
ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో...
హిందీ చిత్ర సీమలో విలక్షణ నటునిగా పేరు తెచ్చుకున్న నానా పటేకర్, మన ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ‘ఉలవచారు బిర్యానీ’కి ఇది రీమేక్. నానా పటేకర్ మాట్లాడుతూ - ‘‘ఈ ప్రేమకథ నాకు బాగా నచ్చింది. ప్రకాశ్‌రాజ్ బాగా తీస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు.