tumour
-
8 గంటలు శ్రమించి... ప్రాణాలు కాపాడారు జీజీహెచ్ లో అరుదైన ఆపరేషన్...!
-
వైరల్: ఇదేం వింత.. 17 ఏళ్ల కుర్రాడికి ఏకంగా 82 పళ్లు..
Bihar Man Rare Tumor: సాధారణంగా మనుషులకు 32 పళ్లు (దంతాలు) ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. వయస్సు తేడాను బట్టి కొందరి దంతాల సంఖ్యలో మార్పులు ఉండవచ్చు. దంత సమస్యలు ఏమైనా ఉంటే కొందరికి అవి ఊడిపోవచ్చు. కానీ ఎప్పుడైనా 32 కంటే ఎక్కువ దంతాలు కలిగిఉన్న వారిని చూశారా. పోనీ వారి గురించి విన్నారా.. ఇప్పుడు చెప్పబోయే వ్యక్తికి ఉండాల్సిన పళ్ల కంటే మించి ఉన్నాయి. హా ఎన్నిలే 33, 34 ఉండవచ్చనుకుంటున్నారా. కాదండోయ్.. దానికి రెట్టింపుగా ఏకంగా 82 పళ్లు ఉన్నాయి. ఈ విచిత్ర సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. పాట్నాకు చెందిన నితీష్ కుమార్ అనే 17 ఏళ్ల యువకుడికి 82 దంతాలు ఉన్నాయి. అంటే దాదాపు అతని వయస్సు కంటే దాదాపు అయిదు రెట్లు ఎక్కువ. నితీష్ గత అయిదేళ్లుగా నోటిలో కణితితో బాధపడుతున్నారు. కణితి బాధ తీవ్రత ఎక్కువగా ఉండటంతో దంతాల డాక్టర్ వద్దకు వెళ్లాడు. అతడికి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు విషయం తెలిసి షాక్ అయ్యారు. నితీష్ కుమార్ దవడలో 82 పళ్లు ఉన్నాయని, అందువల్లే అతనికి దవడ నొప్పిగా ఉందని తెలిపారు. దవడలో ఏర్పడిన ట్యూమర్ వల్ల దంతాలన్నీ ఒకే దగ్గర ఎక్కువ మొత్తాల్లో పుట్టుకొచ్చాయని తెలిపారు. ఇటువంటి దాన్ని వైద్య పరిభాషలో `ఒడొంటొమా` అంటారని పేర్కొన్నారు. దీంతో నితీష్‌కు మూడు గంటలపాటు సుదీర్ఘ ఆపరేషన్ చేసి దవడంలోని ట్యూమర్‌ని తొలగించారు. కణిత రెండు దవడల వైపు ఏర్పడటం వల్ల నితీశ్ కుమార్ ముఖం వికృతంగా కనిపించేదని, ఇప్పుడు సర్జరీ చేయడంతో యువకుడి ముఖం సాధారణ పరిస్థితిలోకి వచ్చిందన్నారు. ఆపరేషన్‌తో అదనపు దంతాలు తొలగించామని ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మెడికల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం నితీష్ కుమార్ ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్లు తెలిపారు. -
ట్యూమర్ అనుకొని కిడ్నీ తొలగించిన వైద్యుడు!
ఫ్లోరిడా: ఏ దేశంలోనైనా వైద్యుణ్ని దేవుడితో సమానంగా చూస్తారు. అయితే ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లు కొన్నిసార్లు నిర్లక్ష్యంతో వ్యవహరించి రోగి జీవితంతో ఆటలాడుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా అమెరికాలోని ఫ్లోరిడాకి చెందిన ఓ మహిళకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఆమె తన కిడ్నీని కోల్పోవాల్సివచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. మౌరీన్ పచేకో(53) గతేడాది కారు ప్రమాదం జరిగినప్పటి నుంచి తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతోంది. ఇక తప్పేలా లేదనుకున్న ఆమె వైద్యుణ్ని సంప్రదించి శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకుంది. స్థానికంగా ఉన్న ఆసుపత్రికి వెళ్లింది. శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో సదరు వైద్యుడు... పచేకో నడుము ప్రాంతంలో కేన్సర్ ట్యూమర్ ఉన్నట్లు గుర్తించాడు. నిజానికి అది కిడ్నీ. సాధారణంగా ఉండాల్సిన చోట కాకుండా పచేకోకు అది వేరో చోట ఉంది. దీన్ని వైద్య పరిభాషలో ‘పెల్విక్ కిడ్నీ’ అంటారు. దీన్ని ట్యూమర్‌గా భావించిన డాక్టర్ అనాలోచితంగా కిడ్నీని తొలగించాడు. అనంతరం మత్తు నుంచి కోలుకున్న పీచేకో.. వైద్యుడు చేసిన తప్పిదాన్ని గుర్తించి న్యాయపోరాటం ద్వారా 5లక్షల డాలర్లు పరిహారం పొందింది. అయినా... ఏం లాభం? ఇక మీదట ఆమె జీవితాంతం ఒక కిడ్నీతో బతకాల్సిందే. -
37 కేజీల వ్యక్తిలో 55 కేజీల కణితి
న్యూఢిల్లీ: ఓ 26 ఏళ్ల వ్యక్తికి ఆపరేషన్ చేసి ఢిల్లీ వైద్యులు అవాక్కయ్యారు. అతడి కుడి పిరుదు భాగంలో 55 కేజీల కణితిని తీసి విస్మయం చెందారు. పోలీసుల వివరాల ప్రకారం గత రెండేళ్లుగా జలందర్ కు చెందిన గుర్మీత్ సింగ్ అనే వ్యక్తి ఓ కణితి ద్వారా తీవ్రంగా బాధపడుతున్నాడు. వాస్తవానికి అతడికి ఆ కణితి ఏర్పడి ఏడేళ్లకు పైగా అయింది. అయితే, గత రెండేళ్లలోనే దాని ప్రభావం ఎక్కువగా పడి ప్రాణం మీదకు వచ్చింది. దీంతో అతడు తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాక్స్ ఆస్పత్రి(సాకేత్)లో చేర్పించారు. దీంతో పరీక్షలు చేసిన వైద్యులు అనంతరం శస్త్ర చికిత్స చేయగా 55 కేజీల కణితి బయటపడింది. ఈ కణితి బరువుకంటే తక్కువగా 37కేజీల బరువు మాత్రమే గుర్మీత్ ఉండటం మరో ఆశ్చర్య కరమైన విషయం. -
ఆస్పత్రిలో కన్నీళ్లు పెట్టుకున్న సంజయ్‌దత్!
ఊహించని విధంగా సమస్యలు ఒకేసారి చుట్టుముడితే చెట్టంత మనిషైనా సరే కుప్పకూలిపోతాడు. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పరిస్థితి అలానే ఉంది. ముంబయ్ బాంబు పేలుళ్ల కేసులో పుణేలోని ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తూ, భార్యాపిల్లలకు దూరంగా ఉండాల్సి వచ్చినందుకు తెగ బాధపడుతున్నారు సంజయ్. ఆ బాధ రెట్టింపయ్యే విధంగా ఆయన భార్య మాన్యత అనారోగ్యం బారిన పడ్డారు. కాలేయంలో ఆమెకు ట్యూమర్ ఉందని డాక్టర్లు నిర్ధారించడంతో పెరోల్‌పై సంజయ్ విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం మాన్యత హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోవడంతో ఆమెను ముంబయ్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. కాలేయంలో చేరిన ఫ్లూయిడ్స్‌ని తీయడం కోసం ఆమెకు అత్యవసర శ్రస్త చికిత్స చేశారట. భార్యను ఈ స్థితిలో చూడలేక సంజయ్‌దత్ కన్నీళ్లు పెట్టుకున్నారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆస్పత్రి సిబ్బంది సంజయ్‌ని ఊరడించడానికి చాలా కష్టపడ్డారట. అంత ఎమోషనల్ అయ్యారని సమాచారం. అక్కడి సిబ్బందితో మాట్లాడుతూ... ఇప్పటికే జీవితంలో చాలా కోల్పోయానని, ఇక కోల్పోవడానికి సిద్ధంగా లేనని చెప్పి బాధపడ్డారట సంజయ్. ఆయన తల్లి నర్గిస్ దత్ కేన్సర్ వ్యాధి సోకి చనిపోయారు. ఆ తర్వాత సంజయ్ మొదటి భార్యరిచా శర్మ కూడా ఇదే వ్యాధికి బలయ్యారు. ఇప్పుడు మాన్యతకు ఆ వ్యాధి అని నిర్ధారణ కాకపోయినా, ‘ట్యూమర్’ ఉందని డాక్టర్లు చెప్పడంతో ఆయన భయపడుతున్నారు. పైగా, దీనికి సంబంధించిన చికిత్సకు ఎక్కువ రోజులు పడుతుండటంతో ఆయన ఎక్కువ టెన్షన్ పడుతున్నారట. అన్ని ట్యూమర్లూ కేన్సర్‌కి సంబంధించినవి కాకపోయినా, ఆల్రెడీ తన తల్లిని, మొదటి భార్యనూ కోల్పోయి ఉండటం వల్ల సంజయ్‌దత్ బాగా భయపడుతున్నారు