
తొలి సినిమా హిట్టు కొడితే ఆ కిక్కే వేరు. మహేశ్ మంజ్రేకర్ (Mahesh Manjrekar) వాస్తవ్ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అందుకున్నాడు. అయితే ఆ సినిమా కథను సంజయ్ దత్‌కు చెప్పడానికి ముందు మద్యం తాగాడట! ఈ విషయాన్ని తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
ముందుగా రెండు పెగ్గులేసి..
'వాస్తవ్ కథను సంజయ్ దత్ (Sanjay Dutt)కు చెప్పడం కోసం ఆయన అపాయింట్‌మెంట్ తీసుకున్నాను. ఆయన్ను కలవడానికి ముందు ఓ రెస్టారెంట్‌కు వెళ్లి రెండు పెగ్గులేశాను. వెయిటర్ దగ్గరున్న నోట్‌ప్యాడ్ తీసుకుని అందులో కథలో కీలకమైన అంశాలు రాసుకున్నాను. ఆల్‌రెడీ కథంతా నా మెదడులో ఉంది కాబట్టి కొన్ని పాయింట్స్ రాశాక సంజయ్ దగ్గరకు వెళ్లాను. దుష్మన్ సినిమా సెట్‌లో ఆయన్ను కలిశాను. ఆయన ఓ డైరెక్టర్‌తో మాట్లాడుతుండగా వెనకాల నిల్చున్నాను.
ఇక్కడేం చేస్తున్నావ్?
సడన్‌గా నన్ను చూసి నువ్విక్కడేం చేస్తున్నావ్? అన్నాడు. కచ్చితంగా తిడతాడేమో అనుకున్నాను. అక్కడున్నవారెవరికీ నేను తెలియదు. నన్ను కూర్చోమని కూడా ఎవరూ చెప్పలేదు. అంత పెద్ద సినిమా సెట్‌కు వెళ్లడం అదే నాకు మొదటిసారి. సంజయ్ విరామం లేకుండా షూటింగ్‌లో పాల్గొంటూనే ఉన్నాడు. ఛాన్స్ మిస్ అయితే మళ్లీ దొరకదన్న భయంతో ఆయన వెనకాలే తిరుగుతున్నాను. నన్ను గమనించి.. నీకు కథ చెప్పడానికి ఎంత సమయం పడుతుంది? అన్నాడు. పది నిమిషాల కంటే ఎక్కువ పట్టదని బదులిచ్చాను.

పదినిమిషాలు కాస్తా గంటగా..
అలా అతడి గదిలోకి వెళ్లి వాస్తవ్ కథ (Vaastav: The Reality Movie) చెప్పడం మొదలుపెట్టా.. ఐదు నిమిషాలయ్యాక గదిలో ఉన్న మిగతా అందర్నీ బయటకు వెళ్లమన్నాడు. గంటన్నరపాటు కథ చెప్పాను. ఆయనకు చాలా నచ్చింది. షూటింగ్ మొదలైంది.. అయితే వారానికి ఒకరోజు సంజయ్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేసింది. ఆ రోజు చేయాల్సిన షూటింగ్‌ను అర్ధరాత్రైనా సరే పూర్తి చేసేవాళ్లం. 35% షూటింగ్ అయ్యాక నిర్మాత తన దగ్గర డబ్బు లేదని చేతులెత్తేశాడు. అప్పటివరకు షూటింగ్ చేసిన సీన్స్ ఎలా వచ్చాయోనని రష్ చూశాను. ఏమీ బాగోలేదు. షూటింగ్ ముందుకు సాగలేదు.
సినిమా రైట్స్ అమ్మిన డబ్బుతో..
ఏడాదిపాటు ఎలాంటి ముందడుగు లేకపోవడంతో సినిమా అటకెక్కిందన్న ప్రచారం జరిగింది. ఒక రోజు నిర్మాత శ్యామ్ ష్రాఫ్.. సినిమా రష్ చూసి బాగుందన్నాడు. రూ.50 లక్షలు పెట్టి బాంబే హక్కులు కొనుగోలు చేశాడు. అడ్వాన్స్‌గా రూ.25 లక్షలు చేతిలో పెట్టాడు. దీంతో షూటింగ్ పునఃప్రారంభించాం. ఆ డబ్బు అయిపోయాక మిగతాచోట్ల రైట్స్ అమ్మాం.. ఈ పద్ధతిని ఫాలో అవుతూ వాస్తవ్ పూర్తి చేశాం. సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడ్డారు' మహేశ్ అని చెప్పుకొచ్చాడు.
వాస్తవ్ విశేషాలు
వాస్తవ్ సినిమా విషయానికి వస్తే.. సంజయ్‌దత్, నమ్రత శిరోద్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు. పరేశ్ రావల్, దీపక్, సంజయ్ నర్వేకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ 1999 అక్టోబర్‌లో విడుదలైంది. వాస్తవ్ హిట్టవడంతో దర్శకుడు మహేశ్ దీనికి సీక్వెల్‌గా హత్యార్ తీశాడు. ఇందులోనూ సంజయ్ దత్ హీరోగా నటించాడు.
చదవండి:కూతురి ఫోటోల్ని డిలీట్ చేసిన ఆలియా భట్! ఆ కారణం వల్లే!
Comments
Please login to add a commentAdd a comment