జాతీయ అవార్డు సాధించిన నలుగురు దర్శకులు (ప్రదీప్ సర్కార్, అనిరుద్ రాయ్ చౌదరి, ప్రియదర్శన్, మహేశ్ మంజ్రేకర్) ఓ ప్రాజెక్ట్ కోసం కలిశారు. నాలుగు భాగాలుగా తెరకెక్కిన ‘ఫర్బిడన్ లవ్’ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ నాలుగు సినిమాల కథాంశాలు ప్రేమ చుట్టూనే ఉంటాయట. ఓటీటీ సంస్థ జీ5 నిర్మించిన ఈ చిత్రాలు ఆ ప్లాట్‌ఫామ్‌లోనే విడుదల కానున్నాయి.
‘డయగ్నాసిస్ ఆఫ్ లవ్ ’ విభాగాన్ని మహేశ్ మంజ్రేకర్, ‘రూల్స్ ఆఫ్ ది గేమ్’ను అనిరుద్ రాయ్, ‘అనామిక’ను ప్రియదర్శన్, ‘అరేంజ్డ్ మ్యారేజ్’ను ప్రదీప్ సర్కార్ తెరకెక్కించారు. ఈ నాలుగు భాగాల్లో పూజా కుమార్, అలీ ఫాజల్, రైమా సేన్ వంటి నటులు ఉన్నారు. ఈ నెల 9 నుంచి ఈ ‘ఫర్బిడన్ లవ్’ సిరీస్‌లో ఒక్కో భాగం ఆన్‌లైన్‌లో స్ట్రీమ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment