Conspirator
-
కేజ్రీవాలే అసలు కుట్రదారు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఆరు రోజులపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడీకి అప్పగిస్తూ రౌజ్‌అవెన్యూ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేజ్రీవాల్‌ను ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టాలని ఈడీని ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా ఆదేశించారు. మద్యం కుంభకోణంలో విచారణ కోసం కేజ్రీవాల్‌ను 10 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ విజ్ఞప్తి చేయగా, న్యాయస్థానం కేవలం ఆరు రోజులపాటు కస్టడీకి అనుమతించింది. కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు గురువారం రాత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పటిష్టమైన భద్రత మధ్య ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనలు వినిపించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం వెనుక ఉన్న అసలు కుట్రదారు, కీలక సూత్రధారి అరవింద్ కేజ్రీవాలేనని తేలి్చచెప్పారు. ఆయనతోపాటు పలువురు ఢిల్లీ మంత్రులు, ఆమ్ ఆద్మీ పారీ్టలు నేతలు ఈ కేసులో భాగస్వాములేనని స్పష్టం చేశారు. ఢిల్లీలో 2021–22లో నూతన లిక్కర్ పాలసీని రూపొందించి, అమలు చేసినందుకు గాను ‘సౌత్ గ్రూప్’ నుంచి కేజ్రీవాల్ కోట్లాది రూపాయలు ముడుపులుగా స్వీకరించారని ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా దృష్టికి తీసుకొచ్చారు. సౌత్ గ్రూప్‌కు చెందిన కొందరు నిందితుల నుంచి రూ.100 కోట్ల మేర వసూలు చేశారని వెల్లడించారు. నాలుగు హవాలా మార్గాల్లో అందిన రూ.45 కోట్లను గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. మిగిలిన సొమ్ము ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలకు నగదు రూపంలో అందిందని తెలిపారు. నిందితులు, సాకు‡్ష్యల కాల్ డిటైల్ రికార్డులు(సీడీఆర్), స్టేట్మెంట్లు ఇదే విషయాన్ని నిరూస్తున్నాయని తెలియజేశారు. అవినీతి కోసం కేజ్రీవాల్ తన పదవిని వాడుకున్నారని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను ప్రశ్నించి, మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని, అందుకే ఆయనను 10 రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానానికి ఎస్.వి.రాజు విజ్ఞప్తి చేశారు. అరవింద్ కేజ్రీవాల్ తరపున సీనియర్ అడ్వొకేట్ అభిõÙక్ మనూ సింఘ్వీ హాజరయ్యారు. ‘‘సిట్టింగ్ సీఎంను అరెస్టు చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయాల్సిన అవసరమే లేదు. కేజ్రీవాల్ తప్పు చేశారనేందుకు ఎలాంటి సాక్ష్యాలూ లేవు’’ అని వాదించారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరణ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఉపసంహరించుకున్నారు. దీనిపై విచారణ చేపడతామని ఉదయమే సుప్రీంకోర్టు వెల్లడించగా పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కేజ్రీవాల్ తరఫున అభిõÙక్ సింఘ్వీ మధ్యాహ్నం కోర్టుకు తెలిపారు. ఇదే కేసులో నిందితురాలైన బీఆర్ఎస్ నేత కవిత బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు నిరాకరించిన కాసేపటికే కేజ్రీవాల్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం గమనార్హం. ట్రయల్ కోర్టులో విచారణ తర్వాత మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సింఘ్వీ చెప్పారు. జైల్లో ఉన్నా సీఎంగా కొనసాగుతా తన జీవితం దేశ సేవకే అంకితమని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం కోర్టు నుంచి బయటికొచ్చాక ఆయన మీడియాతో మాట్లా డారు. జైలు బయట ఉన్నా, లోపలున్నా సీఎంగా కొనసాగుతానని స్పష్టం చేశారు. -
PAK: 26/11 దాడులు.. ప్రధాన సూత్రధారి మృతి
ఇస్లామాబాద్: భారత్‌కు పీడకలగా మిగిలిపోయిన 2008 ముంబై దాడుల(26/11) ప్రధాన సూత్రధారి, లష్కర్ ఏ తాయిబా సీనియర్ కమాండర్ అజమ్ ఛీమా గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌లో ఛీమా మరణించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు విశ్వసనీయ సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఇతడి అంత్యక్రియలు ఫైసలాబాద్‌లోని మల్కన్‌వాలాలో పూర్తయ్యాయి. కేవలం 26/11 దాడులే కాకుండా 2006లో ముంబైలోనే 188 మంది మృతికి కారణమైన రైళ్లలో బాంబు పేలుళ్ల వెనుక ప్రధాన కుట్రదారుడు ఛీమాయేనని అప్పట్లో తేల్చారు. ఈ పేలుళ్లలో 800 మంది దాకా గాయపడ్డారు. అజమ్ ఛీమా అమెరికా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలోనూ ఉన్నాడు. కాగా, 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో మొత్తం 10 మంది పాకిస్థాన్ టెర్రరిస్టులు పాల్గొన్నారు. వీరు సముద్ర మార్గం ద్వారా అక్రమంగా దక్షిణ ముంబైలోకి ప్రవేశించి తాజజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌తో పాటు నగరంలోని పలు రద్దీ ప్రాంతాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 18 మంది పోలీసులతో పాటు మొత్తం 166 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఆరుగురు అమెరికన్లు ఉండటంతో ఛీమా పేరను అమెరికా తన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది. ఇదీ చదవండి.. అమెరికాలో మరో భారతీయుడి దారుణ హత్య -
లోక్‌సభలో దాడి ఘటన.. పట్టుబడ్డ ఆగంతకుల నేపథ్యం ఇదే..!
లోకసభలోకి ఆరుగురు ఆగంతకులు చొరబడి సృష్టించిన అలజడి యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఒక్కసారిగా సరిగ్గా అదే రోజు (2001 డిసెంబర్ 13)22 ఏళ్ల క్రితం పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడికి యత్నించిన ఉదంతం కళ్లముందు మెదిలింది. అలాంటి ఉగ్రదాడేనా! అని అనుమానాలు లేవెనెత్తాయి. రెండు దశాబ్దాల కిందట జరిగిన దాడే మాయని మచ్చలా చాన్నాళ్లు వెంటాడింది. అది మరువక మునుపే కొత్తగా ఆధునాతన హంగులతో తీర్చిదిద్దిన పార్లమెంటు వద్ద మళ్లీ అలాంటి కల్లోలం అందర్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. పార్లమెంటు ప్రాంగణం లేదా బయట వైపు కాకుండా ఏకంగా దిగువసభలోకే ఆగంతకులు చొరబడటం పార్లమెంట్‌లోని భద్రతా వైఫల్యం గురించి అనుమానాలు లేవనెత్తింది . అదీగాక ప్రధాని నరేంద్ర మోదీ ఈ కొత్త పార్లమెంట్ తీర్చిదిద్దిన విధానం గురించి ఎంతలా ప్రచారం చేశారో కూడా తెలిసిందే. ఈ కొత్త పార్లమెంట్ ప్రారంభమైంది కూడా ఈ ఏడాది మేలోనే, ఇంతలోనే ఈ దాడి అందర్నీ తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. అయితే ఈ పార్లమెంట్‌లోకి చొరబడ్డ ఆ ఆగంతకుల్లో కొందరీ బ్యాగ్రౌండ్ మాములగా లేదు. వారి నేపథ్యం విని అధికారులే ఆశ్చర్యపోయారు. ఇంతటి ఉన్నత విద్యావంతులు ఇలాంటి దారుణానికి ఎందుకు దిగారంటే.. కట్టుదిట్టమైన బందోబస్తు ఉండే పార్లమెంటు మూడంచెల భద్రత వ్యవస్థను ఇద్దరు సామాన్యులు ఏమార్చారు. బూట్లలో పొగ గొట్టాలు దాచుకుని మరీ బుధవారం సాధారణ సందర్శకుల్లా దర్జాగా లోక్‌సభ గ్యాలరీలోకి ప్రవేశించారు. జీరో అవర్ కొనసాగుతుండగా గ్యాలరీలోంచి సభా ప్రాంగణంలోకి దూకి.. స్పీకర్ స్థానంకేసి దూసుకెళ్లి కలకలం రేపారు. ‘నిరంకుశత్వం నశించాలి, నల్ల చట్టాలు పోవాలని నినదిస్తూ, పొగ గొట్టాలను విసిరేశారు. వాటి నుంచి వచ్చిన పసుపు రంగు పొగతో ఎంపీలు భయాందోళనలకు లోనయ్యారు. చివరికి వారే చొరవ చేసి ఇద్దరినీ నిర్బంధించారు. అదే సమయంలో పార్లమెంటు ఆవరణ బయట కూడా ఇద్దరు వ్యక్తులు పొగ గొట్టాలు విసిరి కలకలం రేపారు. వారినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురికీ మరో ఇద్దరు కూడా సహకరించినట్టు దర్యాప్తులో తేలింది. వాళ్లెవరంటే..? పార్లమెంటు ఆవరణలో పొగ గొట్టాలు విసిరి పట్టుబడ్డ వారిని హరియాణాలోని హిస్సార్‌కు చెందిన నీలమ్ (42), మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన అమోల్ షిండే (25)గా గుర్తించారు. వీరికి, మనోరంజన్, సాగర్లకు లలిత్, విశాల్ అనే మరో ఇద్దరు కూడా సహకరించినట్టు ఢిల్లీ పోలీసులు తేల్చారు. విక్కీ శర్మను గురుగ్రాంలో పట్టుకున్నారు. ఐదుగురినీ లోతుగా విచారిస్తున్నారు. ఆరుగురూ గ్యాలరీలోకి వెళ్లాలనుకున్నా ఇద్దరికే పాస్ దొరికినట్టు సమాచారం. వీరందరికీ కనీసం నాలుగేళ్లుగా పరిచయముందని, సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉండేవారని చెబుతున్నారు. అంతాకొంతకాలంగా గురుగ్రాంలో విక్కీ శర్మ ఇంట్లో నే ఉంటున్నట్టు విచారణలో తెలిసింది. ఆగంతకుల బ్యాగ్రౌండ్... పట్టుబడ్డ నిందుతుల్లో నీలమ్ రీసెర్చ్ ప్రోగ్రాంలో ఎం.ఫిల్ పూర్తి చేసింది. అలాగే టీచింగ్ ఉద్యోగం కోసం నిర్వహించే సెంట్రల్ ఎగ్జామినేషన్‌లో కూడా పాసయ్యింది. కానీ ఉద్యోగం లేదు. ఉన్నత విద్యావంతురాలైనప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో నీలమ్ తీవ్ర డిప్రెషన్‌కి లోనయ్యినట్లు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంత చదువుకున్నా.. సరైన ఉద్యోగం లేదు రోజుకు రెండుపూట్ల తిండి కూడా తినలేకపోతున్నానని ఆవేదన చెందేదని, తరుచుగా చనిపోతానని ఏడ్చేదని నీలమ్ తల్లి చెబుతోంది. ఆమె సోదరుడు రామ్నివాస్ నీలమ్‌కి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, కానీ ఆమె ఎందుకిలా చేసిందనేది కూడా మాకు తెలియదు. తమ బంధువులు ఫోన్ చేసి టీవి చూడమని చెప్పేంత వరకు తమకు దీని గురించి తెలియదని అన్నాడు. నీలమ్ పోటీపరీక్షలకు ప్రీపేర్ అయ్యేందకు హర్యానాలో జింద్‌కు వెళ్లినట్లు తెలిపారు. ఆమె బీఏ, ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేసింది. పైగా నెట్లో కూడా మంచి ఉత్తీర్ణతతో పాసయ్యింది. ప్రస్తుతం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు కూడా ప్రిపరవ్వుతుందని ఆమె కుటుంబసభ్యలు చెబుతున్నారు. కాగా నీలమ్ తరచూ నిరసనల్లో నిరుద్యోగ సమస్యను లేవనెత్తుతుండేదని, పైగా మూడు వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సమీపంలో ఏడాదిపాటు జరిగిన రైతుల నిరసనలో కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఇక మరో నిందితుడు మనోరంజన్(34) మైసూర్‌కి చెందినవాడు. కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్. అతడి తండ్రి దేవరాజేగౌడ మాట్లాడుతూ.. తన కొడుకు ఏదైనా తప్పు చేసి ఉంటే ఉరి తీయాలని అన్నారు. పార్లమెంటు మాది... మహాత్మా గాంధీ నుంచి జవహర్లాల్ నెహ్రూ వరకు చాలా మంది ఆ ఆలయాన్ని నిర్మించారు.. నా కొడుకు అయినా ఆ గుడి విషయంలో ఎవరైనా ఇలా ప్రవర్తించడం ఆమోదయోగ్యం కాదు అని నిందుతుడి తండ్రి పేర్కొనడం గమనార్హం. నీలం అజాద్‌తో కలసి పార్లమెంట్ వెలుపల పొగ గొట్టలు విసిరిన అమోల్ షిండే మహారాష్ట్రలోని లాతూర్ గ్రామానికి చెందిన వాడు. అతడి తల్లిదండ్రులు కూలీలు. పోలీసు, ఆర్మీ రిక్రూట్మెంట్ వంటి పోటీ పరీక్షల్లో చాలా సార్లు విఫలమయ్యాడని అతడి తల్లిదండ్రులు తెలిపారు. అతను పోలీస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌కి వెళ్తున్నట్లు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లినట్లు అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. అలాగే లక్నో నివాసి, సాగర్ శర్మ, అతనితో సహా అతని కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నారు. శర్మ జీవనోపాధి కోసం ఇ-రిక్షా కూడా నడుపుతున్నాడు. నిరసనలో పాల్గొనేందుకు రెండు రోజుల పాటు ఢిల్లీకి వెళతానని చెప్పినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. చివరిగా ఆ నిందితులకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన విక్కీ శర్మ అతడి భార్య రేఖను కూడా అదుపులో తీసుకున్నారు. విక్కీ ఎగుమతుల కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారందరిపై పోలీసులు ఉగ్రవాద నిరోధక చట్ట కింద కేసులు నమోదు చేశారు. ఆ ఆగంతుకులు ఒక్కొకరిది ఒక్కో నేపథ్యం. కానీ వారంతా ఎంతోకొంత చదువుకున్న వారు. సామాజిక అంశాల పట్ల అవగాహన ఉన్నవాళ్లు, ఏదీ మంచి ఏదీ చెడు తెలిసిన వివేకవంతులే. కానీ ఇలా తాము ఎదుర్కొన్న పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలతో తప్పుడు దోవ ఎంచుకున్నారో లేక మరేవరి ప్రమేయం లేదా ప్రభావం ఉందో తెలియదు గానీ చాలామంది యువత ఇలానే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తమ వాళ్లకు అన్యాయం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే అన్యాయమైపోయిన వాడు తనలా మరెవరు కాకుడదన్న మనస్తత్వంతో ఉండాలి. తనను నమ్ముకున్నవాళ్లు లేదా తనపై ఆధారపడిన వాళ్ల గురించి అయినా ఆలోచించాలి. ఇలాంటి మార్గంలో మాత్రం పయనించడు. దీన్ని యువత గుర్తించుకోవాలి. మన చుట్టు ఉన్నవాళ్లలో చాలామంది దారుణమైన పరిస్థితుల్లో పెరిగి నెగ్గుకొచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. అంతెందుకు మన రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ఎంతటి దారిద్యాన్ని అనుభవించాడో తెలిసిందే. ఆ రోజుల్లోనే అతను అందరికంటే ఉన్నత విద్యాను అభ్యసించాడు అయినా వెనుకబడి కులం వాడన్న ఒక్క కారణంతో హేళనలకు గురిచేశారు. అంటరానివాడని అవమానించారు. కనీసం సాటి మనిషిలా కూడా గౌరవం ఇవ్వకపోయినా తట్టుకుని నిలబడి ఛీత్కారంతో చూసిన వారిచేత శభాష్ అని సలాం కొట్టించుకున్నాడు. ఇలాంటి ఎందరో మహనీయుల మన మాతృభూమికి మంచి పేరుతెచ్చి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. దేశానికి యువత ఓ ఆయుధం. వారు దేశాన్ని అభివృద్ధిపథంలోకి నడిపించేలా ఉండాలి కానీ కానీ కళంకంలా ఉండకూడదు. కఠిన పరిస్థితులను తట్టుకుని రాటుదేలి.. మహనీయుడిలా మారాలే కానీ అలజడులు సృష్టించే ఉగ్రవాదులు లేదా నేరస్తులుగా మారకూడదు. (చదవండి: లోక్‌సభకు పొగ) -
ఏమంటారు బాబూ!
సంపాదకీయం తొమ్మిదేళ్ల తన పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని ప్రకటనల మోత మోగిస్తున్న చంద్రబాబు నాయుడు ఖంగు తినేలా ఆయన నిర్వాకం మరోసారి బట్టబయలైంది. బాబు హయాంలో ప్రభుత్వ రంగ సంస్థల విభాగం బాధ్యతలను చూసిన సీనియర్ ఐఏఎస్ అధికారి పీసీ పరేఖ్ తాజాగా వెలువరించిన ‘క్రూసేడర్ ఆర్ కాన్స్పిరేటర్?’ పుస్తకం నిజాం షుగర్స్‌ను బాబు తెగనమ్మిన తీరును సోదాహరణంగా వివరిం చింది. ఐఏఎస్ అధికారిగా రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ వివిధ శాఖల్లో పనిచేసినప్పుడు ఎదురైన ఎన్నో అనుభవాలను ఆయన గ్రంథస్థం చేశారు. తనపై ఎవరు ఆరోపణలు చేసినా బాబు ఒకటే జవాబు చెబుతారు. ‘నాపై ఎన్నో విచారణలు జరిగాయి. ఒక్కదాన్లో కూడా నన్ను తప్పుబట్టలేదు. కోర్టుల్లో ఎన్నో కేసులు వేశారు. అన్నీ కొట్టేశారు. ప్రభుత్వం ఎన్నో సభా సంఘాలను నియమించింది. ఏ ఒక్కటీ నన్ను దోషిగా చెప్పలేదు’ అంటారు. ఈ మాటలన్నిటిలోనూ అర్ధ సత్యాలూ, అసత్యాలూ ఉన్నాయని తరచు నిరూపణ అవుతూనే ఉన్నా ఆయన తన బాణీ మార్చరు. ఇప్పుడు పరేఖ్ పుస్తకం మరొక్కసారి బాబు మాటల్లోని డొల్లతనాన్ని వెల్లడించింది. నిజాం షుగర్స్ సంస్థ చరిత్ర చాలా ఉన్నతమైనది. 90 ఏళ్లనాటి ఆ సంస్థ లక్షలాదిమంది చెరకు రైతులపాలిట కల్పవల్లి. ఎన్నడో 1921లో బోధన్‌లో తొలి యూనిట్ మొదలయ్యాక ఇది ఆరు చక్కెర మిల్లులు, రెండు డిస్టిలరీలుగా విస్తరించింది. తెలంగాణ ప్రాంతంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించిన పరిశ్రమగా పేరుప్రఖ్యాతులున్నాయి. దీనికి నష్టాలొస్తున్నాయన్న సాకుతో 2002లో బాబు ప్రభుత్వం ప్రైవేటీకరిం చింది. నిజాం షుగర్స్ అమ్మకం వ్యవహారం గురించి నిజానికి 2004లోనే కాగ్ నిశితంగా విమర్శించింది. లక్షలాదిమంది రైతుల కల్పవల్లిగా ఉంటున్న ఈ సంస్థ క్రమేపీ నష్టాల్లోకి జారుకుంటున్నప్పుడు ఆదుకోవా ల్సిందిపోయి, పునరుద్ధరించాల్సిందిపోయి నష్టాల సాకుతో 1,042.27 ఎకరాలను కేవలం రూ. 3.35 కోట్లకు రాసి చ్చేసిన వైనాన్ని ఎండగట్టింది. అటు తర్వాత 2006లో సభా సంఘం సైతం యూనిట్ల అమ్మకంలో బాబు ప్రభుత్వం చేసిన మాయను గణాంకాల సహితంగా తూర్పారబట్టింది. రెండేళ్లపాటు విచారణ జరిపి రూపొందించిన విలువైన నివేదిక అది. నిజాం షుగర్స్ సంస్థ ఆస్తులను తెగనమ్మడంలో చాలా లొసుగు లున్నాయి. ప్రపంచబ్యాంకు ఆదేశాలను పొల్లుపోకుండా పాటించడంలో బాబుకు దేశంలోనే ఎవరూ సాటిలేరని వామపక్షాలు అప్పట్లోనే విమర్శించాయి. రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థల ఉసురుతీసి వేలాదిమంది ఉద్యోగులను, వారి కుటుంబాలను వీధులపాలు చేసిన ఘనత బాబుకు దక్కుతుందని వివిధ సందర్భాల్లో ఆ పార్టీలు తెలిపాయి. అయితే, నిజాం షుగర్స్‌ను అమ్మకానికి పెట్టిన తీరు ప్రపంచబ్యాంకు అధికారులకే కళ్లు తిరిగేలా చేసిందని సభా సంఘం వెల్లడించింది. వందల కోట్ల విలువచేసే ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు విక్రయించడా నికి కూడా ఓ పద్ధతి ఉంటుంది. ఓపెన్ టెండర్ విధానంలో బిడ్లను ఆహ్వా నించి వచ్చిన ప్రతిపాదనల్లో మేలైనదేదన్న పరిశీలన చేస్తారు. అనంతరం నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ వేరే పద్ధతి అనుసరించాలంటే అందుకు మంత్రివర్గం ఆమోదం అవసరమవుతుంది. కానీ, నిజాం షుగర్స్ విష యంలో బాబు ఈ క్రమానికి తూట్లు పొడిచారు. అనుకూలమైనవారితో కేబినెట్ సబ్ కమిటీ నియమించి, అడ్వొకేట్ జనరల్ సలహాను సైతం పెడచెవినబెట్టి తాను అనుకున్న వ్యక్తులకు బాబు కట్టబెట్టారు. ఈలోగా తమది ఆపద్ధర్మ ప్రభుత్వంగా మారినా ఎవరికీ తెలియకుండా హడా వుడిగా భూముల్ని బదిలీచేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వానికి ఆరోజుల్లోనే రూ. 300 కోట్ల నష్టం జరిగిందని సభా సంఘం తేల్చింది. ఇప్పుడు ఆ భూముల విలువ వేల కోట్ల రూపాయలుంటుంది. పరేఖ్ ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి వ్యతిరేకి ఏమీ కాదు. ఆర్ధికంగా భారంగా మారిన సంస్థలను అమ్మేస్తేనే ఆర్ధిక సాయం చేస్తామన్న ప్రపంచబ్యాంకు ఆదేశాలతో ఆయనకేమీ పేచీలేదు. అందువల్లే ‘అనేక ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించాక’ నిజాం షుగర్స్ యూనిట్లను బహిరంగ వేలం ద్వారా అమ్మాలని ఆయన నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా రెండు మిల్లులనూ, ఒక డిస్టిలరీని అమ్మారు కూడా. ఆ మూడింటి విషయంలోనూ మెరుగైన ధర లభించిందని, అటు తర్వాతే బాబు సర్కారు జోక్యంతో వ్యవహారం వక్రమార్గంలోకి జారుకున్నదని పరేఖ్ చెబుతున్నారు. నష్టజాతక సంస్థలను అమ్మడమంటే వాటిపై ఆధారపడ్డ వేలాది కుటుంబాలను వీధులపాలు చేయడమేనని ప్రజాస్వామిక సంస్థలు విశ్వసిస్తాయి. నష్టాలకు దారితీస్తున్న పరిస్థితులను నిజాయితీగా అధ్యయనంచేసి, తగిన చర్యలు తీసుకుంటే అలాంటి సంస్థలు మళ్లీ పునరుజ్జీవం పొంద డం సాధ్యమేనని చెబుతాయి. ఈ వాదనతో విభేదించే పరేఖ్వంటివారిని కూడా బాబు చర్యలు ఆశ్చర్యపరిచాయి. ఇందులోకి గోల్డ్‌స్టోన్ ఎక్స్‌పోర్ట్స్ అనే సంస్థ హఠాత్తుగా చొరబడటం, నిబంధనల బాదరబందీ లేకుండా ఆస్తులన్నిటినీ ఆ సంస్థకు నామమాత్రపు ధరకు కట్టబెట్టడం ఆయనను దిగ్భ్రమపరిచింది. అసలు నిజాం షుగర్స్ సంస్థ నష్టాల్లోకి జారుకున్న తీరుపై విచారణ జరిపిస్తే ఇంతకన్నా దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఒక్క నిజాం షుగర్స్ అనే కాదు...రిపబ్లిక్ ఫోర్జ్, చిత్తూరు, ఒంగోలు, విశాఖ డెయిరీలు, ఆల్విన్ వంటి ఎన్నో సంస్థలు హఠాత్తుగా నష్టాల్లోకి జారుకుని నాశనమైపోయాయి. ఏ ప్రయోజనాలాశించి, ఎవరిని ఉద్ధరించడానికి వీటన్నిటి ఉసురూ తీశారో, లక్షలాదిమందిని రోడ్లపాలు చేశారో బాబు సంజాయిషీ ఇవ్వాలి. ‘ఆయనొస్తేనే ఉద్యోగాలొస్తాయండీ...’అని చానెళ్లలో ఊదరగొడుతున్నం దుకైనా తన సచ్చీలత ఏపాటిదో నిరూపించుకోవాలి.