ఢాకా: ఢాకా కేఫ్లో ఊచకోత వెనుక సూత్రదారి హతమయ్యాడు. బంగ్లాదేశ్ రాజధానిలో శనివారం ఉదయం బలగాలు జరిపిన సోదాల్లో తారసపడిన మొనిరుల్ ఇస్లామ్ చీఫ్ తమిమ్ అహ్మద్ చౌదురి కాల్పులు జరపగా ప్రతిగా బలగాలు జరిపిన కాల్పుల్లో అతడు హతమయ్యాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ అధికారులు స్పష్టం చేశారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ఉగ్రవాద నిరోధక దళం, ట్రాన్స్నేషనల్ క్రైమ్ యూనిట్ ఉమ్మడిగా నారాయణ్ గంజ్ సదార్ ప్రాంతంలో కార్డన్ సెర్చ నిర్వహించారు.
ఈ ప్రాంతంలో కొంతమంది ఉగ్రవాదులు, మోనిరుల్ ఇస్లాం చీఫ్ తలదాచుకున్నారని సమాచారం తెలియడంతో గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో గుంపుగా ఉన్న ఉగ్రవాదులు బలగాలకు తారసపడి కాల్పులు జరిపారు. దీంతో బలగాలు జరిపిన ప్రతిదాడుల్లో మోనిరుల్ ఇస్లామ్ చీఫ్ తమిమ్ మరికొందరు హతమయ్యారు. ఢాకాలోని ఆర్టిసన్ బేకరీపై ఈ ఏడాది (2016) జూలై 1న కొంతమంది ఉగ్రవాదులు దాడులు చేసి 22మందిని అత్యంత దారుణంగా గొంతుకోసి చంపిన విషయం తెలిసిందే. ఈ దాడులకు సంబంధించిన మాస్టర్ మైండ్ కెనడా సంతతికి చెందిన బంగ్లాదేశీయుడు తమిమ్ అని పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి అతడి కోసం గాలిస్తుండగా చిక్కి చివరకు హతమయ్యాడు.
గొంతులు కోయించిన మాస్టర్మైండ్ చచ్చాడు
Published Sat, Aug 27 2016 12:23 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
Advertisement
Advertisement