ఆస్పత్రిలో కన్నీళ్లు పెట్టుకున్న సంజయ్‌దత్! | sanjay dutt cried in hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో కన్నీళ్లు పెట్టుకున్న సంజయ్‌దత్!

Published Fri, Jan 10 2014 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

ఆస్పత్రిలో కన్నీళ్లు పెట్టుకున్న సంజయ్‌దత్!

ఆస్పత్రిలో కన్నీళ్లు పెట్టుకున్న సంజయ్‌దత్!

 ఊహించని విధంగా సమస్యలు ఒకేసారి చుట్టుముడితే చెట్టంత మనిషైనా సరే కుప్పకూలిపోతాడు. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పరిస్థితి అలానే ఉంది. ముంబయ్ బాంబు పేలుళ్ల కేసులో పుణేలోని ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తూ, భార్యాపిల్లలకు దూరంగా ఉండాల్సి వచ్చినందుకు తెగ బాధపడుతున్నారు సంజయ్. ఆ బాధ రెట్టింపయ్యే విధంగా ఆయన భార్య మాన్యత అనారోగ్యం బారిన పడ్డారు. కాలేయంలో ఆమెకు ట్యూమర్ ఉందని డాక్టర్లు నిర్ధారించడంతో పెరోల్‌పై సంజయ్ విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం మాన్యత హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోవడంతో ఆమెను ముంబయ్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. కాలేయంలో చేరిన ఫ్లూయిడ్స్‌ని తీయడం కోసం ఆమెకు అత్యవసర శ్రస్త చికిత్స చేశారట. భార్యను ఈ స్థితిలో చూడలేక సంజయ్‌దత్ కన్నీళ్లు పెట్టుకున్నారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆస్పత్రి సిబ్బంది సంజయ్‌ని ఊరడించడానికి చాలా కష్టపడ్డారట. అంత ఎమోషనల్ అయ్యారని సమాచారం. అక్కడి సిబ్బందితో మాట్లాడుతూ... ఇప్పటికే జీవితంలో చాలా కోల్పోయానని, ఇక కోల్పోవడానికి సిద్ధంగా లేనని చెప్పి బాధపడ్డారట సంజయ్. ఆయన తల్లి నర్గిస్ దత్ కేన్సర్ వ్యాధి సోకి చనిపోయారు.
 
  ఆ తర్వాత సంజయ్ మొదటి భార్యరిచా శర్మ కూడా ఇదే వ్యాధికి బలయ్యారు. ఇప్పుడు మాన్యతకు ఆ వ్యాధి అని నిర్ధారణ కాకపోయినా, ‘ట్యూమర్’ ఉందని డాక్టర్లు చెప్పడంతో ఆయన భయపడుతున్నారు. పైగా, దీనికి సంబంధించిన చికిత్సకు ఎక్కువ రోజులు పడుతుండటంతో ఆయన ఎక్కువ టెన్షన్ పడుతున్నారట. అన్ని ట్యూమర్లూ కేన్సర్‌కి సంబంధించినవి కాకపోయినా, ఆల్రెడీ తన తల్లిని, మొదటి భార్యనూ కోల్పోయి ఉండటం వల్ల సంజయ్‌దత్ బాగా భయపడుతున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement