
ముంబై: ప్రముఖ దర్శకుడు, నటుడు గిరీశ్ మాలిక్ ఇంట విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం హోలీ ఆడుకుని ఇంటికి వచ్చిన అతడి తనయుడు మన్నన్(17) ప్రమాదవశాత్తూ ఐదో అంతస్థు నుంచి కింద పడటంతో అక్కడికక్కడే మరణించాడు. దీంతో దర్శకుడి ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి. 'టొర్బాజ్' నిర్మాత రాహుల్ మిత్ర ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
'టొర్బాజ్ షూటింగ్ సమయంలో చాలాసార్లు మన్నన్‌ను కలిశాను. అతడు చాలా తెలివైనవాడు. ఇలా జరగడం దురదృష్టకరం. ఈ విషయం తెలిసి సంజయ్‌దత్ కూడా ఎంతో బాధపడ్డాడు. గిరీశ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని రాహుల్ మిత్ర పేర్కొన్నాడు. కాగా గిరీజ్ 2013లో 'జల్' సినిమాతో దర్శకుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 'టొర్బాజో', 'మాన్ వర్సెస్ ఖాన్' సినిమాలు అతడికి మంచి పేరు తీసుకువచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment