మందు కొడితే.. 25 వేలు
హైదరాబాద్: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడినా ఐదో పదో ఇచ్చి తప్పించుకోవచ్చు అనుకునే వాళ్లకు చేదువార్త.. రేపటినుంచి నూతన వాహన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వాహన నిబంధనలు మార్చాలని యోచించిన ప్రభుత్వం దీనికి సంబంధించిన ఫైల్‌ను రాజ్యసభలో ఈ నెల 11న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.. అమలులోకి రానున్న నూతన నిబంధనల ప్రకారం మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే.. 25 వేలు జరిమాన పడనుంది.
అంతేకాకుండా మూడు సార్లకంటే ఎక్కువ సార్లు ఈ తప్పుచేస్తే లెసైన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. అలాగే సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాన్ని నడిపినా.. భారీ మూల్యం చెల్లించాల్సిందే .. అందుకే వాహనదారులారా తస్మత్ జాగ్రత్త.