
మహేశ్ మంజ్రేకర్ పేరు చెప్పగానే తెలుగోళ్లకు విలన్ గుర్తొస్తాడు.

ఒక్కడున్నాడు, అదుర్స్, డాన్ శీను, గుంటూరు టాకీస్, సాహో సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకున్నాడు.

యాక్టింగ్ అనే కాదు దర్శకుడిగానూ పలు సినిమాలు తీసి అలరించాడు.

తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ, కన్నడ, బెంగాలీ, భోజ్‌పురి భాషల్లో ఇతడు నటించాడు.

ఈయనకు ముగ్గురు పిల్లలు. ఇందులో సయీ మంజ్రేకర్ ఒకరు.

సల్మాన్ ఖాన్ 'దబంగ్ 3' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది.

తెలుగులో గని, స్కంద, మేజర్ సినిమాలు చేసింది గానీ గుర్తింపు ఏ మాత్రం రాలేదు.

ఒడ్డు పొడుగుతో పాటు బోలెడంత అందంగా ఉన్నప్పటికీ ఈమెకు సరైన సినిమాలు పడట్లేదు.

అయితే ఈమె టాలీవుడ్ విలన్ కూతురని తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.


















