
సాక్షి, ముంబై: పీఎన్‌బీ కుంభకోణంలో కీలక పాత్రధారి, ప్రధాన నిందితుడు, బ్యాంకు మాజీ డిప్యూటీ మేనేజర్ గోకుల్‌నాథ్ శెట్టి గురించి అత్యంత ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఇప్పటికే శెట్టిని అరెస్ట్ చేసిన సీబీఐ ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో సీబీఐ వర్గాలు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
- 2015లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, గీతాంజలి జెమ్స్ అధిపతి మోహుల్ చోక్సీని కలిశారు.
- అదే ఏడాది ఖరీదైన ఇల్లును కొనుగోలు చేశాడు. మలాద్ లింక్ రోడ్‌లో సుమారు రూ. 4కోట్ల 4 బెడ్‌రూం ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు.
- బోరివాలీలో మరొక ఇల్లు కూడా ఉంది, ప్రస్తుతం ఇది అద్దెకు ఇచ్చారు.
- అంతేకాదు తన పూర్వీకుల గ్రామంలో శెట్టి పలు స్థలాలను కూడా కొనుగోలు చేశారు.
- కర్నాటకలోని ముల్కిలో జన్మించిన గోకుల్‌నాథ్ శెట్టి 1981లో క్లర్క్‌గా పీఎన్‌బీలో జాయిన్ అయ్యాడు.
- 2005లో పీఎన్‌బీ ముంబై బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. ఇక్కడే నీరవ్ మోదీ, చోక్సి ఖాతాలు ఉన్నాయి.
- 11 ఏళ్ళ సర్వీసు అనంతరం ఒక్కసారి మాత్రమే ప్రమోషన్ తీసుకున్నాడు.
- అదీ దీర్ఘకాలం క్లర్క్‌గా పనిచేసిన తరువాత, నేరుగా డిప్యూటీ మేనేజర్ స్థాయికి చేరుకున్నాడు.
- నిబంధనల ప్రకారం 2010లో బదిలీ జరగాల్సి ఉన్నా..2017లో రిటైర్ అయ్యేదాకా అదే పదవిలో కొనసాగడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment