37 కేజీల వ్యక్తిలో 55 కేజీల కణితి
న్యూఢిల్లీ: ఓ 26 ఏళ్ల వ్యక్తికి ఆపరేషన్ చేసి ఢిల్లీ వైద్యులు అవాక్కయ్యారు. అతడి కుడి పిరుదు భాగంలో 55 కేజీల కణితిని తీసి విస్మయం చెందారు. పోలీసుల వివరాల ప్రకారం గత రెండేళ్లుగా జలందర్ కు చెందిన గుర్మీత్ సింగ్ అనే వ్యక్తి ఓ కణితి ద్వారా తీవ్రంగా బాధపడుతున్నాడు. వాస్తవానికి అతడికి ఆ కణితి ఏర్పడి ఏడేళ్లకు పైగా అయింది.
అయితే, గత రెండేళ్లలోనే దాని ప్రభావం ఎక్కువగా పడి ప్రాణం మీదకు వచ్చింది. దీంతో అతడు తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాక్స్ ఆస్పత్రి(సాకేత్)లో చేర్పించారు. దీంతో పరీక్షలు చేసిన వైద్యులు అనంతరం శస్త్ర చికిత్స చేయగా 55 కేజీల కణితి బయటపడింది. ఈ కణితి బరువుకంటే తక్కువగా 37కేజీల బరువు మాత్రమే గుర్మీత్ ఉండటం మరో ఆశ్చర్య కరమైన విషయం.