మరో వారసురాలికి సల్మాన్‌ సాయం..! | Salman Khan To Launch Mahesh Manjrekar Daughter Ashwami | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 26 2018 9:53 AM | Last Updated on Wed, Dec 26 2018 9:53 AM

Salman Khan To Launch Mahesh Manjrekar Daughter Ashwami - Sakshi

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ స్టార్ వారసులను వెండితెరకు పరిచయం చేయటంలో ముందుంటాడు. ఇప్పటికే తన బావమరిది ఆయుష్‌ శర్మతో పాటు అతియా శెట్టి, సూరజ్‌ పంచోలి, ప్రనూతన్‌లను వెండితెరకు పరిచయం చేసిన సల్మాన్‌ మరో స్టార్ వారసురాలి ఎంట్రీకి సాయం చేస్తున్నాడు. బాలీవుడ్‌లో పాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్న నటుడు మహేష్ మంజ్రేకర్‌ కూతురిని సల్మాన్‌ పరిచయం చేయనున్నాడు.

గతంలో  మహేష్‌ మంజ్రేకర్‌ కొడుకు సత్య తెరంగేట్రానికి కూడా సల్మాన్‌ సాయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా కూతురు అశ్వమీని వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను కూడా సల్మాన్‌ చేతిలోనే పెట్టాడు మంజ్రేకర్‌. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. త్వరలోనే సల్మాన్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement