Max Hospital
-
కరోనా విలయం: ఒత్తిడి తట్టుకోలేక వైద్యుడి ఆత్మహత్య
న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ వివేక్ రాయ్ ఆత్మహత్య చేసుకోవడం విషాదాన్ని నిపంది. దేశంలో కరోనా మహమ్మారి నుంచి లక్షలాది మంది ప్రాణాల్ని కాపాడుతున్న వైద్యులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కళ్ళముందే బాధితులు పిట్టల్లా రాలిపోతోంటే..తట్టుకోలేక కన్నీరు పెడుతున్నారు. ఇంతిటి విషాదకర పరిస్థితుల్లో ఒక వైద్యుడు ఏకంగాప్రాణాల్నే తీసుకోవడం కలకలం రేపింది. రెండు నెలల గర్భిణీగా ఉన్న భార్య పరిస్థితిని సైం మర్చిపోయి ఉసురుకున్న వైనం మహమ్మారి సృష్టిస్తున్న విలయానికి అద్దం పడుతోంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్ పూర్ కు చెందిన డాక్టర్ వివేక్ రాయ్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు నిర్ధారించారు. వివేక్ రాయ్ ఢిల్లీలోని మాళవీయనగర్ లో నివాసం ఉంటూ సౌత్ ఢిల్లీకి చెందిన మ్యాక్స్ ఆస్పత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత కొద్దిరోజులుగా మ్యాక్స్ ఆస్పత్రి ఐసీయూలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వివేక్ రాయ్ మనోవేదనకు గురైనట్లు తోటి వైద్యులు తెలిపారు. గత ఏడాది నవంబరులో ఈయన వివాహం చేసుకోగా, ప్రస్తుతం ఈయన భార్య రెండు నెలల గర్భవతి. రాయ్ అకాలమరణంతో ఆయన కుటుంబ సభ్యులుతీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. ఎప్పటిలాగా ఆస్పత్రిలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన వివేక్ రాయ్ తన బెడ్ రూమ్‌లో చీరతో సీలింగ్ ప్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న వివేక్ ఎంతకీ ఇంటి డోర్ ఓపెన్ చేయకపోవడంతో కుటుంబసభ్యులు శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మాళవీయ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వివేక్ రాయ్ ఇంటి డోర్‌ను బలవంతంగా ఓపెన్ చేసి చూడగా గదిలో విగతజీవిగా ఉరికి వేలాడుతూ కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా సౌత్ డీసీపీ అతుల్ కుమార్ ఠాకూర్ మాట్లాడుతూ 'వివేక్ రాయ్ కుటుంబ సభ్యులు ఫోన్ చేయడంతో అతని ఇంటికి వెళ్లాం. అక్కడ బెడ్ రూమ్ గదిలో చీరతో ఉరివేసుకొని కనిపించారు. డాక్టర్ మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇంట్లో సోదాలు నిర్వహించాం. ఈ సోదాల్లో తన సన్నిహితులు, కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితిని చూసి తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాసిన ఓ లేఖ దొరికింది. అనంతరం మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబసభ్యలకు అందించాం’అని అన్నారు. కాగా భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ రికార్డు స్థాయిలో విజృంభిస్తుండడంతో ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు మనోవేదనకు గురవుతున్నారు. తాము ట్రీట్మెంట్ ఇచ్చిన బాధితులు కళ్లముందు ప్రాణాలు కోల్పోతుంటే అసహాయులై కృంగిపోతున్నారు. మరికొందరు సున్నిత మనస్కులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు.ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లెక్కల ప్రకారం కరోనా సోకడం వల్లే సుమారు 800 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. -
మ్యాక్స్ హాస్పిటల్‌పై వేటు పడింది
పుట్టిన బిడ్డను బతికుండగానే చనిపోయినట్టు ధ్రువీకరించిన మ్యాక్స్ హాస్పిటల్ షాలిమార్ బాగ్‌పై వేటు పడింది. ఈ హాస్పిటల్ లైసెన్సును రద్దు చేస్తున్నట్టు ఢిల్లీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. నిరక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు తేలిందని, ఈ మేరకు లైసెన్సును రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు విచారణలో తేలితే హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేస్తామని ఢిల్లీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ గతవారమే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాక ఆర్థికంగా వెనుకబడినవర్గాలకు చెందిన రోగులకు నిబంధనల ప్రకారం వైద్యసేవలు అందించడం లేదని ఇదే హాస్పిటల్‌కు ఈ ఏడాది నవంబర్ 22న షోకాజ్ నోటీసులు జారీచేసినట్టు తెలిపారు.. ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌లో ఉన్న మ్యాక్స్ హాస్పిటల్లో నవంబర్ 30న ఓ మహిళ నవమాసాలు నిండకుండానే కవలల (ఒక ఆడ, ఒక మగ బిడ్డ)కు జన్మనిచ్చింది. పిల్లలిద్దరు చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించి, వారిని పాలిథిన్ కవర్లో పెట్టి తల్లిదండ్రులకు అందించారు. అంత్యక్రియలకు తరలిస్తుండగా.. కవలల్లో ఒకరైన మగబిడ్డ బతికే ఉన్నట్టు తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే ఆ బాబును దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. తల్లి ఇంకా మ్యాక్స్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ విచారణ మేరకు హాస్పిటల్ నిర్లక్ష్యం ఉన్నట్టు తేలిందని తెలిసింది. -
చికిత్సకు రూ.50 లక్షలు అవుతుందన్నారు!
న్యూఢిల్లీ: తన శిశువుకు ఆస్పత్రిలో చికిత్స అందించడానికి రూ.50 లక్షలు ఖర్చు అవుతుందని మాక్స్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి చెప్పినట్లు తండ్రి ఆశిష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నొప్పులు రావడంతో తన భార్య వర్ష(20)ను నవంబర్ 27న మాక్స్ ఆస్పత్రికి తీసుకెళ్లామని కడుపులోని ఇద్దరు శిశువులు బతికే అవకాశాలు 10 నుంచి 15 శాతం మాత్రమే ఉన్నట్లు తొలుత వైద్యులు తెలిపారన్నారు. రూ.35వేల విలువచేసే మూడు ఇంజెక్షన్లు ఇస్తే చిన్నారులు బతికే అవకాశం 30 శాతం ఉంటుందని వైద్యులు తనతో చెప్పారన్నారు. ఇంతలో ఒక శిశువు మరణించగా, మరో శిశువుకు ప్రాణాపాయం తప్పేవరకు ఆస్పత్రిలో చికిత్స అందించడానికి రూ.50 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఈ విషయమై తాను కుటుంబ సభ్యులతో చర్చిస్తుండగానే రెండో చిన్నారి కూడా చనిపోయినట్లు వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. ఆస్పత్రి సిబ్బంది శిశువుల మృతదేహాలను పాలిథిన్ సంచిలో తల్లిదండ్రులకు అప్పగించగా, వారిని ఖననం చేసే సమయంలో ఒకరు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించడంతో వెంటనే మరో ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. -
మరో పెద్దాసుపత్రి నిర్వాకం: బతికుండగానే...
సాక్షి, న్యూఢిల్లీ : పెద్దాసుపత్రుల అంతులేని నిర్లక్ష్యానికిఅద్దం పట్టిన మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్నగాక మొన్న దేశ రాజధాని నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రి ఫోర్టిస్ నిర్వాకం వెలుగులోకి రాగా ఈ కోవలోకి మ్యాక్స్ ఆసుపత్రి చేరింది. ఫోర్టిస్ నిర్లక్ష్యానికి డెంగీతో బాధ పడుతున్న ఏడేళ్ల బాలిక మృతి చెందిన ఘటన మరవక ముందే..ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రి లోమరో విషాదం నెలకొంది. నవజాత శిశువు బతికుండగానే.. చనిపోయిందని ఇక్కడి వైద్యులు ప్రకటించేశారు. శిశువును ఆరు వరుసల ప్లాస్టిక్ పేపర్లో చుట్టేసి మరీ అప్పగించారు. అంతేకాదు పుట్టిన కవల బిడ్డల చికిత్సకు భారీమొత్తంలో బిల్లు వేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే...ప్రవీణ్ అనే వ్యక్తి భార్య నవంబరు 30వ తేదీన కవల పిల్లలకు మ్యాక్స్ ఆస్పత్రిలో జన్మనిచ్చింది. అయితే వీరిలో ఒకరు మృతి చెందారని.. మరొకరికి అత్యాధునిక చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. ఇంజక్షన్‌ను రూ.35 వేలు, రోజుకు లక్ష రూపాయల చొప్పున ఖర్చు అవుతుందని చెప్పింది. ఇంతలోపే రెండో శిశువు కూడా మృతి చెందిందని పేరెంట్స్‌కు వైద్యులు చెప్పారు. దీంతో ఇద్దరు శిశువులను తీసుకుని ఖననానికి వెళ్తుండగా.. అకస్మాత్తుగా శిశువు కదిలడం..శ్వాస తీసుకోవడాన్ని గమనించిన బందువులు వెంటనే శిశువును మరో ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు. ప్రస్తుతం ఆ బేబి రికవరీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రవీణ్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన షాకింగ్‌కు గురి చేసిందని.. అతి పెద్ద నిర్లక్ష్యమని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. తక్షణమే ఆరోగ్య శాఖ కార్యదర్శితో మాట్లాడారు. ఢిల్లీ మెడికల్ కౌన్సిల్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచనలను కోరామని, విచారణ జరుగుతోందని నార్త్-వెస్ట్ డీసీపీ అస్లాం ఖాన్ తెలిపారు. మరోవైపు మాక్స్ హాస్పిటల్ వైద్య నిర్లక్ష్యం ఘటనపై కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి సత్యేంద్ర జైన్ స్పందించారు. పూర్తి విచారణ జరిపించాల్సిందిగా సంబంధిత శాఖను ఆదేశించినట్టుగా ట్విట్టర్లో వెల్లడించారు. కాగా మ్యాక్స్ ఆస్పత్రిలో కవలలకు వైద్యం అందించిన డాక్టర్ సెలవులో వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. Sought a report on shocking criminal negligence byMaxHospitalShalimar Bagh & directed Dept to conduct a inquiry into this unacceptable act — Satyendar Jain (@SatyendarJain) December 1, 2017 -
37 కేజీల వ్యక్తిలో 55 కేజీల కణితి
న్యూఢిల్లీ: ఓ 26 ఏళ్ల వ్యక్తికి ఆపరేషన్ చేసి ఢిల్లీ వైద్యులు అవాక్కయ్యారు. అతడి కుడి పిరుదు భాగంలో 55 కేజీల కణితిని తీసి విస్మయం చెందారు. పోలీసుల వివరాల ప్రకారం గత రెండేళ్లుగా జలందర్ కు చెందిన గుర్మీత్ సింగ్ అనే వ్యక్తి ఓ కణితి ద్వారా తీవ్రంగా బాధపడుతున్నాడు. వాస్తవానికి అతడికి ఆ కణితి ఏర్పడి ఏడేళ్లకు పైగా అయింది. అయితే, గత రెండేళ్లలోనే దాని ప్రభావం ఎక్కువగా పడి ప్రాణం మీదకు వచ్చింది. దీంతో అతడు తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాక్స్ ఆస్పత్రి(సాకేత్)లో చేర్పించారు. దీంతో పరీక్షలు చేసిన వైద్యులు అనంతరం శస్త్ర చికిత్స చేయగా 55 కేజీల కణితి బయటపడింది. ఈ కణితి బరువుకంటే తక్కువగా 37కేజీల బరువు మాత్రమే గుర్మీత్ ఉండటం మరో ఆశ్చర్య కరమైన విషయం.