ఇటీవల పంజాబ్‌లోని ఒక శాసనసభ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ఫలితం వెలువడింది. జలంధర్ వెస్ట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో మొత్తం 13 దశల్లో ఓట్ల లెక్కింపు జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మొహిందర్ భగత్ బీజేపీ అభ్యర్థి శీతల్ అంగురాల్‌పై విజయం సాధించారు.
మొహిందర్ భగత్ 37325 ఓట్లతో విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శీతల్ అంగురాల్ రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ అభ్యర్థి సురీందర్ కౌర్ మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం జలంధర్‌లోని మొహిందర్ భగత్ ఇంట్లో సంబరాలు జరుగుతున్నాయి.
కౌంటింగ్ తొలి రౌండ్ నుంచి మొహిందర్ భగత్ ముందంజలో ఉన్నారు. శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సూర్జిత్ కౌర్ నాలుగో స్థానంలో ఉండగా, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి బిందర్ కుమార్ ఐదో స్థానంలో నిలిచారు.
ఆప్ ఎమ్మెల్యే అంగురల్ రాజీనామా చేయడంతో ఈ సీటు ఖాళీ అయ్యింది.ఈ నేపధ్యంలోనే ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. జలంధర్ వెస్ట్ అసెంబ్లీ స్థానానికి జూలై 10న పోలింగ్ జరగగా, 54.98 శాతం ఓటింగ్ నమోదైంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానంలో 67 శాతం ఓటింగ్ నమోదయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment