ఎమ్యెల్యే జలీల్‌ఖాన్‌ తనయుడి వీరంగం! | mla jaleel khan son halchal in vijayawada last night | Sakshi
Sakshi News home page

ఎమ్యెల్యే జలీల్‌ఖాన్‌ తనయుడి వీరంగం!

Published Thu, Jan 18 2018 7:42 AM | Last Updated on Tue, Aug 21 2018 6:02 PM

mla jaleel khan son halchal in vijayawada last night - Sakshi

సాక్షి, విజయవాడ: సిటీలో బుధవారం అర్థరాత్రి ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ కూమారుడు సాహుల్‌ ఖాన్‌ హంగామా సృష్టించాడు. వివరాలివి.. స్నేహితులతో కలిసి కారును అతివేగంతో నడిపారు. అంతేకాక పిన్నమనేని పాలిక్లీనిక్‌ రోడ్‌లో ఓ బైక్‌ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఓ ప్రైవేట్ ఉద్యోగికి తీవ్రగాయాలయ్యాయి. కారులో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కొడుకు సాహుల్ ఖాన్ ఉన్నట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. కాగా కారు నడుపుతున్న కృష్ణతేజా అనే యువకుడిని మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ఆ యువకుడు మద్యం సేవించి డ్రైవింగ్‌ చేసినట్లు గుర్తించారు. కాగా, ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అంతేకాక ఎమ్మెల్యే తనయుడు పోలీసులతో కూడా దురుసుగా ప్రవర్తించాడు. ఆ కారును  ఫొటోలు తీస్తున్న పోలీసులపై ఎమ్మెల్యే తనయుడు సాహుల్‌ ఖాన్‌ వీరంగం సృష్టించాడు. అయితే మీడియా కెమెరాలను చూసి అక్కడికి సైలెంట్‌ గా జారుకున్నాడు. కాగా కారు శాఖమూరి ప్రవీణ్ చౌదరి పేరుపై రిజిస్ట్రర్ అయివుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement