New Year: విశాఖ, విజయవాడలో ఆంక్షలు ఇవే.. | New Year Restrictions In Visakhapatnam And Vijayawada | Sakshi
Sakshi News home page

New Year: విశాఖ, విజయవాడలో ఆంక్షలు ఇవే..

Published Sun, Dec 31 2023 8:57 PM | Last Updated on Sun, Dec 31 2023 9:02 PM

New Year Restrictions In Visakhapatnam And Vijayawada - Sakshi

సాక్షి, విశాఖ/విజయవాడ: న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా విశాఖపట్నం, విజయవాడలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈవెంట్స్‌, బార్స్‌, రెస్టారెంట్లకు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే అనుమతిచ్చారు. రూల్స్‌ ఎవరు అతిక్రమించినా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

విశాఖలో ట్రాఫిక్‌ ఆంక్షలు..

  • రేపు ఉదయం ఐదు గంటల వరకు ఫ్లైఓవర్లు, రోడ్లు మూసివేత
  • బీఆర్టీఎస్‌ రోడ్‌, తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌, హనమంత వాక నుంచి అడవివరం జంక్షన్‌ వరకు ట్రాపిక్‌ ఆంక్షలు. 
  • పెందుర్తి జంక్షన్‌ నుంచి ఎన్‌ఏడీ మీదుగా కాన్వెంట్‌ జంక్షన్‌ వరకు మూసివేత. 
  • ఈవెంట్స్‌, బార్స్‌, రెస్టారెంట్లకు ఒంటి గంట వరకు మాత్రమే అనుమతి. 
  • రూల్స్‌ ఎవరు అతిక్రమించినా వారిపై చర్యలు. 
  • విశాఖ బీచ్‌ రోడ్‌లోకి వాహనాలకు అనుమతి నిరాకరణ. 

విజయవాడలో పోలీసుల ఆంక్షలు

  • విజయవాడ సీపీ మాట్లాడుతూ.. పోలీసు యాక్ట్‌, 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. 
  • డీజేలకు ఎలాంటి అనుమతి లేదు. 
  • నగరంలోని ఫ్లైఓవర్లు మూసివేత. 
  • బందర్‌రోడ్‌లో వాహనాలకు అనుమతి లేదు. 
  • ర్యాష్‌ డ్రైవింగ్‌, డ్రంకన్‌ డ్రైవ్‌ చేసిన వారిపై కఠిన చర్యలు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement