ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విజయవాడ : మందుబాబుల ఆగడాలకు విజయవాడ పోలీసులు చెక్ పెట్టారు. ఆదివారం అర్ధరాత్రి నగరంలోని 8 ప్రాంతాల్లో పోలీసులు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా మందుబాబులు పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 166 మందికి ఏఆర్ గ్రౌండ్స్‌లో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో 138 మోటార్ వాహనాలు, 16 ఆటోలు, 12 కార్లు, 1 టాటా ఏస్‌ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
దీనిపై ట్రాఫిక్ డీసీపీ రాంప్రసాద్ రావు మాట్లాడుతూ.. ఆదివారం ఆర్దరాత్రి నిర్వహించిన తనిఖీల్లో 300కు పైగా కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. విజయవాడను సెఫ్ సిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డవారి లైసెన్స్‌లు రద్దు చేయాల్సిందిగా ఆర్‌టీవో అధికారులను కోరతామన్నారు. విద్యార్థులు తాగి వాహనాలు నడిపితే పాస్‌పోర్టులు రద్దు చేస్తామని వెల్లడించారు. వారికి కొత్తవి కూడా ఇవ్వమని స్పష్టం చేశారు. టోయింగ్ మొబైల్స్ ద్వారా నగరంలో ట్రాఫిక్ నియంత్రణ చేపడతామని పేర్కొన్నారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు పార్కింగ్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment