mahesh manjrekar
-
టాలీవుడ్ విలన్‌కి ఇంత అందమైన కూతురు.. ఈమెని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
'యాత్ర 2' సినిమా... చంద్రబాబు పాత్రలో ఆ విలన్!
ఆంధ్రప్రదేశ్ ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా 'యాత్ర 2'. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంపై వచ్చిన 'యాత్ర' చిత్రానికి ఇది సీక్వెల్. ఇప్పటికే షూటింగ్ చివరి దశకొచ్చేసింది. అయితే ఇందులో చంద్రబాబు పాత్రని విలన్ తరహా పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఓ నటుడు చేస్తున్నాడు. ఇంతకీ అతడెవరో తెలుసా? (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) యాత్ర 2 సంగతేంటి? 'యాత్ర' సినిమా తీసిన మహీ వి రాఘవనే.. యాత్ర 2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తొలి భాగం విడుదలైన ఫిబ్రవరి 8న వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. జగన్ పాత్రలో తమిళ హీరో జీవా, వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ సినిమాలో 2009-19 మధ్య జరిగే సంఘటనల్ని కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు. చంద్రబాబు పాత్రలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర కూడా 'యాత్ర 2' సినిమాలో ఉంది. దీనికోసం బాలీవుడ్ స్టార్ మహేశ్ మంజ్రేకర్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. హావభావాల విషయంలో మహేశ్ మంజ్రేకర్‌కి దర్శకుడు ట్రైనింగ్ ఇచ్చారని, ప్రస్తుతం సీన్స్ షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగులో అదుర్స్, సాహో, గుంటూరు టాకీస్ తదితర చిత్రాాల్లో మహేశ్ మంజ్రేకర్ నటించాడు. ఇతడి కూతురు సయీ మంజ్రేకర్ ప్రస్తుతం హీరోయిన్ గా చేస్తోంది. (ఇదీ చదవండి: గ్రాండ్‌గా ఆ హీరోహీరోయిన్ నిశ్చితార్థం.. త్వరలో పెళ్లి కూడా) -
గే రిలేషన్షిప్లో కొడుకు? నా నిర్ణయం అదే: 'అదుర్స్' విలన్
ఒకప్పడు 'గే' అనే మాట వినపడితే చాలు జనాలు అదో రకంగా చూసేవాళ్లు. ప్రస్తుతం కొంతమేర పరిస్థితులు మారాయని చెప్పొచ్చు. చాలా తక్కువలో తక్కువ వాళ్లని కొందరు మనుషుల్లా చూస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయమై ఓ సీనియర్ నటుడు డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఏకంగా తన కొడుకు గురించి ప్రస్తావిస్తూ మాట్లాడటంతో ఇదికాస్త చర్చనీయాంశంగా మారిపోయింది. (ఇదీ చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? ఆ తెలుగు హీరోకి భార్య..) గే రిలేషన్లో కొడుకు? 'ఒకప్పుడు హోమో సెక్సువల్ రిలేషన్షిప్(అబ్బాయి-అబ్బాయి, అమ్మాయి-అమ్మాయి మధ్య ప్రేమ)ని ఎవరూ అంగీకరించేవాళ్లు కాదు. దీంతో చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు కొంతమేర ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు నా కొడుకు నా దగ్గరకొచ్చి.. 'నాన్న నేను గే రిలేషన్షిప్'లో ఉన్నానని చెప్పినా ఒప్పుకుంటాను. ఎందుకంటే అది అతడి జీవితం. అతడికి నచ్చినట్లు బతకాలని నేను కోరుకుంటాను. నా కూతురు ఇలాంటి బంధంలో ఉన్నాసరే నాకేం అభ్యంతరం లేదు' అని నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. అక్కడ మాట్లాడుతూ? 'అదుర్స్', 'గుంటూరు టాకీస్' తదితర సినిమాల్లో విలన్ గా నటించిన మహేశ్ మంజ్రేకర్ గురించి తెలుగులో ప్రేక్షకులకు కొంతవరకు తెలుసు. ప్రస్తుతం ఆయన నటన కంటే డైరెక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఆయన తీసిన 'ఏక కాలేచ్చి మానీ' వెబ్ సిరీస్ కొన్నిరోజుల ముందు జియో సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. దీని ప్రమోషన్ లో భాగంగానే ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ.. తన కొడుకు-గే రిలేషన్‌పై కామెంట్స్ చేశాడు. దీంతో అవి కాస్త వైరల్ అయిపోయాయి. (ఇదీ చదవండి: చెప్పు తెగుతుందంటూ.. రిపోర్టర్‌పై వైష్ణవి సీరియస్) -
కారుకు సొట్టలు, డ్రైవర్‌ను చాచికొట్టిన ప్రముఖ నటుడు
ముంబై : కారు డ్రైవర్‌పై చెయ్యి చేసుకోవటంతోపాటు అసభ్యంగా తిట్టినందుకుగానూ ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్‌పై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహేశ్ మంజ్రేకర్ శుక్రవారం రాత్రి 11:30 గంటల సమయంలో తన కారులో పుణెనుంచి సోలాపూర్ వెళుతున్నారు. ఓ చోట డ్రైవర్ కైలాష్ సత్పుతే సడెన్ బ్రేక్ వేసి కారును ఆపాడు. దీంతో వెనకాల వస్తున్న వేరే కారు మహేశ్ కారును ఢీకొట్టింది. కొద్ది మొత్తంలో ఆయన కారు సొట్టలు పడింది. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన మహేశ్.. కారు డ్రైవర్‌ను చెంపదెబ్బ కొట్టారు. అంతటితో ఆగకుండా బూతులు తిట్టారు. మనస్తాపానికి గురైన కారు డ్రైవర్ కైలాష్ యావత్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మహేశ్‌పై ఫిర్యాదు చేశాడు. పోలీసులు పలు సెక్షన్ల కింద నటుడిపై కేసులు నమోదు చేసి, విచారణ చేపట్టారు. (చదవండి: తాండవ్‌పై శివాలెత్తుతున్న నెటిజన్లు) -
సయీ.. ఆయా
బాలీవుడ్ భామలు టాలీవుడ్‌కి రావడం కొత్తే కాదు. ఇప్పుడు మరో బ్యూటీ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఆమె ఎవరో కాదు.. పలు తెలుగు చిత్రాల్లో నటించిన నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ కుమార్తె. తండ్రి బాటలో సయీ కూడా తెలుగుకి ఆయా (వచ్చింది) అన్నమాట. ‘మేజర్’ చిత్రం ద్వారా తెలుగు తెరపై కనిపించనుందామె. సల్మాన్ ఖాన్ ‘దబాంగ్–3’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సయీ అందర్నీ ఆకట్టుకున్నారు. అక్టోబర్ నెలలో హైదరాబాద్‌లో జరగనున్న ‘మేజర్’ షూటింగ్లో పాల్గొననున్నారామె. 2008 నవంబర్ 26న జరిగిన ముంబై టెర్రరిస్ట్ దాడుల్లో మృతి చెందిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఉన్నికృష్ణన్ పాత్రలో శేష్ అడివి నటిస్తున్నారు. ఇందులో శోభిత దూళిపాళ్ల హీరోయిన్. సయీ మంజ్రేకర్‌ది కీలక పాత్ర. జి.యం.బి ఎంటర్టైన్మెంట్ పతాకంపై మహేశ్‌బాబు, సోనీ పిక్చర్స్, ఏప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి Ô¶ శికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. -
నలుగురు దర్శకులు నాలుగు ప్రేమకథలు
జాతీయ అవార్డు సాధించిన నలుగురు దర్శకులు (ప్రదీప్ సర్కార్, అనిరుద్ రాయ్ చౌదరి, ప్రియదర్శన్, మహేశ్ మంజ్రేకర్) ఓ ప్రాజెక్ట్ కోసం కలిశారు. నాలుగు భాగాలుగా తెరకెక్కిన ‘ఫర్బిడన్ లవ్’ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ నాలుగు సినిమాల కథాంశాలు ప్రేమ చుట్టూనే ఉంటాయట. ఓటీటీ సంస్థ జీ5 నిర్మించిన ఈ చిత్రాలు ఆ ప్లాట్ఫామ్లోనే విడుదల కానున్నాయి. ‘డయగ్నాసిస్ ఆఫ్ లవ్ ’ విభాగాన్ని మహేశ్ మంజ్రేకర్, ‘రూల్స్ ఆఫ్ ది గేమ్’ను అనిరుద్ రాయ్, ‘అనామిక’ను ప్రియదర్శన్, ‘అరేంజ్డ్ మ్యారేజ్’ను ప్రదీప్ సర్కార్ తెరకెక్కించారు. ఈ నాలుగు భాగాల్లో పూజా కుమార్, అలీ ఫాజల్, రైమా సేన్ వంటి నటులు ఉన్నారు. ఈ నెల 9 నుంచి ఈ ‘ఫర్బిడన్ లవ్’ సిరీస్‌లో ఒక్కో భాగం ఆన్లైన్లో స్ట్రీమ్ కానుంది. -
ప్రముఖ దర్శకుడికి బెదిరింపులు
ముంబై : అబు సలేం గ్యాంగ్‌కు చెందిన సభ్యుడిగా చెప్పుకుంటూ ఓ వ్యక్తి 35 కోట్ల రూపాయలు ఇవ్వాలని తనను డిమాండ్ చేశాడని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేష్ మంజ్రేకర్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేష్ మంజ్రేకర్ ఫిర్యాదును స్వీకరించి దోపిడీ నిరోధక పోలీస్ విభాగానికి బదలాయించినట్టు అధికారులు తెలిపారు. తన మొబైల్ ఫోన్‌కు అబూ సలేం గ్యాంగ్ సభ్యుడి నంటూ గుర్తుతెలియని వ్యక్తి నుంచి రూ. 35 కోట్లు డిమాండ్ చేస్తూ మెసేజ్‌లు వచ్చాయని రెండురోజుల కిందట మంజ్రేకర్ దాదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని అధికారులు తెలిపారు. సున్నితమైన కేసు కావడం, దోపిడీ, బెదిరింపుల ఆరోపణలు రావడంతో ఈ కేసును ముంబై పోలీస్‌కు చెందిన దోపిడీ నిరోధక విభాగానికి బదలాయించామని వెల్లడించారు. ఇక జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకులు మహేష్ మంజ్రేకర్ నిర్ధేశకత్వంలో తెరకెక్కిన వాస్తవ్, అస్తివ, విరుద్ధ్ వంటి సినిమాలకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి.. కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన 34 ఏళ్ల వ్యక్తి అబూ సలేం ముఠా సభ్యుడిగా పేర్కొంటూ మహేష్ మంజ్రేకర్‌ను బెదిరించినట్టు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు మహారాష్ట్రలోని ఖేడ్ జిల్లాకు చెందిన మిలింద్ తుసంకర్‌గా పోలీసులు గుర్తించారు. తుసంకర్‌ను పోలీస్ కస్టడీకి తరలించారు. బెదిరింపులు, దోపిడీ యత్నం ఆరోపణలతో తుసంకర్పై కేసు నమోదు చేశారు. చదవండి : నాకు, నా ఫ్యామిలీకి ముప్పు : రియా -
సాయీ.. రావోయీ
బాలీవుడ్ నటుడు చంకీ పాండే కూతురు అనన్య పాండే, విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్యాన్ ఇండియన్ మూవీ ‘ఫైటర్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ (ప్రభాస్ ‘సాహో’ చిత్రంలో ప్రిన్స్ పాత్రధారి) తనయ సాయీ మంజ్రేకర్ టాలీవుడ్‌కు హాయ్ చెప్పబోతున్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకోనున్న సినిమాలో సాయీ మంజ్రేకర్‌ను కథానాయికగా ఎంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ గత ఏడాది నటించిన ‘దబాంగ్ 3’లో సాయీ ఒక హీరోయిన్గా నటించి, తన సిల్వర్‌స్క్రీన్ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత హిందీలో వేరే సినిమాలు ఒప్పుకున్నట్లు లేదు. మరి.. వరుణ్‌తో సాయీ జోడీ కుదిరినట్లేనా? వెయిట్ అండ్ సీ. -
మరో వారసురాలికి సల్మాన్ సాయం..!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్టార్ వారసులను వెండితెరకు పరిచయం చేయటంలో ముందుంటాడు. ఇప్పటికే తన బావమరిది ఆయుష్ శర్మతో పాటు అతియా శెట్టి, సూరజ్ పంచోలి, ప్రనూతన్లను వెండితెరకు పరిచయం చేసిన సల్మాన్ మరో స్టార్ వారసురాలి ఎంట్రీకి సాయం చేస్తున్నాడు. బాలీవుడ్లో పాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్న నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురిని సల్మాన్ పరిచయం చేయనున్నాడు. గతంలో మహేష్ మంజ్రేకర్ కొడుకు సత్య తెరంగేట్రానికి కూడా సల్మాన్ సాయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా కూతురు అశ్వమీని వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను కూడా సల్మాన్ చేతిలోనే పెట్టాడు మంజ్రేకర్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. త్వరలోనే సల్మాన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని తెలిపాడు. -
ఈ డాన్‌బాబాతో జర భద్రం సుమా!
సోనూభాయ్‌కి టైం వేస్ట్ చేయడం అంటే ఎంతమాత్రం ఇష్టం ఉండదు. అందుకే.. ‘టైం వేస్టు చేయకుండా డైరెక్ట్‌గా పాయింట్లోకి వచ్చేస్తాను’ అంటుంటాడు. ‘వందేళ్లు బతకడం కాదు...అందరికీ ఉపయోగపడే పని చేసి...వారి మనసులో వేయేళ్లు బతకాలి’ అని కూడా అంటాడు. ఈ డైలాగ్ విని ‘ఆహా సోనూభాయిది ఎంత విశాల హృదయమో’ అనుకుంటే... చాలా వేగంగా పప్పులో కాలేసినట్లే! ఎందుకంటే సోనూభాయ్‌కి ఆ క్షణంలో పప్పు కావాలంటే పప్పు కావల్సిందే...ఉప్పు కావాలంటే ఉప్పు కావాల్సిందే...వేరొకరి గుండె కావాలంటే కావాల్సిందే... రాజీ పడే సమస్యే లేదు! ‘నా విషయంలో ప్రిన్సిపుల్స్ పక్కన పెట్టకపోతే ప్రాణాలు తీస్తాను’ అనగలగడమే కాదు...అన్నంత పనీ చేస్తాడు. సోనూభాయ్‌కి ఎవరో వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వచ్చాడు. అటు చూడండి... ‘‘వచ్చే వారం మా తమ్ముడి పెళ్లిసార్’’ ‘‘తమ్ముడి పెళ్లి నెక్స్›్ట మంత్ అన్నావు కదరా’’ ‘‘అంటే మీరు కూడా రావాలని...’’ ‘‘అంటే... ఈలోపే నేను చనిపోతాననుకున్నావా? చనిపోతాననుకున్నావా??’’ చూశారు కదా... సోనుభాయికి ఎంత క్లారిటీ ఉందో! ‘ఒక్కడున్నాడు’ సినిమా ద్వారా సోనూభాయ్గా తెలుగు వెండితెరకు పరిచయం అయిన మహేష్ మంజ్రేకర్ ‘అదుర్స్’ సినిమాలో ‘డాన్బాబా’గా మరింత దగ్గరయ్యారు. ∙∙ మహేష్ మంజ్రేకర్‌లో నటుడు మాత్రమే కాదు, రచయిత మాత్రమే కాదు... మంచి దర్శకుడు కూడా ఉన్నాడు. ‘వాస్తవ్’ ‘అస్తిత్వా’ చిత్రాలు ఆయనకు దర్శకుడిగా మంచి పేరు తెచ్చాయి. ‘కాంటే’ సినిమాలో రాజు యాదవ్ బాలిగా కనిపించిన మంజ్రేకర్... ఆ పాత్ర ద్వారా ‘నెగెటివ్ రోల్స్’ బాగా చేయగలడు అని పేరు తెచ్చుకున్నారు. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘స్లమ్ డాగ్ మిలియనీర్’లో ఆయన చేసిన గ్యాంగ్‌స్టర్ జావెద్ పాత్ర విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. నాటకాల్లో నటించే అలవాటు ఉన్నప్పటికీ సినిమాల్లో నటించాలనే ఎప్పుడూ అనుకోలేదు మంజ్రేకర్. బ్యాంకులో ఉద్యోగంలాంటి సెక్యూర్డ్ జాబ్ ఏదైనా చేయాలనుకునేవారు. అయితే తమ పొరుగింటి వ్యక్తి జయదేవ్, మంజ్రేకర్ దృక్పథంలో మార్పు తీసుకువచ్చారు. ‘వెండితెరకు నీలాంటి వాళ్ల అవసరం ఉంది’ అని చెప్పారు. మనసుకు నచ్చిన పాత్రలు రాకపోవడంతో... డైరెక్షన్ వైపు అడుగులు వేశారు మంజ్రేకర్. సంజయ్ దత్తో తీసిన ‘వాస్తవ్’ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి దర్శకుడిగా మంజ్రేకర్‌కు ఎంతో పేరు తీసుకువచ్చింది. టబు ప్రధాన పాత్రలో వచ్చిన ‘అస్తిత్వ’ సీరియస్ ఫిల్మ్ మేకర్‌గా మంజ్రేకర్‌కు గుర్తింపు తెచ్చింది. ‘‘నా పాత్రకు ఎంత ముడుతుంది. నాకు ఎంత గిట్టుబాటు అవుతుంది అనేది ఆలోచించను. దర్శకుడు చెప్పింది ఎంత వరకు చేస్తున్నాను. నా పాత్రకు వందశాతం న్యాయం చేస్తున్నానా లేదా? అని మాత్రమే ఆలోచిస్తాను’’ అంటారు మంజ్రేకర్. మంజ్రేకర్లోని ‘బహుముఖ ప్రజ్ఞ’ వల్లనేమో ఆయన నటనలో పరిణతి కనిపిస్తుంది. ఒక పాత్ర పండించడానికి... ఆయనలో ఉన్న నటుడు, దర్శకుడు, రచయిత ఒకసారి భేటీ అవుతారేమో. ‘ఇలా చేస్తే ఎలా ఉంటుంది’ అని ఒకరితో ఒకరు చర్చించుకుంటారేమో... అందుకే మహేష్ మంజ్రేకర్ నటనలో ఒక కిక్ ఉంటుంది! మరాఠీ సినిమా ‘దే దక్క’ను సంజయ్‌దత్‌తో రిమేక్ చేసి ‘వాస్తవ్’ మ్యాజిక్‌ను మరోసారి క్రియేట్ చేయాలనుకున్నారు మంజ్రేకర్. ఆ సంగతేమిటోగానీ... ఆయన విలనిజంలోని ‘మ్యాజిక్’ మాత్రం దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అయింది. ‘రాసి కన్నా వాసి ముఖ్యం’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతారు మంజ్రేకర్. అందుకే ‘సంవత్సరానికి ఎన్ని సినిమాలు వచ్చాయనేది కాదు... ఎంత మంచి సినిమాలు వచ్చాయి అనేది ముఖ్యం’ అంటారు. పాత్రల ఎంపికలో కూడా ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఎన్ని పాత్రలు చేశామనేది కాకుండా...ఎంత మంచి పాత్రలు చేశామనేది ముఖ్యం అంటారు. ఆచితూచి పాత్రలు ఎంపిక చేసుకుంటారు. అందుకే... మహేష్ వామన్ మంజ్రేకర్ మన ‘ఉత్తమ విలన్’ అయ్యారు. -
'నటసామ్రాట్'గా ప్రకాష్ రాజ్
తెలుగు, తమిళ్, హిందీ అన్న తేడా లేకుండా సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ ప్రకాష్ రాజ్. ఇప్పటికే పలు విభిన్న పాత్రలతో ఆకట్టుకున్న ప్రకాష్‌రాజ్ మరోసారి అదే తరహా పాత్రకు రెడీ అవుతున్నాడు. మరాఠీలో రూపొంది మంచి విజయం సాధించిన నటసామ్రాట్ సినిమాను సౌత్‌లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు ప్రకాష్ రాజ్. మరాఠీలో నానా పటేకర్ ప్రధాన పాత్రలో నటించగా మరో ప్రముఖ నటుడు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించాడు. సినిమా నటుడిగా రిటైరైన వ్యక్తి సాధారణ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత తన సినీజీవిత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని సతమతమయ్యే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. గతంలో మహేష్ మంజ్రేకర్ తెరకెక్కించిన సినిమాను ధోని పేరుతో సౌత్‌లో రీమేక్ చేసిన ప్రకాష్ రాజ్, మరోసారి తానే దర్శక, నిర్మాతగా ప్రధానపాత్ర పోషిస్తూ నటసామ్రాట్ సినిమాను రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం మనవూరి రామాయణం సినిమా పనుల్లో బిజీగా ఉన్న ప్రకాష్ రాజ్, ఆ సినిమా పూర్తయిన తరువాత నటసామ్రాట్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు. -
వంద ఎకరాల భారీ సెట్లో గరుడ
చియాన్ విక్రమ్ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి తన తాజా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి గరుడ అనే టైటిల్‌ను నిర్ణయించారు. విక్రమ్ ప్రస్తుతం ఇరుముగన్ చిత్రంలో నటిస్తున్నారు. ఆనంద్‌శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార తొలిసారిగా విక్రమ్‌తో జత కడుతున్నారు. మరో హీరోయిన్గా నిత్యామీనన్ నటిస్తున్న ఇరుముగన్ చిత్రం సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోంది. విక్రమ్ తదుపరి చిత్రానికి సిద్ధం అయ్యారు. గరుడ పేరుతో రూపొందనున్న ఆ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని తిరు నిర్వహించనున్నారు. ఇందులో విక్రమ్ సరసన నటి కాజల్‌అగర్వాల్ నటించనున్నారు. వీరిద్దరి కలయికలో రూపొందనున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. కాజల్ అగర్వాల్ ఇందులో కోయంబత్తూర్ జిల్లా అమ్మాయిగా నటించనున్నారు. ఈ బ్యాక్‌డ్రాప్‌లో ఈ బ్యూటీ ఇంతకు ముందు నటించలేదన్నది గమనార్హం. యాక్షన్ అంశాలతో ఫక్తు కమర్షియల్ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సిల్వర్ లైన్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనుంది. ఇందులో మహేశ్ మంజ్రేకర్ విలన్‌గా నటించనున్నారు. ఈయన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు అన్నది గమనార్హం. ఇతర ముఖ్య పాత్రల్లో నాజర్, కరుణాస్ తదితరులు నటించనున్నారు. ఈ చిత్రం కోసం చెన్నై, శ్రీపెరంబదూర్ సమీపంలో వంద ఎకరాల ను అద్దెకు తీసుకుని బ్రహ్మాండమైన సెట్ వేశారు. అందులో ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. ఆ తరువాత పొల్లాచ్చి, కోవై, అహ్మదాబాద్, లక్నో తదితర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అదే విధంగా చిత్ర అధిక భాగం షూటింగ్‌ను అరబ్ దేశాలలో నిర్వహించనున్నట్లు చెప్పారు. -
ఎమ్మెన్నెస్ అభ్యర్థిగా సినీ దర్శకుడు మహేశ్ మంజ్రేకర్!
మరో బాలీవుడ్ కు చెందిన మరో ప్రముఖుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజ్ థాక్రే నాయకత్వంలోని మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) పార్టీ తరపున సినీ దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ ఎన్నికల బరిలోకి దిగనుండటంతో వాయవ్య ముంబైలో పోరు మరింత ఆసక్తిగా మారనుంది. ఇప్పటికే వాయవ్వ ముంబై లోకసభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గురుదాస్ కామత్, శివసేన నుంచి గజానన్ కీర్తికర్, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున మయాంక్ గాంధీ బరిలో ఉన్నారు. ఈ స్థానం నుంచి మహేశ్ మంజ్రేకర్ బరిలోకి దిగడంతో శివసేన అభ్యర్థి కీర్తికర్ గెలుపు అవకాశాలు సన్నగిల్లడమే కాకుండా ఎన్సీపీ, కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి దోహదం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గురుదాస్ కామత్ వాయవ్య ముంబై స్థానం నుంచి 38 వేల ఓట్లతో విజయం సాధించారు. కాని ఈసారి బహుముఖ పోటీ నెలకొనడం, ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారి ఎన్నికల బరిలో నిలువడం ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారనే విషయాన్ని చెప్పవడం కష్టంగా మారింది. 16 లక్షల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న మరాఠీ, గుజరాతీ ఓటర్లే కీలకంగా మారనున్నారు. జుహు, విలే పార్లే వెస్ట్ తోపాటు, టెలివిజన్ రంగానికి చెందిన ఎక్కువ మంది ప్రముఖులతోపాటు, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఇదే నియోజకవర్గంలో ఉన్నారు. వాస్తవ్, అస్థిత్వ, పితా చిత్రాలకు దర్శకత్వం వహించగా, నటుడిగా పలు తెలుగు, హిందీ చిత్రాల్లో మహేశ్ కనిపించారు.