హైదరాబాద్: బేగంపేటలోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఎక్సైజ్ అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బార్‌లో యువతులు అశ్లీల నృత్యాలు చేయడం, యువకులను రెచ్చగొట్టడం, డీజే శబ్దాల హోరులో మద్యం సేవించి చిందులు వేయడం తదితర అనైతిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ నెల 3న నార్త్‌జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడులు జరిపిన విషయం విదితమే.
ఆ సమయంలో బార్ నిర్వాహకులతో పాటు మొత్తం 107 మందిని అరెస్టు చేశారు. వీరిలో 30 మంది యువతులు కాగా మరో 60 మంది యువకులు, 17 మంది నిర్వాహకులు ఉన్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేసును బేగంపేట పోలీసులకు అప్పగించడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బార్‌లో అశ్లీల కార్యకలాపాలు, నిబంధనలకు విరుద్ధంగా బార్‌ను నిర్వహించడంతో ఆధారాలతో సహా ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఊర్వశి బార్‌ను మూసివేసి లైసెన్స్‌ను రద్దు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment