Mahesh Manjrekar Interesting Comments on GAY Relationship - Sakshi
Sakshi News home page

Mahesh Manjrekar: కొడుకు- గే రిలేషన్‌షిప్.. సీనియర్ నటుడు కామెంట్స్

Published Sun, Jul 9 2023 1:16 PM | Last Updated on Sun, Jul 9 2023 3:31 PM

Mahesh Manjrekar Comments On Son Gay Relationship - Sakshi

ఒకప్పడు 'గే' అనే మాట వినపడితే చాలు జనాలు అదో రకంగా చూసేవాళ్లు. ప్రస్తుతం కొంతమేర పరిస్థితులు మారాయని చెప్పొచ్చు. చాలా తక్కువలో తక్కువ వాళ్లని కొందరు మనుషుల్లా చూస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయమై ఓ సీనియర్ నటుడు డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఏకంగా తన కొడుకు గురించి  ప్రస్తావిస్తూ మాట్లాడటంతో ఇదికాస్త చర్చనీయాంశంగా మారిపోయింది.

(ఇదీ చదవండి: ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా? ఆ తెలుగు హీరోకి భార్య..)

గే రిలేషన్‌లో కొడుకు?
'ఒకప్పుడు హోమో సెక్సువల్ రిలేషన్‌షిప్(అబ్బాయి-అబ్బాయి, అమ్మాయి-అమ్మాయి మధ్య ప్రేమ)ని ఎవరూ అంగీకరించేవాళ్లు కాదు. దీంతో చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు కొంతమేర ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు నా కొడుకు నా దగ్గరకొచ్చి.. 'నాన్న నేను గే రిలేషన్‌షిప్'లో ఉన్నానని చెప్పినా ఒప్పుకుంటాను. ఎందుకంటే అది అతడి జీవితం. అతడికి నచ్చినట్లు బతకాలని నేను కోరుకుంటాను. నా కూతురు ఇలాంటి బంధంలో ఉన్నాసరే నాకేం అభ్యంతరం లేదు' అని నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. 

అక్కడ మాట్లాడుతూ?
'అదుర్స్', 'గుంటూరు టాకీస్' తదితర సినిమాల్లో విలన్ గా నటించిన మహేశ్ మంజ్రేకర్ గురించి తెలుగులో ప్రేక్షకులకు కొంతవరకు తెలుసు. ప్రస్తుతం ఆయన నటన కంటే డైరెక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఆయన తీసిన 'ఏక కాలేచ్చి మానీ' వెబ్ సిరీస్ కొన్నిరోజుల ముందు జియో సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. దీని ప్రమోషన్ లో భాగంగానే ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ.. తన కొడుకు-గే రిలేషన్‌పై కామెంట్స్ చేశాడు. దీంతో అవి కాస్త వైరల్ అయిపోయాయి.

(ఇదీ చదవండి: చెప్పు తెగుతుందంటూ.. రిపోర్టర్‌పై వైష్ణవి సీరియస్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement