liquor drink
-
రూ. 30 కోసం హత్య!
బేల(ఆదిలాబాద్) : తాగిన మైకంలో కేవలం రూ. 30 కోసం ఒకరి ప్రాణాలు బలిగొన్న ఘటన బేలమండలం సిర్సన్న గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర నుంచి 12 ఏళ్ల క్రితం డాకురే శ్యాంరావు(32) సిర్సన్న గ్రామానికి వలస వచ్చాడు. గ్రామంలో ఉంటూ కూలీ పని చేస్తున్నాడు. మహారాష్ట్రలోని యావత్మాల్ ప్రాంతం నుంచి రెండు వారాల క్రితం వచ్చిన శ్యాంరావు మేన బావమరిది డాకే మనోహర్ కూడా ఇక్కడే నివాసం ఉంటున్నాడు. ఇద్దరు కలిసి బుధవారం మద్యం తాగి గొడవపడ్డారు. తనకు ఇవ్వాల్సిన రూ.30 తనకివ్వాలంటూ మనోహర్, శ్యాంరావు గొంతునొక్కాడు. దీంతో శ్యాంరావు స్పృహ కోల్పోయాడు. అనంతరం శ్యాంరావును ఇంటికి తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టగానే మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. -
మహిళతో అసభ్యకరంగా మాట్లాడినందుకు..
అనంతపురం(సోమన్దేవ్పల్లి): సోమన్దేవ్పల్లి మండల కేంద్రంలోని మెయిన్ బజార్లో మిరపకాయ బజ్జీలు అమ్ముకునే మహిళ ఓ తాగుబోతుకు చెప్పుతో బుద్ధిచెప్పింది. మద్యం తాగి ఉన్న వ్యక్తి సదరు మహిళతో అసభ్యకరంగా మాట్లాడటంతో ఆమెకు కోపం వచ్చి చెప్పుతో ఎడాపెడా వాయించింది. స్థానికులు తాగుబోతును అక్కడి నుంచి పంపించివేయడంతో గొడవ సద్దుమణిగింది. సందట్లో సడేమియాగా కొందరు యువకులు ఈ గొడవను తమ సెల్ఫోన్లలో వీడియో తీసి స్నేహితులకు పంపించి ఆనందిస్తున్నారు. కాసేపు అయిన తర్వాత ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. -
భర్తపై భార్య గొడ్డలితో దాడి
సత్తుపల్లి (ఖమ్మం): భర్త పెట్టే చిత్రహింసలకు తాళలేక ఓ భార్య తిరగబడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గంగారం 15వ గిరిజన బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కొమరం నరేష్ మద్యం తాగి వచ్చి నిత్యం భార్య శ్రావ్యను చితకొట్టేవాడు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో భార్యను కొట్టి మద్యం సేవించి మళ్లీ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో నిద్రపోతున్న మూడేళ్ల కుమార్తెపై చేయిచేసుకుంటుండగా శ్రావ్య అడ్డుపడింది. దీంతో ఆమెను కూడా కొట్టడంతో ఒక మూలన పడిపోయింది. అక్కడే ఉన్న గొడ్డలిని తీసుకొని నరేష్‌పై దాడి చేసింది. మెడ, ఛాతి, చేయిపై తీవ్ర గాయాలపాలైన నరేష్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చుట్టుపక్కల వారు సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. 2009లో కొమరం నరేష్‌కు శ్రావ్యతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. -
మద్యం మత్తులో పట్టుబడ్డ విదేశీ విద్యార్థులు
శామీర్‌పేట్: రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లియోనియా రిసార్టులోని లియోక్లబ్‌లో నిబంధనలను ఉల్లంఘించిన 19 మంది విదేశీ యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుడాన్, సోమాలియా, నమీబియా, నైజీరియా, టాంజానియా, కెమారాన్, యుగాండాలకు చెందిన ఎనిమిది మంది యువతులు, 11 మంది యువకులు నగరంలోని పలు కాలేజీల్లో చదువుకుంటున్నారు. వీరంతా లియోక్లబ్‌లో వీకెండ్ పార్టీకి వచ్చారు. అర్ధరాత్రి తర్వాత నిబంధనలకు విరుద్ధంగా మద్యం తాగుతూ డీజీహోరులో నృత్యం చేస్తుండగా మాదాపూర్ ఎస్వోటీ, శామీర్‌పేట్ పోలీసులు క్లబ్‌పై దాడి చేసి పట్టుకున్నారు. నిర్వాహకులు జమాసిమాదాణియా, భరద్వాజ్‌లను అదుపులోకి తీసుకున్నారు. -
మందు కొడితే.. 25 వేలు
హైదరాబాద్: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడినా ఐదో పదో ఇచ్చి తప్పించుకోవచ్చు అనుకునే వాళ్లకు చేదువార్త.. రేపటినుంచి నూతన వాహన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వాహన నిబంధనలు మార్చాలని యోచించిన ప్రభుత్వం దీనికి సంబంధించిన ఫైల్‌ను రాజ్యసభలో ఈ నెల 11న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.. అమలులోకి రానున్న నూతన నిబంధనల ప్రకారం మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే.. 25 వేలు జరిమాన పడనుంది. అంతేకాకుండా మూడు సార్లకంటే ఎక్కువ సార్లు ఈ తప్పుచేస్తే లెసైన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. అలాగే సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాన్ని నడిపినా.. భారీ మూల్యం చెల్లించాల్సిందే .. అందుకే వాహనదారులారా తస్మత్ జాగ్రత్త.