సాయీ.. రావోయీ | sai manjrekar entry to tollywood | Sakshi
Sakshi News home page

సాయీ.. రావోయీ

Feb 22 2020 2:54 AM | Updated on Feb 22 2020 2:54 AM

sai manjrekar entry to tollywood - Sakshi

సాయీ మంజ్రేకర్‌

బాలీవుడ్‌ నటుడు చంకీ పాండే కూతురు అనన్య పాండే, విజయ్‌ దేవరకొండ నటిస్తున్న ప్యాన్‌ ఇండియన్‌ మూవీ ‘ఫైటర్‌’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మహేష్‌ మంజ్రేకర్‌ (ప్రభాస్‌ ‘సాహో’ చిత్రంలో ప్రిన్స్‌ పాత్రధారి) తనయ సాయీ మంజ్రేకర్‌ టాలీవుడ్‌కు హాయ్‌ చెప్పబోతున్నట్లు ఫిల్మ్‌నగర్‌ టాక్‌. వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకోనున్న సినిమాలో సాయీ మంజ్రేకర్‌ను కథానాయికగా ఎంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ గత ఏడాది నటించిన ‘దబాంగ్‌ 3’లో సాయీ ఒక హీరోయిన్‌గా నటించి, తన సిల్వర్‌స్క్రీన్‌ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత హిందీలో వేరే సినిమాలు ఒప్పుకున్నట్లు లేదు. మరి.. వరుణ్‌తో సాయీ జోడీ కుదిరినట్లేనా? వెయిట్‌ అండ్‌ సీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement