ముంబై : అబు సలేం గ్యాంగ్‌కు చెందిన సభ్యుడిగా చెప్పుకుంటూ ఓ వ్యక్తి 35 కోట్ల రూపాయలు ఇవ్వాలని తనను డిమాండ్ చేశాడని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేష్ మంజ్రేకర్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేష్ మంజ్రేకర్ ఫిర్యాదును స్వీకరించి దోపిడీ నిరోధక పోలీస్ విభాగానికి బదలాయించినట్టు అధికారులు తెలిపారు. తన మొబైల్ ఫోన్‌కు అబూ సలేం గ్యాంగ్ సభ్యుడి నంటూ గుర్తుతెలియని వ్యక్తి నుంచి రూ. 35 కోట్లు డిమాండ్ చేస్తూ మెసేజ్‌లు వచ్చాయని రెండురోజుల కిందట మంజ్రేకర్ దాదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని అధికారులు తెలిపారు.
సున్నితమైన కేసు కావడం, దోపిడీ, బెదిరింపుల ఆరోపణలు రావడంతో ఈ కేసును ముంబై పోలీస్‌కు చెందిన దోపిడీ నిరోధక విభాగానికి బదలాయించామని వెల్లడించారు. ఇక జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకులు మహేష్ మంజ్రేకర్ నిర్ధేశకత్వంలో తెరకెక్కిన వాస్తవ్, అస్తివ, విరుద్ధ్ వంటి సినిమాలకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి.
లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి..
కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన 34 ఏళ్ల వ్యక్తి అబూ సలేం ముఠా సభ్యుడిగా పేర్కొంటూ మహేష్ మంజ్రేకర్‌ను బెదిరించినట్టు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు మహారాష్ట్రలోని ఖేడ్ జిల్లాకు చెందిన మిలింద్ తుసంకర్‌గా పోలీసులు గుర్తించారు. తుసంకర్‌ను పోలీస్ కస్టడీకి తరలించారు. బెదిరింపులు, దోపిడీ యత్నం ఆరోపణలతో తుసంకర్‌పై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment