
వచ్చే నెల 25న సంజయ్ దత్ విడుదల
ముంబై: 1993నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వచ్చే నెల 25న విడుదల కానున్నారు. మంచి ప్రవర్తన కారణంగా శిక్ష గడువుకంటే 103 రోజులు ముందుగానే ఆయనను విడుదల చేస్తున్నట్లు పుణేలోని యరవాడ జైలు అధికారి ఒకరు చెప్పారు.