర్‌లోని భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని నివేదిక పేర్కొంది. ’కొన్నాళ్లక్రితం షోపియాన్‌లో ఐఈడీని పేల్చేందుకు బైక్ రిమోట్ కీ వాడారు. ఇటువంటివే గతంలో రెడ్ కారిడార్(మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు)లో మావోలు వాడారు. దీన్ని బట్టి వీరికీ వారికీ మధ్య సంబంధాలున్నట్లు భావించాల్సి వస్తోంది’ అని నివేదిక పేర్కొంది. కశ్మీర్లో జరిగిన ఐడీఈ పేలుళ్లలో లభ్యమైన ఆధారాలను బట్టి.. ఆర్డీఎక్స్, పీఈటీఎన్(పెంటాఎరిత్రిటోల్ టెట్రానైట్రేట్), టీఎన్టీ(ట్రైనైట్రోటోలిన్) వంటి మిలటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలతోపాటు విడిగా లభ్యమయ్యే అమోనియం నైట్రేట్, స్లర్రీస్ వంటి వాటిని ఐఈడీలను తయారు చేసేందుకు వాడినట్లు నివేదిక తేల్చింది. లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించేందుకు గాను ఉగ్రవాదులు ఐఈడీని ఎలక్ట్రానిక్ వైర్లతో అనుసంధానిస్తున్నారు. ‘దాడులకు కొత్త వ్యూహాలు, సాంకేతికత, పద్ధతులను అవలంభిస్తున్నారు. సైన్యంతో ప్రత్యక్షంగా తలపడేకంటే ఈ పద్ధతులు ఎంతో తేలికగా ఎక్కువ నష్టం కలిగించే అవకాశం ఉండటంతో ఉగ్రవాదులు ఈ మార్గాలనే ఎంచుకుంటున్నారు’ అని ఆ నివేదిక పేర్కొంది. -
పీఎన్బీ స్కాం మాస్టర్‌మైండ్: కొన్ని వివరాలు
సాక్షి, ముంబై: పీఎన్బీ కుంభకోణంలో కీలక పాత్రధారి, ప్రధాన నిందితుడు, బ్యాంకు మాజీ డిప్యూటీ మేనేజర్ గోకుల్‌నాథ్ శెట్టి గురించి అత్యంత ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఇప్పటికే శెట్టిని అరెస్ట్ చేసిన సీబీఐ ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో సీబీఐ వర్గాలు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. 2015లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, గీతాంజలి జెమ్స్ అధిపతి మోహుల్ చోక్సీని కలిశారు. అదే ఏడాది ఖరీదైన ఇల్లును కొనుగోలు చేశాడు. మలాద్ లింక్ రోడ్లో సుమారు రూ. 4కోట్ల 4 బెడ్రూం ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. బోరివాలీలో మరొక ఇల్లు కూడా ఉంది, ప్రస్తుతం ఇది అద్దెకు ఇచ్చారు. అంతేకాదు తన పూర్వీకుల గ్రామంలో శెట్టి పలు స్థలాలను కూడా కొనుగోలు చేశారు. కర్నాటకలోని ముల్కిలో జన్మించిన గోకుల్‌నాథ్ శెట్టి 1981లో క్లర్క్‌గా పీఎన్బీలో జాయిన్ అయ్యాడు. 2005లో పీఎన్బీ ముంబై బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. ఇక్కడే నీరవ్ మోదీ, చోక్సి ఖాతాలు ఉన్నాయి. 11 ఏళ్ళ సర్వీసు అనంతరం ఒక్కసారి మాత్రమే ప్రమోషన్ తీసుకున్నాడు. అదీ దీర్ఘకాలం క్లర్క్‌గా పనిచేసిన తరువాత, నేరుగా డిప్యూటీ మేనేజర్ స్థాయికి చేరుకున్నాడు. నిబంధనల ప్రకారం 2010లో బదిలీ జరగాల్సి ఉన్నా..2017లో రిటైర్ అయ్యేదాకా అదే పదవిలో కొనసాగడం గమనార్హం. -
‘నేను ఉగ్రవాదిని కాను’
న్యూఢిల్లీ : ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, జమాత్ ఉద్ దవా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్.. తాను ఉగ్రవాదిని కాదని ప్రకటించుకున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని హఫీజ్ సయీద్ ఐక్యరాజ్యసమితిలో పిటీషన్ దాఖలు చేశారు. ప్రముఖ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సహవ్యవస్థాపకుడిగా పేరొందిన హఫీజ్ సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ పాకిస్తాన్‌లోని ఒక న్యాయవాద సంస్థ ఐక్యరాజ్య సంస్థలో పిటీషన్ దాఖలు చేసింది. ముంబైదాడుల కేసులో కొన్ని నెలలుగా గృహనిర్భంధంలో ఉన్న హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ కోర్టు ఈ మధ్యే స్వేచ్చను ప్రసాదించింది. ముంబై దాడులు అనంతరం ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సెల్ రిజుల్యూషన్ 1267 మేరకు హఫీజ్ సయీద్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా సమితి ప్రకటించింది. -
గొంతులు కోయించిన మాస్టర్‌మైండ్ చచ్చాడు
ఢాకా: ఢాకా కేఫ్‌లో ఊచకోత వెనుక సూత్రదారి హతమయ్యాడు. బంగ్లాదేశ్ రాజధానిలో శనివారం ఉదయం బలగాలు జరిపిన సోదాల్లో తారసపడిన మొనిరుల్ ఇస్లామ్ చీఫ్ తమిమ్ అహ్మద్ చౌదురి కాల్పులు జరపగా ప్రతిగా బలగాలు జరిపిన కాల్పుల్లో అతడు హతమయ్యాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ అధికారులు స్పష్టం చేశారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ఉగ్రవాద నిరోధక దళం, ట్రాన్స్‌నేషనల్ క్రైమ్ యూనిట్ ఉమ్మడిగా నారాయణ్ గంజ్ సదార్ ప్రాంతంలో కార్డన్ సెర్చ నిర్వహించారు. ఈ ప్రాంతంలో కొంతమంది ఉగ్రవాదులు, మోనిరుల్ ఇస్లాం చీఫ్ తలదాచుకున్నారని సమాచారం తెలియడంతో గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో గుంపుగా ఉన్న ఉగ్రవాదులు బలగాలకు తారసపడి కాల్పులు జరిపారు. దీంతో బలగాలు జరిపిన ప్రతిదాడుల్లో మోనిరుల్ ఇస్లామ్ చీఫ్ తమిమ్ మరికొందరు హతమయ్యారు. ఢాకాలోని ఆర్టిసన్ బేకరీపై ఈ ఏడాది (2016) జూలై 1న కొంతమంది ఉగ్రవాదులు దాడులు చేసి 22మందిని అత్యంత దారుణంగా గొంతుకోసి చంపిన విషయం తెలిసిందే. ఈ దాడులకు సంబంధించిన మాస్టర్ మైండ్ కెనడా సంతతికి చెందిన బంగ్లాదేశీయుడు తమిమ్ అని పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి అతడి కోసం గాలిస్తుండగా చిక్కి చివరకు హతమయ్యాడు. -
ఢాకా ఉగ్రవాది బెంగాల్లో దాక్కున్నాడా..!
కోల్‌కతా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రదాడికి వ్యూహాన్ని రచించిన కీలక ఉగ్రవాది భారత్‌లోనే తల దాచుకున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. అతడు పశ్చిమ బెంగాల్లో ఏదో ఒక చోట ఉండి ఉంటాడని బంగ్లాదేశ్ అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని త్వరలోనే భారత్ అధికారులతో పంచుకోనున్నారట. ఢాకాలో ఉగ్రవాదులు దాడి చేసి దాదాపు 22 మందిని దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. ఈ దాడి జరిగిన వెంటనే దాదాపు వందమంది 20 ఏళ్లలోపు యువకులు కనిపించకుండా పోయారని, వారిలో కీలక వ్యూహకర్త కూడా ఉన్నాడని అంటున్నారు. భారత్-బంగ్లాదేశ్ ఒప్పందాల ప్రకారం ఉగ్రవాద సమస్యను ఉమ్మడిగా పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా సలహాదారు గవార్ రిజ్వి చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన భావిస్తున్న ప్రకారం ఢాకాలోని గుల్షాన్ రెస్టారెంట్ పై దాడికి వ్యూహాన్ని రచించన వ్యక్తి గత ఏడు నెలల కిందటే దేశం విడిచి భారత్‌లోకి అడుగుపెట్టాడు. బెంగాల్‌లోని ఏదో ఒక మూల తలదాచుకుని ఉంటాడు. అతడికోసం వారు తీవ్రంగా గాలిస్తున్నారు. -
‘కళానికేతన్’ వెనుక మాస్టర్‌మైండ్!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ కళానికేతన్ ఎండీ లీలాకుమార్ చేసిన మోసాల వెనుక ఓ ‘మాస్టర్‌మైండ్’ ఉన్నాడా..? మోసాలు ఎలా చేయాలో సలహాలు, సూచనలు ఇస్తూ తెరవెనుక ఉండి మొత్తం కథ నడిపించింది అతనేనా..? దీనికి అవుననే అంటున్నారు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు. కళానికేతన్ మోసాల వేనుక మాస్టర్‌మైండ్ ఉన్నాడని, తెరవెనుక ఉండి కథ నడిపించిన ఈ వ్యక్తినీ నిందితుల జాబితాలో చేర్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. లీలాకుమార్‌తో పాటు ఆయన భార్య శారదను శనివారం పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. బాధితుడిగా సీసీఎస్ తలుపుతట్టిన లీలాకుమార్ చివరకు నిందితుడిగా మారి జైలుకు వెళ్లాడని అధికారులు చెప్తున్నారు. వ్యాపారంలో భాగస్వామ్యం పేరుతో పరిచయస్తులు, స్నేహితులు, ఇతర వ్యాపారులు.. ఇలా అనేక మందికి వల వేసే లీలాకుమార్.. ప్రాథమికంగా వారి స్థిరాస్తులపై హక్కులు సాధిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఆపై ఈ పత్రాల ఆధారంగా వివిధ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. ఆనక తమ ‘పార్ట్నర్స్’ను మోసం చేయడంతో పాటు కొందరికి మాత్రం భాగస్వామ్యం ఇస్తున్నట్లు కొన్ని పత్రాలనూ ఇచ్చినట్లు సీసీఎస్ అధికారులు చెప్తున్నారు. లీలాకుమార్‌ను లోతుగా విచారించిన అధికారులు ఇలా ఇటు వ్యక్తులు, అటు బ్యాంకుల్ని ఒక్కడే మోసం చేయలేదని భావించారు. దాదాపు రూ.100 కోట్లకుపైగా మోసం చేయడం వెనుక ఎవరో ఒకరు ఉన్నారన్న అనుమానంతో ఆరా తీశారు. ఫలితంగా ఓ వ్యక్తి వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. నేరాన్ని ప్రేరేపించడం, నేరగాళ్లకు సహరించడం తదితర ఆరోపణల కింద ఈ కేసులో ఆ మాస్టర్‌మైండ్‌ను నిందితుల జాబితాలో చేర్చాలని నిర్ణయించారు. దీనికి న్యాయస్థానం అనుమతి అవసరమని యోచిస్తున్న అధికారులు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఆస్తులపై హక్కు కాజేసి, బ్యాంకు రుణాలు పొందడం ద్వారానే కాక వస్త్ర సరఫరాదారుల్నీ లీలాకుమార్ మోసం చేసినట్లు సీసీఎస్ అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా కళానికేతన్ సంస్థకు 21 బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటిలో విక్రయించడానికి అవసరమైన వస్త్రాలను అనేక మంది హోల్‌సేలర్లతో పాటు కంపెనీల నుంచి ఖరీదు చేస్తుంటారు. ఇలాంటి సరఫరాదారులకు లీలాకుమార్ రూ.75 కోట్ల మేర బకాయిపడినట్లు అధికారులు చెప్తున్నారు. నగరంలోని షేక్‌పేట నివాసి ఏవీఎన్ రెడ్డి తనను మోసం చేశాడంటూ లీలాకుమార్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా బాధితుడిగా వచ్చిన ఈయన అసలు వ్యవహారాన్ని దర్యాప్తు నేపథ్యంలో గుర్తించిన అధికారులు మరో కేసుతో నిందితుడిగా మార్చి అరెస్టు చేశారు. కళానికేతన్ శాఖల కోసం తమ దుకాణాలను అద్దెకు ఇచ్చిన వ్యక్తులూ సీసీఎస్‌ను ఆశ్రయిస్తున్నారు. వస్త్ర దుకాణాలను రాత్రికి రాత్రే మూసేసి అద్దె చెల్లించకుండా మోసం చేశారని వాపోతున్నారు. ఏవీఎన్ రెడ్డి ఫిర్యాదుతో నమోదైన కేసులో తదుపరి విచారణ నిమిత్తం నిందితుల్ని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీసీఎస్ అధికారులు సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. రూ.50 లక్షల మోసానికి సంబంధించి లీలాకుమార్‌పై గత నెల 30న పంజగుట్ట పోలీసుస్టేషన్లో నమోదైన కేసునూ దర్యాప్తు నిమిత్తం స్వీకరించాలని సీసీఎస్ నిర్ణయించింది. -
సెయింట్ డెనిస్‌లో ఆపరేషన్‌లో కీలక దృశ్యాలు