'నటసామ్రాట్'గా ప్రకాష్ రాజ్ | Prakash Raj Holds nana patekar, Mahesh manjrekar Natasamrat Remake Rights | Sakshi
Sakshi News home page

'నటసామ్రాట్'గా ప్రకాష్ రాజ్

Published Tue, Mar 22 2016 2:15 PM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

'నటసామ్రాట్'గా ప్రకాష్ రాజ్

'నటసామ్రాట్'గా ప్రకాష్ రాజ్

తెలుగు, తమిళ్, హిందీ అన్న తేడా లేకుండా సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ ప్రకాష్ రాజ్. ఇప్పటికే పలు విభిన్న పాత్రలతో ఆకట్టుకున్న ప్రకాష్రాజ్ మరోసారి అదే తరహా పాత్రకు రెడీ అవుతున్నాడు. మరాఠీలో రూపొంది మంచి విజయం సాధించిన నటసామ్రాట్ సినిమాను సౌత్లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు ప్రకాష్ రాజ్. మరాఠీలో నానా పటేకర్ ప్రధాన పాత్రలో నటించగా మరో ప్రముఖ నటుడు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించాడు.

సినిమా నటుడిగా రిటైరైన వ్యక్తి సాధారణ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత తన సినీజీవిత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని సతమతమయ్యే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. గతంలో మహేష్ మంజ్రేకర్ తెరకెక్కించిన సినిమాను ధోని పేరుతో సౌత్లో రీమేక్ చేసిన ప్రకాష్ రాజ్, మరోసారి తానే దర్శక, నిర్మాతగా ప్రధానపాత్ర పోషిస్తూ నటసామ్రాట్ సినిమాను రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం మనవూరి రామాయణం సినిమా పనుల్లో బిజీగా ఉన్న ప్రకాష్ రాజ్, ఆ సినిమా పూర్తయిన తరువాత నటసామ్రాట్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement