
పంజగుట్ట రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రమ్య(ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: పంజగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి రమ్య మృతికి కారణమైన శ్రావెల్ మద్యం సేవించిన బార్ లెసైన్స్‌ను సస్పెండ్ చేయాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలోని పంజగుట్ట స్మశాన వాటిక వద్ద ఈ నెల 1న జరిగిన ఈ ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. (రమ్యని తాగేశారు)
ప్రమాదం జరిగిన నాటికి నిందితుడు శ్రావెల్ వయస్సు 21 ఏళ్ళ కంటే తక్కువే ఉంది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా అతడికి మద్యం సరఫరా చేసిన టీజీఐ ఫ్రైడే బార్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు విభాగం ఎక్సైజ్ శాఖకు సిఫార్సు చేసింది. ఈ మేరకు సదరు బార్‌కు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ షోకాజ్ నోటీసు జారీ చేయగా, శనివారం బార్ యాజమాన్యం కమిషనరేట్‌కు వివరణ అందజేసింది. అయితే, ఆ వివరణకు సంతృప్తి చెందని కమిషనర్ సస్పెన్షన్‌కు నిర్ణయించినట్లు సమాచారం.