ప్రతీకాత్మక చిత్రం
ఫ్లోరిడా: ఏ దేశంలోనైనా వైద్యుణ్ని దేవుడితో సమానంగా చూస్తారు. అయితే ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లు కొన్నిసార్లు నిర్లక్ష్యంతో వ్యవహరించి రోగి జీవితంతో ఆటలాడుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా అమెరికాలోని ఫ్లోరిడాకి చెందిన ఓ మహిళకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఆమె తన కిడ్నీని కోల్పోవాల్సివచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. మౌరీన్ పచేకో(53) గతేడాది కారు ప్రమాదం జరిగినప్పటి నుంచి తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతోంది. ఇక తప్పేలా లేదనుకున్న ఆమె వైద్యుణ్ని సంప్రదించి శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకుంది.
స్థానికంగా ఉన్న ఆసుపత్రికి వెళ్లింది. శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో సదరు వైద్యుడు... పచేకో నడుము ప్రాంతంలో కేన్సర్ ట్యూమర్ ఉన్నట్లు గుర్తించాడు. నిజానికి అది కిడ్నీ. సాధారణంగా ఉండాల్సిన చోట కాకుండా పచేకోకు అది వేరో చోట ఉంది. దీన్ని వైద్య పరిభాషలో ‘పెల్విక్ కిడ్నీ’ అంటారు. దీన్ని ట్యూమర్‌గా భావించిన డాక్టర్ అనాలోచితంగా కిడ్నీని తొలగించాడు. అనంతరం మత్తు నుంచి కోలుకున్న పీచేకో.. వైద్యుడు చేసిన తప్పిదాన్ని గుర్తించి న్యాయపోరాటం ద్వారా 5లక్షల డాలర్లు పరిహారం పొందింది. అయినా... ఏం లాభం? ఇక మీదట ఆమె జీవితాంతం ఒక కిడ్నీతో బతకాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment