'యాత్ర 2' సినిమా... చంద్రబాబు పాత్రలో ఆ విలన్! | Yatra 2 Movie Update: Do You Know Who Is Playing Chandrababu Naidu Role In Yatra 2 Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Yatra 2 Movie Chandrababu Role: 'యాత్ర 2'లో చంద్రబాబుగా ఎవరు నటిస్తున్నారంటే?

Published Fri, Oct 27 2023 6:36 PM | Last Updated on Fri, Oct 27 2023 7:12 PM

 Yatra 2 Movie Mahesh Manjrekar For Chandra Babu Role - Sakshi

ఆంధ‍్రప్రదేశ్ ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా 'యాత్ర 2'. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంపై వచ్చిన 'యాత్ర' చిత్రానికి ఇది సీక్వెల్. ఇప్పటికే షూటింగ్ చివరి దశకొచ్చేసింది. అయితే ఇందులో చంద్రబాబు పాత్రని విలన్ తరహా పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఓ నటుడు చేస్తున్నాడు. ఇంతకీ అతడెవరో తెలుసా?

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?)

యాత్ర 2 సంగతేంటి?
'యాత్ర' సినిమా తీసిన మహీ వి రాఘవనే.. యాత్ర 2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తొలి భాగం విడుదలైన ఫిబ్రవరి 8న వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. జగన్ పాత్రలో తమిళ హీరో జీవా, వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ సినిమాలో 2009-19 మధ్య జరిగే సంఘటనల్ని కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు.

చంద్రబాబు పాత్రలో
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర కూడా 'యాత్ర 2' సినిమాలో ఉంది. దీనికోసం బాలీవుడ్ స్టార్ మహేశ్ మంజ్రేకర్‌ని తీసుకున్నట్లు తెలుస్తోంది. హావభావాల విషయంలో మహేశ్ మంజ్రేకర్‍‌కి దర్శకుడు ట్రైనింగ్ ఇచ్చారని, ప్రస్తుతం సీన్స్ షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగులో అదుర్స్, సాహో, గుంటూరు టాకీస్ తదితర చిత్రాాల్లో మహేశ్ మంజ్రేకర్ నటించాడు. ఇతడి కూతురు సయీ మంజ్రేకర్ ప్రస్తుతం హీరోయిన్ గా చేస్తోంది.

(ఇదీ చదవండి: గ్రాండ్‌గా ఆ హీరోహీరోయిన్ నిశ్చితార్థం.. త్వరలో పెళ్లి కూడా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement