N Chandra babu
-
'యాత్ర 2' సినిమా... చంద్రబాబు పాత్రలో ఆ విలన్!
ఆంధ్రప్రదేశ్ ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా 'యాత్ర 2'. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంపై వచ్చిన 'యాత్ర' చిత్రానికి ఇది సీక్వెల్. ఇప్పటికే షూటింగ్ చివరి దశకొచ్చేసింది. అయితే ఇందులో చంద్రబాబు పాత్రని విలన్ తరహా పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఓ నటుడు చేస్తున్నాడు. ఇంతకీ అతడెవరో తెలుసా? (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) యాత్ర 2 సంగతేంటి? 'యాత్ర' సినిమా తీసిన మహీ వి రాఘవనే.. యాత్ర 2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తొలి భాగం విడుదలైన ఫిబ్రవరి 8న వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. జగన్ పాత్రలో తమిళ హీరో జీవా, వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ సినిమాలో 2009-19 మధ్య జరిగే సంఘటనల్ని కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు. చంద్రబాబు పాత్రలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర కూడా 'యాత్ర 2' సినిమాలో ఉంది. దీనికోసం బాలీవుడ్ స్టార్ మహేశ్ మంజ్రేకర్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. హావభావాల విషయంలో మహేశ్ మంజ్రేకర్‌కి దర్శకుడు ట్రైనింగ్ ఇచ్చారని, ప్రస్తుతం సీన్స్ షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగులో అదుర్స్, సాహో, గుంటూరు టాకీస్ తదితర చిత్రాాల్లో మహేశ్ మంజ్రేకర్ నటించాడు. ఇతడి కూతురు సయీ మంజ్రేకర్ ప్రస్తుతం హీరోయిన్ గా చేస్తోంది. (ఇదీ చదవండి: గ్రాండ్‌గా ఆ హీరోహీరోయిన్ నిశ్చితార్థం.. త్వరలో పెళ్లి కూడా) -
ఎయిర్ షో ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు
సాక్షి, విజయవాడ: నగరంలోని పున్నమి ఘాట్‌లో జరుగుతున్న ఎయిర్ షో ముగింపు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎయిర్ షో విన్యాసాలను తిలకించిన ఆయన అవి తనను అబ్బురపరిచాయని అన్నారు. అదేవిధంగా అమరావతిలో ప్రతిరోజూ ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నమని తెలిపారు. అందమైన టూరిస్ట్ ప్రదేశాలు, నదులు, రిజర్వాయర్లు, వెయ్యి కిలొమీటర్ల సముద్ర తీరం ఉండటం ఏపీకి వరమన్నారు. టూరిజాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని.. దానికి తగినట్లు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విమాన విన్యాసాలు చూసిన తర్వాత తను కూడా పైలెట్‌గా మారి విన్యాసాలు చేయాలనిపిస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో పర్యాటక కేంద్రంగా అమరావతి ప్రపంచంలోనే ఐదు సుందరమైన నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. -
చంద్రబాబుతో జై సమైక్యాంధ్ర అని చెప్పిస్తారా?: ద్వారంపూడి సవాల్
రాష్ట్రంలో పిచ్చెక్కిన కుటుంబం ఏదైనా ఉందా అంటే అది చంద్రబాబు కుటుంబమేనని వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. సీమాంధ్ర టీడీపీ నేతలకు చేతనైతే చంద్రబాబుతో జై సమైక్యాంధ్ర అని అనిపించాలని ద్వారంపూడి సవాల్ చేశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విడుదలయ్యాక చంద్రబాబు గుండెదడతో ఐదు రోజుల వరకు తన ఇంటి గడప దాడి బయటకు రాలేదని ఎద్దేవా చేశారు. మంత్రి తోట నరసింహం, కేంద్రమంత్రి పల్లంరాజు పార్టీ కోసం కష్టపడితే పదవులు రాలేదని, వారసత్వంగా వచ్చాయని వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఇప్పటికైనా వారు రాజీ నామా చేయాలని ద్వారంపూడి డిమాండ్ చేశారు.