మ్యాక్స్‌ హాస్పిటల్‌పై వేటు పడింది | Max Hospital Shalimar Bagh's licence cancelled after baby wrongly declared dead | Sakshi
Sakshi News home page

మ్యాక్స్‌ హాస్పిటల్‌పై వేటు పడింది

Published Fri, Dec 8 2017 4:28 PM | Last Updated on Fri, Dec 8 2017 4:31 PM

Max Hospital Shalimar Bagh's licence cancelled after baby wrongly declared dead - Sakshi

పుట్టిన బిడ్డను బతికుండగానే చనిపోయినట్టు ధ్రువీకరించిన మ్యాక్స్‌ హాస్పిటల్‌ షాలిమార్ బాగ్‌పై వేటు పడింది. ఈ హాస్పిటల్‌ లైసెన్సును రద్దు చేస్తున్నట్టు ఢిల్లీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ తెలిపారు. నిరక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు తేలిందని, ఈ మేరకు లైసెన్సును రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు విచారణలో తేలితే హాస్పిటల్‌ లైసెన్స్ రద్దు చేస్తామని ఢిల్లీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ గతవారమే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాక ఆర్థికంగా వెనుకబడినవర్గాలకు చెందిన రోగులకు నిబంధనల ప్రకారం వైద్యసేవలు అందించడం లేదని ఇదే హాస్పిటల్‌కు ఈ ఏడాది నవంబర్ 22న షోకాజ్ నోటీసులు జారీచేసినట్టు తెలిపారు..

ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌లో ఉన్న మ్యాక్స్ హాస్పిటల్‌లో నవంబర్ 30న ఓ మహిళ నవమాసాలు నిండకుండానే కవలల (ఒక ఆడ, ఒక మగ బిడ్డ)కు జన్మనిచ్చింది. పిల్లలిద్దరు చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించి, వారిని పాలిథిన్ కవర్లో పెట్టి తల్లిదండ్రులకు అందించారు. అంత్యక్రియలకు తరలిస్తుండగా.. కవలల్లో ఒకరైన మగబిడ్డ బతికే ఉన్నట్టు తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే ఆ బాబును దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. తల్లి ఇంకా మ్యాక్స్‌ హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ విచారణ మేరకు హాస్పిటల్‌ నిర్లక్ష్యం ఉన్నట్టు తేలిందని తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement