ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆయనే కీలక సూత్రధారి: ఈడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఆరు రోజులపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడీకి అప్పగిస్తూ రౌజ్‌అవెన్యూ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేజ్రీవాల్‌ను ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టాలని ఈడీని ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా ఆదేశించారు.
మద్యం కుంభకోణంలో విచారణ కోసం కేజ్రీవాల్‌ను 10 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ విజ్ఞప్తి చేయగా, న్యాయస్థానం కేవలం ఆరు రోజులపాటు కస్టడీకి అనుమతించింది. కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు గురువారం రాత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పటిష్టమైన భద్రత మధ్య ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనలు వినిపించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం వెనుక ఉన్న అసలు కుట్రదారు, కీలక సూత్రధారి అరవింద్ కేజ్రీవాలేనని తేలి్చచెప్పారు. ఆయనతోపాటు పలువురు ఢిల్లీ మంత్రులు, ఆమ్ ఆద్మీ పారీ్టలు నేతలు ఈ కేసులో భాగస్వాములేనని స్పష్టం చేశారు. ఢిల్లీలో 2021–22లో నూతన లిక్కర్ పాలసీని రూపొందించి, అమలు చేసినందుకు గాను ‘సౌత్ గ్రూప్’ నుంచి కేజ్రీవాల్ కోట్లాది రూపాయలు ముడుపులుగా స్వీకరించారని ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా దృష్టికి తీసుకొచ్చారు.
సౌత్ గ్రూప్‌కు చెందిన కొందరు నిందితుల నుంచి రూ.100 కోట్ల మేర వసూలు చేశారని వెల్లడించారు. నాలుగు హవాలా మార్గాల్లో అందిన రూ.45 కోట్లను గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. మిగిలిన సొమ్ము ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలకు నగదు రూపంలో అందిందని తెలిపారు. నిందితులు, సాకు‡్ష్యల కాల్ డిటైల్ రికార్డులు(సీడీఆర్), స్టేట్‌మెంట్లు ఇదే విషయాన్ని నిరూస్తున్నాయని తెలియజేశారు. అవినీతి కోసం కేజ్రీవాల్ తన పదవిని వాడుకున్నారని పేర్కొన్నారు.
లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను ప్రశ్నించి, మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని, అందుకే ఆయనను 10 రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానానికి ఎస్.వి.రాజు విజ్ఞప్తి చేశారు. అరవింద్ కేజ్రీవాల్ తరపున సీనియర్ అడ్వొకేట్ అభిõÙక్ మనూ సింఘ్వీ హాజరయ్యారు. ‘‘సిట్టింగ్ సీఎంను అరెస్టు చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయాల్సిన అవసరమే లేదు. కేజ్రీవాల్ తప్పు చేశారనేందుకు ఎలాంటి సాక్ష్యాలూ లేవు’’ అని వాదించారు.
సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరణ
మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఉపసంహరించుకున్నారు. దీనిపై విచారణ చేపడతామని ఉదయమే సుప్రీంకోర్టు వెల్లడించగా పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కేజ్రీవాల్ తరఫున అభిõÙక్ సింఘ్వీ మధ్యాహ్నం కోర్టుకు తెలిపారు. ఇదే కేసులో నిందితురాలైన బీఆర్‌ఎస్ నేత కవిత బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు నిరాకరించిన కాసేపటికే కేజ్రీవాల్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం గమనార్హం. ట్రయల్ కోర్టులో విచారణ తర్వాత మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సింఘ్వీ చెప్పారు.
జైల్లో ఉన్నా సీఎంగా కొనసాగుతా
తన జీవితం దేశ సేవకే అంకితమని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం కోర్టు నుంచి బయటికొచ్చాక ఆయన మీడియాతో మాట్లా డారు. జైలు బయట ఉన్నా, లోపలున్నా సీఎంగా కొనసాగుతానని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment