licence cancel
-
ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు..
హైదరాబాద్: బేగంపేటలోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఎక్సైజ్ అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బార్లో యువతులు అశ్లీల నృత్యాలు చేయడం, యువకులను రెచ్చగొట్టడం, డీజే శబ్దాల హోరులో మద్యం సేవించి చిందులు వేయడం తదితర అనైతిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ నెల 3న నార్త్‌జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడులు జరిపిన విషయం విదితమే. ఆ సమయంలో బార్ నిర్వాహకులతో పాటు మొత్తం 107 మందిని అరెస్టు చేశారు. వీరిలో 30 మంది యువతులు కాగా మరో 60 మంది యువకులు, 17 మంది నిర్వాహకులు ఉన్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేసును బేగంపేట పోలీసులకు అప్పగించడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బార్లో అశ్లీల కార్యకలాపాలు, నిబంధనలకు విరుద్ధంగా బార్‌ను నిర్వహించడంతో ఆధారాలతో సహా ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఊర్వశి బార్‌ను మూసివేసి లైసెన్స్‌ను రద్దు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆర్బీఐ సంచలన నిర్ణయం..! మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు...!
గత కొన్నిరోజలుగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంకులపై కొరడా ఝలిపిస్తోంది. తాజాగా మరో బ్యాంక్ లెసెన్స్ రద్దు చేసింది. మంతా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. కారణం అదే...! మహారాష్ట్రకు చెందిన మంతా అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితులు బలహీనంగా మారడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మంతా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు నిర్ణయం ఫిబ్రవరి 16 నుంచి అమలులోకి వస్తుందని ఆర్బీఐ తెలిపింది. దీంతో బ్యాంక్ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడానికి వీలు ఉండదు. మహరాష్ట్రలోని కోఆపరేషన్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కమిషన్ కూడా ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని ఆర్బీఐ సూచించింది. దాంతో పాటుగా బ్యాంక్‌కు లిక్విడేటర్‌ను కూడా నియామించాలని ఆర్బీఐ ఆదేశించింది. బ్యాంక్ వద్ద సరిపడినంత మూలధనం లేదని, ఆదాయ మార్గాలు కూడా కనిపించడం లేదని అందుకే బ్యాంక్ లైసెన్స్ రద్దు చేశామని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఖాతాదారులకు డబ్బు చెల్లించని స్థితిలో... మంతా అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ తన వద్ద ఉన్న డబ్బులతో ప్రస్తుతం బ్యాంక్ ఖాతాదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా చెల్లించలేనీ పరిస్థితిలో ఉందని ఆర్బీఐ తెలిపింది. దీంతో ఖాతాదారులు తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉండనుంది. ముందు జాగ్రతగా లైసెన్స్ రద్దు చేశామని ఆర్బీఐ పేర్కొంది. భరోసా ఇచ్చిన ఆర్బీఐ...! బ్యాంక్ లైసెన్స్ రద్దు నేపథ్యంలో మంతా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇకపై డిపాజిట్లు స్వీకరణ,చెల్లింపులు చేయకూడదు. కాగా బ్యాంక్ లెసెన్స్ రద్దు నేపథ్యంలో ఖాతాదారులు భయపడాల్సిన పని లేదని ఆర్బీఐ భరోసా ఇచ్చింది. బ్యాంక్ ఖాతాలో డబ్బులు కలిగిన వారికి వారి డబ్బులు వెనక్కి వస్తాయని తెలిపింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) కింద రూ. 5 లక్షల వరకు డబ్బులు వెనక్కి పొందవచ్చునని తెలిపింది. ఈ బ్యాంకులో రూ. 5 లక్షల వరకు డబ్బులు దాచుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. బ్యాంకులోని 99 శాతం మందికి వారి డబ్బులు పూర్తిగా వెనక్కి వస్తాయని ఆర్బీఐ పేర్కొంది. -
విజయవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్
సాక్షి, విజయవాడ : మందుబాబుల ఆగడాలకు విజయవాడ పోలీసులు చెక్ పెట్టారు. ఆదివారం అర్ధరాత్రి నగరంలోని 8 ప్రాంతాల్లో పోలీసులు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా మందుబాబులు పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 166 మందికి ఏఆర్ గ్రౌండ్స్‌లో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో 138 మోటార్ వాహనాలు, 16 ఆటోలు, 12 కార్లు, 1 టాటా ఏస్‌ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. దీనిపై ట్రాఫిక్ డీసీపీ రాంప్రసాద్ రావు మాట్లాడుతూ.. ఆదివారం ఆర్దరాత్రి నిర్వహించిన తనిఖీల్లో 300కు పైగా కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. విజయవాడను సెఫ్ సిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డవారి లైసెన్స్‌లు రద్దు చేయాల్సిందిగా ఆర్టీవో అధికారులను కోరతామన్నారు. విద్యార్థులు తాగి వాహనాలు నడిపితే పాస్‌పోర్టులు రద్దు చేస్తామని వెల్లడించారు. వారికి కొత్తవి కూడా ఇవ్వమని స్పష్టం చేశారు. టోయింగ్ మొబైల్స్ ద్వారా నగరంలో ట్రాఫిక్ నియంత్రణ చేపడతామని పేర్కొన్నారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు పార్కింగ్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
తాగారో.. బేడీలే
సంగారెడ్డి క్రైం: మద్యం తాగి వాహనాలను నడిపి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. వారి వల్ల ఇతరులకూ ప్రమాదాలు జరిగి ఎన్నో కుటుంబాల్లో చీకట్లు నిండిన సంఘటనలు కోకొల్లలు. యువత ఎక్కువగా మద్యానికి బానిసై వాహనాలు నడిపి ప్రమాదాల కొని తెచ్చుకొని తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిలిస్తున్నారు. స్వరాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పింఛన్లపై అధ్యయనం చేశారు. వీటిలో వితంతు పింఛన్ పొందుతున్న వారిలో 35 ఏళ్లలోపు మహిళలు ఎక్కువగా ఉన్నారు. మద్యం తాగి వాహనాలను నడపడం వల్లే వారి కుటుంబాల్లో చీకట్లు కమ్ముకున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో వాటి నియంత్రణ కోసం డ్రంకెన్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా పోలీసులు నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.. పెరుగుతున్న డ్రంకెన్ డ్రైవ్ కేసులు రోజు రోజుకూ ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు పెరగడంతో ప్రభుత్వానికి కూడా అదే స్థాయిలో ఆదాయం సమకూరుతుంది. మద్యం తాగి వాహనాలు నడపడంతో సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు రింగురోడ్డుపై తరచుగా ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. 65వ జాతీయ రహదారి సంగారెడ్డి జిల్లా మీదుగా వెళుతుండడంతో మద్యం తాగి వాహనాలు నడిపే వారిని నియంత్రించడానికి రామచంద్రపురం, పటాన్చెరువు, బీడీఎల్ భవనాలు, సంగారెడ్డి, సదాశివపేట, కొండాపూర్, మునిపల్లి, జహీరాబాద్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. మెదక్ జిల్లాలో 44వ జాతీయ రహదారి ఉండటంతో నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్గీగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే పెద్దపెద్ద గూడ్స్ లారీల డ్రైవర్లు మద్యం తాగి నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కాళ్లకల్, తూప్రాన్ దగ్గర్లో నాగులపల్లి చౌరస్తా చేగుంట, రామాయంపేట ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారుల పక్కనే దాబాల్లో మద్యం సిట్టింగ్ ఉండటం ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం అవుతున్నాయని చెప్పొచ్చు. అవగాహన సదస్సులతో.. జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలను నివారించడానికి పోలీస్ యంత్రాంగం చొరవ చూపుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లకు, ఇతర ప్రైవేట్ వాహనదారులకు ఆర్టీఏ అధికారులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, సదస్సులను నిర్వహిస్తున్నారు. సిద్దిపేటలో ప్రత్యేక కార్యక్రమాలు.. సిద్దిపేట జిల్లాలో పోలీస్ యంత్రాంగం ‘‘కనువిప్పు’’ అనే కార్యక్రమం పేరుతో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో డ్రంకెన్ డ్రైవ్, రైతు ఆత్మహత్యలు, బాల్యవివాహాలు, మూఢ నమ్మకాలు, నకిలీ బంగారు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వారంలో నాలుగు రోజులు కళా బృందాలతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 105 గ్రామాల్లో అవగాహన కల్పించారు. దీని ద్వారా చాలా వరకు డ్రంకెన్ డ్రైవ్ కేసులు తగ్గాయని అధికారులు తెలిపారు. పర్సంటేజీ ప్రకారమే శిక్ష డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి మద్యం తాగిన పర్సంటేజీని బట్టి కేసు నమోదు చేయడంతోపాటు జైలుకు పంపే విధానాన్ని ఖరారు చేశారు. సుమారు 30కి పైగా పర్సంటేజీ వస్తే కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తారు. జడ్జి తీర్పునుబట్టి శిక్ష ఖరారవుతుంది. 30లోపు పర్సంటేజీ వస్తే పోలీసులే జరిమానాలతోపా టు కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తారు. మెదక్ జిల్లాలో ఈ ఏడాది 23 మంది మద్యం తాగి వాహనాలు నడిపి జైలు కు వెళ్లారు.సంగారెడ్డిలో 2017లో 299 మంది జైలుకు వెళ్లారు. పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరి«ధిలో డ్రంకెన్ డ్రైవ్ కార్యక్రమాలను నిర్వహిస్తూ మద్యం తాగి వాహనాలు నడపకుండా పర్యవేక్షిస్తున్నాం. పట్టుబడిన మద్యం ప్రియులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. – చందనదీప్తి, మెదక్ ఎస్పీ చాలా వరకు కేసులు తగ్గాయి డ్రంకెన్ డ్రైవ్ నిరంతరం కొనసాగించడంతో మద్యం తాగి వాహనాలు నడిపేవారి సంఖ్య చాలా వరకు తగ్గింది. మద్యం తాగి వాహనాలు నడపకుండా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. డ్రైవర్లకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. హైవేలపై పెట్రోలింగ్ వాహనాలతో గస్తీలు ము మ్మరం చేశాం.–చంద్రశేఖర్‌రెడ్డి, సంగారెడ్డి ఎస్పీ -
మ్యాక్స్ హాస్పిటల్‌పై వేటు పడింది
పుట్టిన బిడ్డను బతికుండగానే చనిపోయినట్టు ధ్రువీకరించిన మ్యాక్స్ హాస్పిటల్ షాలిమార్ బాగ్‌పై వేటు పడింది. ఈ హాస్పిటల్ లైసెన్సును రద్దు చేస్తున్నట్టు ఢిల్లీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. నిరక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు తేలిందని, ఈ మేరకు లైసెన్సును రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు విచారణలో తేలితే హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేస్తామని ఢిల్లీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ గతవారమే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాక ఆర్థికంగా వెనుకబడినవర్గాలకు చెందిన రోగులకు నిబంధనల ప్రకారం వైద్యసేవలు అందించడం లేదని ఇదే హాస్పిటల్‌కు ఈ ఏడాది నవంబర్ 22న షోకాజ్ నోటీసులు జారీచేసినట్టు తెలిపారు.. ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌లో ఉన్న మ్యాక్స్ హాస్పిటల్లో నవంబర్ 30న ఓ మహిళ నవమాసాలు నిండకుండానే కవలల (ఒక ఆడ, ఒక మగ బిడ్డ)కు జన్మనిచ్చింది. పిల్లలిద్దరు చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించి, వారిని పాలిథిన్ కవర్లో పెట్టి తల్లిదండ్రులకు అందించారు. అంత్యక్రియలకు తరలిస్తుండగా.. కవలల్లో ఒకరైన మగబిడ్డ బతికే ఉన్నట్టు తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే ఆ బాబును దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. తల్లి ఇంకా మ్యాక్స్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ విచారణ మేరకు హాస్పిటల్ నిర్లక్ష్యం ఉన్నట్టు తేలిందని తెలిసింది. -
అబ్బా.. నిషా దెబ్బ
మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కోర్టు కొరడా ఝళిపించింది. పదే పదే పట్టుబడిన ఇద్దరు డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్‌లు శాశ్వతంగా రద్దు చేసింది. మరో 13 మందివి నిర్ణీత కాలానికి సస్పెండ్ చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా 154 మందికి జైలు శిక్ష విధించింది. సాక్షి, సిటీబ్యూరో: మద్యం తాగి భారీ వాహనాలు నడుపుతూ చిక్కిన, పదేపదే పట్టుబడుతున్న ‘నిషా’చరులపై న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇద్దరి డ్రైవింగ్ లైసెన్సులు శాశ్వతంగా రద్దు చేస్తూ, మరో 13 మందివి నిర్ణీత కాలానికి సస్పెండ్ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) డాక్టర్ వి.రవీందర్ సోమవారం తెలిపారు. ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్‌లో చిక్కిన 614 మంది మందుబాబులపై అధికారులు కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. వీరిని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో (టీటీఐ) కౌన్సిలింగ్ అనంతరం కోర్టులో హాజరుపరిచారు. వాహనం నడిపే సమయంలో వీరు తీసుకున్న మద్యం మోతాదు, నడుపుతున్న వాహనరకం, గతంలో పట్టుబడిన చరిత్ర తదితరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం 154 మందికి జైలు శిక్ష విధించింది. చంచల్‌గూడ జైలుకు వెళ్లిన వారిలో 21 మందికి పది రోజులు, ఒకరికి ఎనిమిది రోజులు, ముగ్గురికి వారం, నలుగురికి ఆరు రోజులు, 13 మందికి ఐదు రోజుల, 19 మందికి నాలుగు రోజులు, 15 మందికి మూడు రోజులు, 78 మందికి రెండు రోజులు జైలు శిక్షలు పడినట్లు రవీందర్ వివరించారు. వీరితో పాటు మిగిలిన వారికీ న్యాయస్థానం రూ.13.32 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. వీరిలో ఇద్దరి డ్రైవింగ్ లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేసిన కోర్టు, ఐదుగురివి రెండేళ్ల పాటు, ముగ్గురివి ఏడాది, మరో ఐదుగురివి ఆరు నెలలు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన వివరించారు. సైబరాబాద్‌లో 315 డ్రంకన్ డ్రైవ్ కేసులు మద్యం తాగి బండి నడుపుతున్న డ్రంకన్ డ్రైవర్లపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ నెల ఒకటి నుంచి 15వ తేదీలోగా 315 మందిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వీరిలో 12 మందికి ఒకటి నుంచి 12 రోజుల పాటు జైలు శిక్ష పడిందని తెలిపారు. -
చీటికీమాటికీ సమ్మెలేంటి?
♦ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులపై సర్కారు ఆగ్రహం ♦ నోటీసు లేకుండా సమ్మెలపై సీరియస్ ♦ తరచూ సమ్మెకు దిగే ఆస్పత్రుల లైసెన్సు రద్దుకు యోచన ♦ దసరాకల్లా రూ. 300 కోట్ల బకాయిల విడుదల ♦ తక్షణమే రూ. 100 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లు ♦ ఇకపై నెలనెలా నిధుల విడుదలకు చర్యలు ♦ సమ్మె విరమణకు మంత్రి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: పెండింగ్ బకాయిల కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మెకు దిగడాన్ని వైద్య, ఆరోగ్యశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ముందస్తు సమాచారం లేకుండా చీటికీమాటికీ సమ్మెకు వెళ్లడంపై మండిపడుతోంది. తరచూ సమ్మె చేసే ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడంతోపాటు వాటి లెసైన్సు రద్దు చేయాలని యోచిస్తోంది. పేద రోగులను అడ్డుపెట్టుకుని ఆస్పత్రులు బ్లాక్ మెయిల్ చేయడం సరికాదని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ సమ్మె చేయాల్సి వస్తే నాలుగైదు రోజుల ముందే నోటీసు ఇస్తే వాస్తవ పరిస్థితిని తెలియజేస్తామని...అవసరమైతే వారి డిమాండ్లపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుందని పేర్కొంటున్నారు. అలా కాకుండా ఈ ఏడాది ఇప్పటికి మూడుసార్లు సమ్మెకు వెళ్లడం వల్ల రోగుల్లో ఆందోళన నెలకొందని, వారి వైద్య చికిత్సలను పణంగా పెట్టేలా ఆస్పత్రులు వ్యవహరిం చడం మంచిది కాదంటున్నారు. ప్రభుత్వం ప్రాధాన్యం ప్రకారం నిధులను కేటాయిస్తుందని... ఒక్కోసారి ఆలస్యమైతే తమ దృష్టికి తీసుకురావాలే కానీ ఇలా చేయకూడదని వారు హితవు పలుకుతున్నారు. వెంటనే సమ్మెను విరమించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆస్పత్రి వర్గాలను కోరారు. తక్షణం రూ. 100 కోట్లు విడుదల ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రులకు దాదాపు రూ. 430 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో పాత బకాయిలు పోనూ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ నెల 2(ఆదివారం) నాటికి రూ. 246.24 కోట్లు చెల్లిం చాల్సి ఉండగా ప్రభుత్వం కేవలం రూ. 38.74 కోట్లు మాత్ర మే చెల్లించింది. అంటే ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ. 207.50 కోట్లు ప్రభుత్వం బకాయి పడింది. అయితే ఆస్పత్రుల సమ్మె నేపథ్యంలో పాత బకాయిలు, ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన బకాయిల్లో దసరా నాటికి రూ. 300 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందులో తక్షణమే రూ. 100 కోట్లు విడుదల చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ‘సాక్షి’కి తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఆర్థిక శాఖ చేపడుతోం దని ఆయన వివరించారు. అలాగే ఇకపై ఆస్పత్రులకు నెల నెలా నిధులు విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, ప్రభుత్వాస్పత్రులకు ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ. 91.45 కోట్ల బిల్లులు చెల్లిం చాల్సి ఉండగా ప్రభుత్వం కేవలం రూ. 5.45 కోట్లే చెల్లించింది. 500 కోట్లు చెల్లించే వరకు సేవలు పునరుద్ధరించం ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్ గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తమ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపేయాల్సి వచ్చిందని ప్రైవేటు, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ వెల్లడించింది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలోని ఆస్పత్రులకు రూ. 500 కోట్ల బకాయిలు చెల్లించే వరకు ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించబోమని తేల్చిచెప్పింది. సంఘం ప్రతినిధులు డాక్టర్ ఇంద్రాసేనారెడ్డి, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ తిరుపతిరెడ్డి, డాక్టర్ రఘుపతిరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పెండింగ్ బకాయిలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ప్రభుత్వ కార్యదర్శి, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోరుుందన్నారు. మే నెలలోనే బకారుులను చెల్లించాలని సమ్మె చేసినప్పుడు 2 నెలల్లో చెల్లిస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ఆ మాటను పక్కన పెట్టిందన్నారు. ప్రభుత్వానికి నోటీసులు పంపామని, స్పందించక పోవడం వల్లే ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేశామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఒకట్రెండు ఆస్పత్రులు మినహా అన్ని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు సహా ప్రైవేటు, నర్సింగ్ హోమ్స్ యథావిధిగా ఆరోగ్యశ్రీ రోగులకు చికిత్సలు అందించాయి. ప్రైవేటు నర్సింగ్ హోమ్స్ సమ్మె ప్రకటన నేపథ్యంలో సోమవారం ఆయా ఆస్పత్రులకు ఓపీ, ఐపీ రోగుల సంఖ్య సగానికి తగ్గింది. -
ఫ్రైడే బార్ లైసెన్స్ రద్దు!
సాక్షి, హైదరాబాద్: పంజగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి రమ్య మృతికి కారణమైన శ్రావెల్ మద్యం సేవించిన బార్ లెసైన్స్‌ను సస్పెండ్ చేయాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలోని పంజగుట్ట స్మశాన వాటిక వద్ద ఈ నెల 1న జరిగిన ఈ ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. (రమ్యని తాగేశారు) ప్రమాదం జరిగిన నాటికి నిందితుడు శ్రావెల్ వయస్సు 21 ఏళ్ళ కంటే తక్కువే ఉంది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా అతడికి మద్యం సరఫరా చేసిన టీజీఐ ఫ్రైడే బార్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు విభాగం ఎక్సైజ్ శాఖకు సిఫార్సు చేసింది. ఈ మేరకు సదరు బార్‌కు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ షోకాజ్ నోటీసు జారీ చేయగా, శనివారం బార్ యాజమాన్యం కమిషనరేట్‌కు వివరణ అందజేసింది. అయితే, ఆ వివరణకు సంతృప్తి చెందని కమిషనర్ సస్పెన్షన్‌కు నిర్ణయించినట్లు సమాచారం. -
ప్రమాదానికి పాల్పడితే లైసెన్స్ రద్దు
సాక్షి, హైదరాబాద్: ఏపీలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఏడాదికి 8 వేల మందికిపైగా పౌరులు మృత్యువాత పడుతున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రోడ్డు ప్రమాదాల కట్టడికి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) కృష్ణారావు ఆధ్వర్యంలో శనివారం రహదారులు, రవాణా, హోం శాఖ ఉన్నతాధికారులతో హైదరాబాద్‌లో సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు లేదా మూడుసార్లు రోడ్డు ప్రమాదాలకు పాల్పడిన డ్రైవర్ల లెసైన్సులను రద్దు చేయాలని నిర్ణయించారు. -
మందు కొడితే.. 25 వేలు
హైదరాబాద్: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడినా ఐదో పదో ఇచ్చి తప్పించుకోవచ్చు అనుకునే వాళ్లకు చేదువార్త.. రేపటినుంచి నూతన వాహన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వాహన నిబంధనలు మార్చాలని యోచించిన ప్రభుత్వం దీనికి సంబంధించిన ఫైల్‌ను రాజ్యసభలో ఈ నెల 11న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.. అమలులోకి రానున్న నూతన నిబంధనల ప్రకారం మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే.. 25 వేలు జరిమాన పడనుంది. అంతేకాకుండా మూడు సార్లకంటే ఎక్కువ సార్లు ఈ తప్పుచేస్తే లెసైన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. అలాగే సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాన్ని నడిపినా.. భారీ మూల్యం చెల్లించాల్సిందే .. అందుకే వాహనదారులారా తస్మత్ జాగ్రత్త.