
దాడి దృశ్యాలు
ముంబై : కారు డ్రైవర్‌పై చెయ్యి చేసుకోవటంతోపాటు అసభ్యంగా తిట్టినందుకుగానూ ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్‌పై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహేశ్ మంజ్రేకర్ శుక్రవారం రాత్రి 11:30 గంటల సమయంలో తన కారులో పుణెనుంచి సోలాపూర్ వెళుతున్నారు. ఓ చోట డ్రైవర్ కైలాష్ సత్‌పుతే సడెన్ బ్రేక్ వేసి కారును ఆపాడు. దీంతో వెనకాల వస్తున్న వేరే కారు మహేశ్ కారును ఢీకొట్టింది. కొద్ది మొత్తంలో ఆయన కారు సొట్టలు పడింది. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన మహేశ్.. కారు డ్రైవర్‌ను చెంపదెబ్బ కొట్టారు. అంతటితో ఆగకుండా బూతులు తిట్టారు. మనస్తాపానికి గురైన కారు డ్రైవర్ కైలాష్ యావత్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మహేశ్‌పై ఫిర్యాదు చేశాడు. పోలీసులు పలు సెక్షన్ల కింద నటుడిపై కేసులు నమోదు చేసి, విచారణ చేపట్టారు.
(చదవండి: తాండవ్‌పై శివాలెత్తుతున్న నెటిజన్లు)
Comments
Please login to add a commentAdd a comment